
వాషింగ్టన్: అమెరికా మరోసారి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతోంది. ఫెడరల్ ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్ పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోయే ముప్పు ఉంది.
రిపబ్లికన్ల డిమాండ్ మేరకు సరిహద్దు భద్రత సహా వివిధ ఏజెన్సీల చెల్లింపుల కోసం ప్రతిపాదిత బడ్జెట్‌లో 30% మేరకు నిధుల్లో కోత విధించినప్పటికీ మద్దతునివ్వడానికి వారు అంగీకరించడం లేదు. ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్లకే స్వల్ప మెజార్టీ ఉండడంతో ఈ బిల్లు పాస్ కాకపోతే ఏం చెయ్యాలన్న ఆందోళనలో అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. అదే జరిగితే 20 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది జీతాల్లేకుండా పని చేయాల్సి ఉంటుంది. వివిధ పథకాలకు నిధులు కేటాయించలేరు.
Comments
Please login to add a commentAdd a comment