ఆ ఆత్మీయ స్పర్శే చరిత్రకు సాక్షి | Narendra modi Embraces Nawza sharif at lahor airport | Sakshi
Sakshi News home page

ఆ ఆత్మీయ స్పర్శే చరిత్రకు సాక్షి

Published Thu, Dec 31 2015 9:15 AM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

ఆ ఆత్మీయ స్పర్శే చరిత్రకు సాక్షి - Sakshi

ఆ ఆత్మీయ స్పర్శే చరిత్రకు సాక్షి

అదొక ఆత్మీయ స్పర్శ...రెండు దేశాల ప్రజలు ఎన్నడూ చూడని వర్తమానం... చరిత్రకు సాక్షీభూ తంగా నిలిచిన చరిత్రాత్మక ఘట్టం. స్వయంగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్... భారత ప్రధాని నరేంద్రమోదీని లాహోర్ ఎయిర్ పోర్టుకు వచ్చి స్వాగతం పలికి... తన నివాసానికి తోడ్కొని వెళ్లడం... పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం మొదలు... ఆ తర్వాత రెండు దేశాల ద్వైపాక్షిక చర్చలను కొత్త పుంతలు  తొక్కించడం... చర్చలు పూర్తయ్యాక తిరిగి మోదీకి స్వయంగా షరీఫ్ వీడ్కోలు పలకడాన్ని చూసిన రెండు దేశాల ప్రజలు పులకించిపోయారు. విదేశీ నీతిని దేశానికి సరికొత్త రీతిలో ఆవిష్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ... తాజాగా ఒకేరోజు రెండు పొరుగు దేశాల పర్యటనతో చూపిన దౌత్యనీతి నభూతో నభవిష్యత్. రెండు పొరుగు దేశాలైన అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ పర్యటనలపై తనదైన ముద్రవేశారు.
 
 తాలిబాన్ పతనం తర్వాత ప్రజాస్వామ్య దేశంగా రూపాంతరం చెందుతున్న అఫ్ఘాని స్తాన్ పునర్నిర్మాణంలో మన దేశం పోషిస్తున్న కీలక పాత్రకు మోదీ తనదైన ముద్రవేశారు. ప్రజాస్వామ్యానికి గుండె కాయ ఆయా దేశాల పార్లమెంట్లుగా ప్రపంచదేశాలు భావి స్తుంటాయి. అలాంటి పార్లమెంట్ భవనాన్ని, అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న అఫ్ఘానిస్తాన్‌కు మన దేశం బహుమతిగా అందించడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిం చాల్సిన విషయం. అఫ్ఘానిస్తాన్ పునర్నిర్మాణంలో భారత్ కీలకంగా మారింది. తాలిబాన్ పతనం తర్వాత ప్రజాస్వా మ్యదేశంగా ఆవిర్భవిస్తున్న ఆ దేశానికి భారత్ ఆపన్నహస్తం అందించింది. పాకిస్తాన్‌తో ఉన్న సమస్యల నేపథ్యంలో భారత్ అఫ్ఘానిస్తాన్ విషయంలో మొదట్నుంచి ఉదారత చాటుకుంటూ వస్తోంది.
 
 నాటి ప్రధాని వాజ్‌పేయి పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియ ను పునర్ వ్యవస్థీకరించి లాహోర్ బస్సు యాత్ర చేప ట్టారు. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కలిసి రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణ ఏర్పరిచారు. శాంతి తోనే రెండు దేశాలకు భవిత అంటూ నాడు లాహోర్ డిక్లరేషన్ ద్వారా చాటారు. అటల్జీ తర్వాత అంటే దాదాపు పదేళ్లపాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు చర్చల ప్రక్రి యను చేపట్టకపోవడం విడ్డూరం. వాజ్‌పేయి పరచిన శాంతి బాట పునరుద్ధరించడానికి పదేళ్లకుపైగా పట్ట డం శోచనీ యం. వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా అదే స్ఫూర్తిని ప్రధాని మోదీ కనబర్చడం శుభపరిణామం. అటు వాజ్ పేయి పుట్టినరోజు, ఇటు షరీఫ్ పుట్టినరోజున భారత చర్చల ప్రక్రియకు కొత్తశకం పూరించారు. పాకిస్తాన్ ప్రజా స్వామ్య బద్ధపాలనలో ఉండటం భారత్‌కు ఎంతో శ్రేయస్కరమని వాజ్‌పేయి సూచించిన దారిని ఇప్పుడు మోదీ-షరీఫ్ అనుస రించడం రెండు దేశాలకు స్ఫూర్తిదాయకం.
 రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు సఫలం కావా లని ఐక్యరాజ్యసమితి చీఫ్ బాన్ కీ మూన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య చర్చలను అమెరికా స్వాగతిం చింది. రెండు దేశాలు అన్ని సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని మరోసారి స్పష్టం చేసింది. చర్చలు రెండు దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనకారిగా పేర్కొంది. ఇక గల్లీ నుంచి వాషింగ్టన్ వరకు పత్రికల్లో మోదీ లాహోర్ సర్‌ప్రైజ్ విజిట్‌పై ప్రముఖంగా కథనాలిచ్చింది.
 
