ఖమ్మం : ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పేపర్మిల్లులో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. కాగితపు గుజ్జును వేరు చేస్తుండగా ప్రమాదవశాత్తు మీద పడింది. ఈ ఘటనలో గాయపడినవారిలో రాంబాబు అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.