కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా మారారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల సమ్మతి మేరకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.
ఈ బాధ్యతలు స్వీకరించి అనంతరం రాహుల్ గాంధీ ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. అతని ఎక్స్‌ప్రెషన్స్‌లో ఆత్మవిశ్వాసం తొంగిచూస్తోంది. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీకి సంబంధించిన రెండు ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి. వీటిలో తాను ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యానన్న ఆనందం, ఉత్సాహం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి భాగస్వామ్య పార్టీల నేతలంతా హాజరయ్యారు. వారంతా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రకటించిన వెంటనే రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ముఖం వెలిగిపోయింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ప్రకటనకు ముందు రాహుల్ సమావేశంలో నిశ్శబ్దంగా ఉంటూ అందరి మాటలు ఆలకిస్తూ కనిపించారు.
తనను ప్రతిపక్ష నేతగా ఎన్నిక చేసిన అనంతరం రాహుల్ ఆనందంతో తన గుండెపై చేయి వేసుకున్నారు. తరువాత చేతులు జోడించి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో 20 మంది నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ 2004లో తొలిసారి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది తొలిసారిగా అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. నాటి నుంచి ఆయన ప్రతిపక్ష నేత పదవిని చేపట్టలేదు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment