
'పార్టీ సభ్యుల సంఖ్య ఆధారంగా సమయం'
హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తున్నదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సభలో సమయం ఇవ్వలేదని డిప్యూటీ స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. మహిళగా డిప్యూటీ స్పీకర్‌ను గౌరవించాలని సూచించారు. సభలో ప్రభుత్వ ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటుందని స్పష్టం చేశారు.
సభలో ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు మంగళవారం నాడు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సమయం ఇవ్వలేదని విపక్ష సభ్యులు సభలో బుధవారం ఉదయం ప్రస్తావించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. పద్దులపై మాట్లాడేందుకు ప్రతి సభ్యునికి డిప్యూటీ స్పీకర్ అవకాశమిచ్చారని, పార్టీ సభ్యుల సంఖ్య ఆధారంగా సమయం కేటాయించామని, అన్ని విషయాల్లో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.