Iron Ore
-
ఓఎంసీ ఓర్ ఊడ్చేస్తున్నారు
రాయదుర్గం: ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో సీబీఐ సీజ్ చేసిన విలువైన ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం)ను పచ్చముఠాలు చీకటి మాటున తరలించేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలంలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)లో తవ్వకాలు నిలిపివేసి సుమారు 8లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని 2011లో సీబీఐ సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కన్నేసిన టీడీపీ నాయకులు నాలుగైదు రోజులుగా ఓఎంసీలోకి చొరబడి లారీల్లో ఇనుప ఖనిజాన్ని చీకటి పడగానే సమీప స్టీల్ ఫ్యాక్టరీల్లోకి తరలిస్తున్నారు. అర్ధరాత్రి వేళ కొండ ప్రాంతాల్లో లారీల సంచారం, లైట్లను గమనించిన స్థానికులు ఓఎంసీలో దొంగలు పడ్డారని చర్చించుకుంటున్నారు. రోజుకు సుమారు 4 వేల టన్నులు మాయం అవుతున్నట్లు సమాచారం. నాణ్యతను బట్టి టన్ను రూ.4 వేల వరకు విక్రయిస్తుండడంతో భారీగా లూటీ చేసినట్లు అంచనా. ఓఎంసీలో లభ్యమయ్యే ఇనుప ఖనిజం నాణ్యతకు పేరు పొందింది. దీన్ని కాజేసేందుకు టీడీపీ నేతలు పథకం ప్రకారం వ్యవహరించారు. ఇందులో భాగంగా ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించారు. సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం గత ప్రభుత్వ హయాంలోనే తరలి పోయిందంటూ తప్పుడు కథనాలను వండి వార్చారు. నిస్సహాయంగా పోలీసులు.. ఓఎంసీలో ఇనుప ఖనిజం తరలిపోతున్నా పోలీసులు కళ్లప్పగించి చూడటం మినహా చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. లాఠీ ఝుళిపిస్తే బదిలీ తప్పదనే భయం వారిని వెంటాడుతోంది. ఇనుప ఖనిజాన్ని టీడీపీ నాయకులు అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం ఇటీవల బహిర్గతం చేశారు. గత ప్రభుత్వంలో దోచేసినట్టు వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. దోపిడీ అంశాన్ని సీబీఐ డైరెక్టర్‌తో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెస్తామన్నారు. ఎవరి ప్రమేయం ఉన్నా వదిలి పెట్టంఓఎంసీలో సీజ్ చేసిన ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలి పెట్టేది లేదు. సత్వరం ఓ బృందాన్ని అక్కడికి పంపి దర్యాప్తు చేయిస్తాం. సీబీఐ పరిధిలో ఉన్న వ్యవహారంలో తల దూర్చితే తీవ్ర పరిణామాలు తప్పవు. లారీ యజమానులు ఆలోచించి బాడుగకు వెళ్లాలి. ఏమాత్రం పట్టుబడినా అక్కడే సీజ్ చేస్తాం. అంగుళం కూడా కదలనివ్వం. నిల్వ ఉంచిన ఖనిజం బాగున్నా, పాడైనా బయట వ్యక్తులు ఎవరూ తాకటానికి వీల్లేదు. పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖలను అప్రమత్తం చేసి అడ్డుకట్ట వేస్తాం. – నాగయ్య, మైనింగ్ డీడీ, అనంతపురం -
ఒడిశా ఐరన్ ఓర్,వైజాగ్ స్టీల్స్‌తో తెలంగాణకు ఏం సంబంధం?
