
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. హథ్రాస్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి యోగి ‘అంతర్జాతీయ నిధుల ద్వారా కుల, మత అల్లర్లకు పునాది వేయడానికి ప్రయత్నించడం ద్వారా మా ప్రత్యర్థులు మాపై కుట్ర చేస్తున్నారు. గత వారం రోజులుగా ప్రతిపక్ష పార్టీల అల్లర్లు చూడటానికి ఆసక్తిగా ఉన్నాయి. ఈ కుట్రల మధ్య మేము ముందుకు సాగాలి’ అని అన్నారు.
దేశ వ్యతిరేక వ్యక్తులు రాష్ట్ర అభివృద్ధిని అంగీకరించడం కష్టమని, దేశ అభివృద్ధి పట్ల అంకితభావం చూపాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలను కోరారు. ‘బీజేపీ కార్యకర్తలు దేశ అభివృద్ధికి తమను తాము అంకితం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అల్లర్లు, బంద్‌లతో అట్టుడికే ఉత్తరప్రదేశ్‌నే దేశ వ్యతిరేక వ్యక్తులు కోరుకుంటున్నారు, వారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అంగీకరించలేరు. కాబట్టి వారు ఇప్పుడు కుట్రలు చేస్తున్నారు’ అని యోగి అన్నారు. చదవండి: హథ్రాస్: న్యాయం చేసే ఉద్దేశముందా?