సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని ఐరన్ ఓర్‌కు, ఏపీలోని వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి తెలంగాణకు ఏం సంబంధమని కేటీఆర్‌ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ఆ రెండు లేకపోతే తెలంగాణలో తినడానికి అన్నమే దొరకదనట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో ప్రభుత్వ వైఫల్యం బయటపడటంతో కేటీఆర్‌కు మైండ్ దొబ్బిందని, ఏం మాట్లాడుతున్నరో ఆయనకే అర్థం కావడం లేదని ఒక ప్రకటనలో విమర్శించారు.
రాష్ట్రంలోని నిజాం షుగర్స్, అజంజాహి, సిర్పూర్ కాగజ్ మిల్లులను తెరిపించడం చేతగాదు కానీ, వైజాగ్ స్టీల్‌లో వాటా అంటూ బోగస్ మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నిస్తే.. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బయ్యారం స్టీల్ అంశాన్ని కేంద్రంపైకి నెట్టే ప్రయ త్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
‘ఒడిశాలోని మైనింగ్‌లో ఎవరు బిడ్డింగ్ వేశారు? అక్కడ అవినీతి జరిగితే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది? అక్కడేమైనా బీజేపీ ప్రభుత్వం ఉందా? నవీన్‌కు తెల్వని బైలడిల్ల మైనింగ్ కుంభకోణం కేటీఆర్‌కు ఎట్లా తెలిసింది? ఆయనే సమాధానం చెప్పాలి’అని అరుణ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment