నేడు కేజ్రీవాల్ కేబినెట్ తొలి భేటీ | Kejriwal's cabinet to hold its first meeting today | Sakshi
Sakshi News home page

నేడు కేజ్రీవాల్ కేబినెట్ తొలి భేటీ

Published Mon, Feb 16 2015 10:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

నేడు కేజ్రీవాల్  కేబినెట్  తొలి భేటీ

నేడు కేజ్రీవాల్ కేబినెట్ తొలి భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన  విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తన మొదటి కేబినెట్ సమావేశాన్ని సోమవారం నిర్వహించుకోబోతోంది.   అసలు ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఈ సమావేశం జరగాల్సి ఉండగా,  సీఎం కేజ్రీవాల్ అనారోగ్యం కారణంగా వాయిదాపడింది.  మరోవైపు ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన  వాగ్దానాలను  కొత్త సీఎం ఎలా నెరవేర్చబోతున్నారనే విషయంపై అందరిలోనూ
ఆసక్తి నెలకొంది. 

అలాగే ఫిబ్రవరి 23,24  తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారైంది.  మొదటి రోజు స్పీకర్ ఎన్నిక, అనంతరం  ఎన్ని కైన సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. రెండవరోజు  లెఫ్టినెంట్ గవర్నర్
నజీబ్ జంగ్ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement