Kejriwals cabinet
-
నా కోసం ప్రార్థించండి - కేజ్రీవాల్
ఢిల్లీ: జ్వరంతో బాధపడుతూనే శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కేజ్రీవాల్ ఇపుడు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. సీఎంగా తన కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. ఈ సందర్బంగా కేజ్రీవాల్ ''నా జ్వరం తగ్గింది. ఎన్నికల సందర్భంగా ఆపివేసిస వాకింగ్ ,యోగ మళ్లీ మొదలుపెట్టాను. ముఖ్యమంత్రిగా తొలిరోజు నా బాధ్యతల నిర్వహణ మొదలు కాబోతోంది. దయ చేసి నాకోసం ప్రార్థించండి'' అంటూ ట్వీట్ చేశారు. సోమవారం కేజ్రీవాల్ తొలి కేబినెట్ సమావేశం జరుగుతుంది. అవినీతి నిరోధం, ధరల నియంత్రణ, నిరంతరాయంగా విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అనంతరం సచివాలయంలో ప్రభుత్వం అధికారులను కలుస్తారు. అలాగే ఫిబ్రవరి 23, 24 తేదీల్లో అసెంబ్లీ సమావేశమవుతుంది. -
నేడు కేజ్రీవాల్ కేబినెట్ తొలి భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తన మొదటి కేబినెట్ సమావేశాన్ని సోమవారం నిర్వహించుకోబోతోంది. అసలు ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఈ సమావేశం జరగాల్సి ఉండగా, సీఎం కేజ్రీవాల్ అనారోగ్యం కారణంగా వాయిదాపడింది. మరోవైపు ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను కొత్త సీఎం ఎలా నెరవేర్చబోతున్నారనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అలాగే ఫిబ్రవరి 23,24 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారైంది. మొదటి రోజు స్పీకర్ ఎన్నిక, అనంతరం ఎన్ని కైన సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. రెండవరోజు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.