
సాక్షి, ఉక్కునగరం (గాజువాక): విఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు ఆదివారం మధ్యాహ్నం నగరానికి రానున్నారు. సాయంత్రం స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. సోమవారం ఉదయం ఉక్కు స్టేడియంలో పిల్లలతో కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడతారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ రన్‌ను ప్రారంభిస్తారు. తర్వాత ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయం వెళ్లి పిల్లలతో ముచ్చటించనున్నారు. అక్కడ నుంచి ఉక్కుక్లబ్‌లోని ఎంపి హాలులో జరగనున్న సమావేశంలో పాల్గొంటారు. అక్కడ పి.వి.సింధును సత్కరించనున్నారు. కార్యక్రమంలో భాగంగా అరుణోదయ ప్రత్యేక పాఠశాల సందర్శించనున్నారు. అనంతరం సీఐఎస్‌ఎఫ్ కాలనీలో ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును ప్రారంభిస్తారు.
చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’
Comments
Please login to add a commentAdd a comment