విజయవాడ, సాక్షి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 12వ తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకార ప్రాంగణంగా గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ ప్రాంతాన్ని ఎంపిక చేసిన టీడీపీ సీనియర్లు.. దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ నెల 11వ తేదీన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఆ భేటీలో చంద్రబాబును తమ లీడర్‌గా ఎన్నుకోనున్నారు. ఆపై 12వ తేదీ బుధవారం ఉదయం 11.27ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
ఎన్డీయే ప్రధాన మిత్రపక్షం కావడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎన్డీయే పక్ష నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కావొచ్చని టీడీపీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment