
సాక్షి, న్యూఢిల్లీ: 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించడానికి ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఇందుకు జూన్ 12ను ఖరారు చేశాయి. భావసారూప్యత కలిగిన 18 పార్టీలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. అయితే.. ఇది సన్నాహక సమావేశమేనని, ప్రధాన సమావేశం తర్వాత జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యతకు మధ్యవర్తిగా వ్యవహరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఇటీవల ఆయన.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసిన అనంతరం ఈ సమావేశానికి సంబంధించిన తేదీ ఖరారైంది.
సారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని ఆయన యోచిస్తున్నారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లను సమన్వయపరడంలో విజయం సాధించారు.
ఇదీ చదవండి: పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. ఇది నిజంగా అప్రతిష్ట: రాహుల్