 అయితే అఫ్ఘానిస్తాన్‌తో చెలిమి తర్వాత పాకిస్తాన్‌తో మెరుగైన సంబంధాల కోసం మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. దాంట్లో భాగం గా ప్రపంచవేదికలపై ప్రధాని నవాజ్ షరీఫ్‌తో అన్ని విష యాలను మోదీ సర్కారు చర్చిస్తూనే ఉంది. అది అధికారుల స్థాయి కానివ్వండి... మంత్రుల స్థాయి కానివ్వండి... నేడు ప్రధాని స్థాయి వరకు కానివ్వండి.
 
 శాంతి నెలకొనడం వల్ల సరిహద్దు ప్రాంతాల ప్రజలతో పాటు రెండు దేశాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది కదా... ప్రధాని ఆకస్మి కంగా పాకిస్తాన్ వెళ్లడంపైనా కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు రాద్ధాంతం చేయడం సబబేనా? యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లలో ఒక్కసారైనా ఆ దేశానికి భారత ప్రధాని వెళ్లక పోవడం శోచనీయం కాదా... ఆ దేశాన్ని చర్చల స్రవంతిలోకి తీసుకురావాలనుకోవడం గొప్ప విషయమే కదా...
 
 మోదీ-షరీఫ్ ద్వయం శాంతి కోసం చేస్తున్న కృషి నిజంగా చిరస్మరణీయమైనది. రెండు దేశాలకు ఇప్పుడు శాంతి ఎంతో ముఖ్యం. అందుకు వారు మరిన్ని సమావే శాలకు బాటలు పరిచి రెండు దేశాల మధ్య అన్ని సమస్య లకు పరిష్కారాన్ని కనుగొనాలి. ఇక్కడో విషయం... పాకిస్తాన్ కంటే భారత్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. దేశ విభజన తర్వాత వారు మన మట్టిలో భాగమైపోయారు. మిగతా మతాలతో కలిసి సహజీవన మైత్రిని సాగిస్తున్న తరుణమిది. భారత్‌తో అనవసరమైన శత్రుత్వం పాకిస్తాన్‌కు శుభసూచికం కాదు. పాకిస్తాన్-భారత్ మైత్రి వల్ల ఇరు దేశాల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది.
 
 రెండు దేశాల సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకుంటూనే... ప్రజల మధ్య వారధి నిర్మించాల్సిన బాధ్యత ఉంది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక కీలక దేశాలను చుట్టివచ్చారు. వెళ్లిన ప్రతీ చోట భారత్ ఫస్ట్ నినాదాన్ని చాటారు. ఒక గుజరాతీ ప్రధానిగా దేశానికి నేతృత్వం వహిస్తే ఆర్థికంగా ఆ దేశ ప్రజలకు ఎలాంటి మేలు చేయొచ్చో ఆయన ఆచరణలో చేసి చూపిస్తున్నారు. తద్వారా ఒకరికి ఒకరు ఎంత అవసరమో చాటుతున్నారు. తీవ్రవాదం వల్ల ప్రపంచంలో ఎక్కువగా నష్టపోయింది భారత దేశమని చాటుతూ... తీవ్రవాద అంతానికి ప్రపంచదేశాలు ఏకం కావాలని, అది ఒక్కరి సమస్యగా చూడరాదని, ప్రపంచం బాధ్యతగా చూడాలని కుండబద్దలు కొడుతున్నారు.
 తనదాకా వస్తే గానీ తీవ్రవాదం సంగతి తెలియదని మొన్న అమెరికాకు, నిన్న యూరప్ దేశాలకు, ఇప్పుడు గల్ఫ్ దేశాలకు తేటతెల్లమవుతుంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచదేశాలను ఏకం చేయడం నిజంగా భారతజాతికి మేలొ్కలుపు. ఇన్నాళ్లూ భారత్ చేస్తున్న వాదనకు నేడు ప్రపంచమంతా మద్దతివ్వక తప్పనిసరి పరిస్థితి. ఎవరైతే తీవ్రవాదాన్ని, వారి ఘాతుకాలను చూసీచూడనట్టు వ్యవ హరిస్తారో... వారు శిక్ష అనుభవిస్తారన్నది ఇప్పుడు నిత్యం చూస్తున్నాం.
 
చివరిగా ఒక విషయం... కలలు కనండి... కలలను నిజం చేసుకోండంటూ భారత మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలామ్ ఇచ్చిన స్ఫూర్తికి విరుద్ధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేవలం కల మాత్రమే కన్నారు.  అమృత్ సర్‌లో బ్రేక్ ఫాస్ట్, లాహోర్‌లో లంచ్, కాబూల్‌లో డిన్నర్‌ను మన పూర్వీకులు చేసేవారు. ఇప్పుడు కూడా పరిస్థితుల్లో అలా మార్పు రావాలంటూ ఆయన అభిలషించారు. అయితే మన్మోహన్ సింగ్ డ్రీమ్‌ను వాస్తవంలో ఆచరించి చూపారు ప్రధాని మోదీ... కాబూల్‌లో బ్రేక్ ఫాస్ట్, లాహోర్‌లో లంచ్, న్యూఢిల్లీలో డిన్నర్ చేసి నవశకానికి నాందిపలికారు.
 వ్యాసకర్త బీజేపీ ఏపీ సమన్వయ కర్త
 raghuram.bjp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement