సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు స్క్రిప్ట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చదివారని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఐదేళ్ల పాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై మాట్లాడని మోదీ ఇప్పుడు మాట్లాడడం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు. మోదీ ఆరోపణలు ఖండిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ హయంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడు జరగలేదని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబుపై మోదీ తీవ్రమైన విమర్శలు చేశారని అమర్నాథ్ ప్రస్తావించారు.
పోలవరాన్ని ఏటీఎం లా చంద్రబాబు మార్చుకున్నారని మోదీ విమర్శించారని గుర్తు చేశారు. బాబే కాదు మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల అవసరాల కోసం అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సెంటిమెంట్ ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటారని ఆశించినట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఊసు కూడా మోదీ ప్రస్తావించలేదని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడితే పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించినట్లు తెలిపారు. రాజకీయ అవసరాల కోసం వెళ్తున్న కూటమిని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు.
‘చంద్రబాబు ప్రెస్టేషన్‌లో మాట్లాడుతున్నారు. తనకు అధికారం రాదని తెలిసి నోటికొచ్చినట్లు మాట్లాడుతూన్నారు. రాబోయే రోజుల్లో ఎవరికి ఎవరు మొగుడు అవుతారో చంద్రబాబుకు తెలుస్తుంది. ల్యాండ్ టైపింగ్ యాక్ట్‌ను అసెంబ్లీలో స్వాగతించింది టీడీపీ. రైల్వే జోన్‌కు సంబంధించి ఇప్పటికే భూములను అధికారులు అప్పగించారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు మాట్లాడ్డం తగదు’ అని పేర్కొన్నారు.
చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో మతి బ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి. బాబు, పవన్ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎన్డీఏ ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. హక్కు దారులకు మేలు చేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు భూములు ఇచ్చేవాడే కాని లాక్కునే వాడు కాదని, అందుకే 31లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు.
అమరావతి పేరుతో చంద్రబాబు భూములు లాక్కున్నారు. పేదలు ఎవరూ వీరి తప్పుడు ప్రచారన్ని నమ్మద్దు. పింఛన్లను అడ్డుకొని లబ్ధిదారుల మరణానికి కారణం అయ్యారు. కూటమిలో చేరిన తరువాత బీజేపీ తీరులో మార్పు వచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పాలనపై కేంద్రం ఆధీనంలో ఉండే నీతి అయోగ్ ప్రశంసించింది. చంద్రబాబు, పవన్ ఇచ్చిన స్క్రిప్ట్ మోీదీ చదివారు.
పోలవరంను ఏటీఏంలా వాడుకున్నారని నాడు మోదీ అన్నారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం. పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం. బాబు విడుదల చేసిన మేనిఫెస్టోలో భాగస్వామ్యం ఉందని బీజేపీ ఎందుకు చెప్పలేకపోతుంది.? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉంది. ప్రధాని మాట్లాడలేదు సరే.. బాబు అయినా తన స్టాండ్ చెప్పాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment