ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ సంచలన విజయానికి సారథ్యం వహించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి జాతీయ, రాష్ట్ర నాయకులకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానం పలుకుతున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలకు ఫోన్ చేసి తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరారు.