అనకాపల్లి: విశాఖ స్టీల్‌ప్లాంట్ కమిటీ ముందుకు వస్తే ఉక్కు కర్మాగారాన్ని కొంటానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కె.ఎ.పాల్ పేర్కొన్నారు. తన తండ్రి బర్న్‌బాస్‌ను కలుసుకునేందుకు పాల్ శనివారం నర్సీపట్నం వచ్చారు. విశాఖపట్నం వెళ్తూ మార్గంమధ్యలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆగి ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ త్వరలోనే తనతో కలుస్తారని పాల్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి కాపాడలేని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ స్టీల్‌ప్లాంట్ కొనేందుకు బిడ్ వేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సీమాంధ్రను సింగపూర్ చేస్తానని అధోగతి పాలు చేశారన్నారు. తాను నర్సీపట్నంలో ఇంటరీ్మడియట్ చదువుతున్న రోజుల్లో సబ్ కలెక్టర్ కార్యాలయం అప్పుడు ఎలావుందో ఇప్పుడు అలానే ఉందన్నారు. ఇదేనా చంద్రబాబు చేసిన అభివృద్ధని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment