న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నెల 30న ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రమాణ స్వీకారానికి బిమ్స్‌టెక్(భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, భూటాన్, నేపాల్) సభ్య దేశాల నాయకులకు ఆహ్వానం పంపింది. 2014లో సార్క్ దేశాల నాయకులు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయిన సంగతి తెలిసిందే. ఈసారి బిమ్స్‌టెక్ నాయకులను ఆహ్వానించనున్నారు. దాయాది దేశం పాక్‌కు మాత్రం ఆహ్వానం పంపలేదు.
మే 30న రాత్రి 7 గంటలకు మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. మోదీతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీ చేత ప్రమాణం చేయిస్తారని పేర్కొంది. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 542 స్థానాలకు ఎన్డీయే 353 చోట్ల విజయదుందుభి మోగించింది. బీజేపీకి 303 సీట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment