
మోడీ ప్రమాణ స్వీకారం ఖర్చు రూ.17లక్షలేనట!
దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సాధారణంగా ఖర్చును భారీగానే ఊహిస్తాం. గతంలో అటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సాధారణంగా ఖర్చును భారీగానే ఊహిస్తాం. గతంలో అటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే భారతదేశానికి 15వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ఖర్చు కేవలం రూ. 17.60 లక్షలేనట. మే 16వ తేదీన రాష్ట్రపతి భవన్ వద్ద మోడీ ప్రమాణ స్వీకారానికి అయిన ఖర్చుకు సంబంధించిన వివరాలను తాజాగా సమాచార హక్క చట్టం ఉద్యమకారుడు సుభాష్ చంద్రా అగర్వాల్ వెల్లడించారు.
ఆ రోజు మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా టెంట్, వేదిక, ఫర్నీచర్ తదితర వాటికి అయిన ఖర్చు పదిహేడు లక్షల అరవై వేల రూపాయిలేనని అగర్వాల్ తెలిపారు.ఈ కార్యక్రమానికి పలువురు విదేశీ అధ్యక్షులతో పాటు, దాదాపు నాలుగువేల మంది ప్రజలు హాజరైన సంగతి తెలిసిందే.