నా కోసం ప్రార్థించండి - కేజ్రీవాల్ | Do pray for me, says Kejriwal on first working day | Sakshi
Sakshi News home page

నా కోసం ప్రార్థించండి - కేజ్రీవాల్

Published Mon, Feb 16 2015 11:50 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

నా కోసం ప్రార్థించండి - కేజ్రీవాల్

నా కోసం ప్రార్థించండి - కేజ్రీవాల్


ఢిల్లీ:  జ్వరంతో బాధపడుతూనే శనివారం  ముఖ్యమంత్రిగా  ప్రమాణం చేసి కేజ్రీవాల్ ఇపుడు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.  సీఎంగా  తన కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు.  ఈ సందర్బంగా కేజ్రీవాల్  ''నా జ్వరం తగ్గింది.  ఎన్నికల సందర్భంగా ఆపివేసిస వాకింగ్ ,యోగ మళ్లీ మొదలుపెట్టాను.   ముఖ్యమంత్రిగా తొలిరోజు నా బాధ్యతల నిర్వహణ మొదలు కాబోతోంది.  దయ చేసి నాకోసం ప్రార్థించండి'' అంటూ ట్వీట్ చేశారు.

సోమవారం కేజ్రీవాల్ తొలి కేబినెట్ సమావేశం జరుగుతుంది.   అవినీతి నిరోధం, ధరల నియంత్రణ,  నిరంతరాయంగా విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అనంతరం  సచివాలయంలో ప్రభుత్వం అధికారులను కలుస్తారు.  అలాగే ఫిబ్రవరి 23, 24  తేదీల్లో  అసెంబ్లీ  సమావేశమవుతుంది.
 

Advertisement

పోల్

Advertisement