
సాక్షి, అమరావతి : రాష్ట్ర హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా నియమితులైన బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఇవాళ ఉదయం 11 గంటలకు వీరితో ప్రమాణం చేయించారు. కాగా ఈ ముగ్గురి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment