విశాఖపట్నం, సాక్షి: దేవర సినిమాకు స్టీల్ ప్లాంట్ సెగ తగిలింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇవ్వాలంటూ జన జాగరణ సమితి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు నగరంలోని రామా టాకీస్ వద్ద పోస్టర్లకు.. ‘‘విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు’’ అంటూ ప్లాంట్ పోస్టర్లను తగిలించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మే కుట్ర జరుగుతుందంటూ రెండ్రోజుల కిందట ఇదే జన జాగరణ సమితి పోస్టర్లు వేయించింది. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్.. మోసగాళ్లని, లక్షల మంది కార్మికుల పొట్ట కొట్టే కార్యక్రమం జరుగుతోందంటూ ఆరోపించింది. సింహాద్రి అప్పన్న వీళ్లను శిక్షించాలని అందులో రాసింది. ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ ఫీవర్‌ను సైతం తమ ఉద్యమానికి వేదికగా చేసుకుంది. అయితే మద్దతు ఇవ్వకుంటే సినిమా విడుదలను అడ్డుకుంటుందా? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. చూడాలి దీనికి తారక్ ఏమైనా స్పందిస్తాడో.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ దేవర సినిమా టికెట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఆ వెంటనే ఎన్టీఆర్.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లకు థ్యాంక్స్ చెప్పాడు. తాజాగా టికెట్ల పెంపు వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని.. పదిరోజుల పాటే టికెట్ల పెంపు కొనసాగాలని నిర్మాతలకు ఝలక్ ఇచ్చింది. కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాహ్నవీ కపూర్ తదితరులు నటించిన దేవర శుక్రవారం విడుదల కానుంది.
ఇదీ చదవండి: అమరావతి మాత్రమే సెంటిమెంటా?.. స్టీల్ ప్లాంట్ కాదా?
Comments
Please login to add a commentAdd a comment