
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, నిర్వాసితులు ఆదివారం భారీ మానవహారం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రిలేదీక్షలు నేటీతో 200వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు 10 వేల మందితో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, నిర్వాసితులు 10కిలో మీటర్ల వరకు మానవహారంలో పాల్గొన్నారు. ఉద్యోగులు కుటుంబ సభ్యులు, నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి మానవహారంలో పాల్గొనడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
చదవండి: ధర్మాన కృష్ణదాస్ అంటే జిల్లాల్లో క్రీడాకారుడిగానే తెలుసు
Comments
Please login to add a commentAdd a comment