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని ఐరన్ ఓర్‌కు, ఏపీలోని వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి తెలంగాణకు ఏం సంబంధమని కేటీఆర్‌ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ఆ రెండు లేకపోతే తెలంగాణలో తినడానికి అన్నమే దొరకదనట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ప్రభుత్వ వైఫల్యం బయటపడటంతో కేటీఆర్‌కు మైండ్ దొబ్బిందని, ఏం మాట్లాడుతున్నరో ఆయనకే అర్థం కావడం లేదని ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలోని నిజాం షుగర్స్, అజంజాహి, సిర్పూర్ కాగజ్ మిల్లులను తెరిపించడం చేతగాదు కానీ, వైజాగ్ స్టీల్‌లో వాటా అంటూ బోగస్ మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నిస్తే.. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బయ్యారం స్టీల్ అంశాన్ని కేంద్రంపైకి నెట్టే ప్రయ త్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ఒడిశాలోని మైనింగ్‌లో ఎవరు బిడ్డింగ్ వేశారు? అక్కడ అవినీతి జరిగితే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది? అక్కడేమైనా బీజేపీ ప్రభుత్వం ఉందా? నవీన్‌కు తెల్వని బైలడిల్ల మైనింగ్ కుంభకోణం కేటీఆర్‌కు ఎట్లా తెలిసింది? ఆయనే సమాధానం చెప్పాలి’అని అరుణ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇనుప ఖనిజ నిక్షేపాల ఆనవాళ్లను గుర్తించినట్లు జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో వజ్రపు గనుల ఆనవాళ్లను గుర్తించినట్లు జీఎస్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎం.శ్రీధర్ తెలిపారు. దక్షిణ భారతదేశ ప్రగతిలో తమ శాఖ పలు కీలక ఆవిష్కరణలు చేసిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థ పలు ఖనిజ నిక్షేపాలను గుర్తించిందన్నారు. ఈ మేరకు 2016–17 సంవత్సరానికి సంబంధించి నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఐరన్ ఓర్ నిక్షేపాలను తాము సర్వే ద్వారా గుర్తించామన్నారు. ఇవి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆర్నకోండ ఎర్రబాలి బ్లాక్, చందోలి, అంబారీపేట బ్లాకులు, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని రబ్బనపల్లి, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గురిమల్ల, దబ్రీపేట, అబ్బాపూర్, మల్లంపల్లిలో 89.22 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలను తాము కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడే ఇనుము తయారీలో వాడే ముడి మాగ్నటైట్ నిక్షేపాలు సైతం ఉన్నాయని తెలిపారు. అయితే వీటితో నాణ్యమైన స్టీలును తయారు చేయలేమని చెప్పారు. కానీ వీటిని చిన్న చిన్న ఐరన్ పెల్లెట్ల తయారీకి వినియోగించవచ్చని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశామన్నారు. రాష్ట్ర విభజన హామీల్లో ముఖ్యమైన బయ్యారం స్టీలు ఫ్యాక్టరీకి ఈ నిక్షేపాలు ఊతంగా నిలుస్తాయని అన్నారు. దీంతో బయ్యారం స్టీలు ఫ్యాక్టరీపై పోరాడుతున్న ప్రభుత్వానికి ఇది మంచి పరిణామమని ఆయన అభివర్ణించారు. ఆంధ్రాలో వజ్రపు నిక్షేపాలు.. అనంతపురం జిల్లా వజ్రకరూర్ ప్రాంతంలో తక్కువ నాణ్యతగల ముడి వజ్రపు నిక్షేపాల ఆనవాళ్లు (కింబర్లేట్ పైప్)ను కనుగొన్నట్లు తెలిపారు. వీటిని శుద్ధి చేసి ఒక క్యారెట్ నాణ్యతగల వజ్రాలు ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. -
విశాఖలో పెల్లెట్ ప్లాంట్
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్, కుద్రేముఖ్ ఐరన్ ఓర్ లిమిటెడ్‌లు సంయుక్తంగా పెల్లెట్ ప్లాంట్‌ను విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కనున్న స్థలంలో ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు శనివారం మంగళూరులో ఇరు సంస్థల ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. దీని ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా, కర్ణాటకలోని బళ్లారి గనుల్లోని ఐరన్ ఓర్ ఫైన్‌ను వినియోగించి పెల్లెట్లను తయారుచేస్తారు. అక్కడ తయారయ్యే పెల్లెట్‌ను స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్‌లో వినియోగిస్తారు. మొదటి దశలో 1.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మించి తదుపరి అవసరాల బట్టి ప్లాంట్‌ను విస్తరిస్తారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ సమక్షంలో స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్, కుద్రేముఖ్ ఐరన్ ఓర్ లిమిటెడ్ సీఎండీ ఎం.వి. సుబ్బారావులు ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. -
ఏ క్షణమైనా షట్‌డౌన్?
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ముడి ఇనుము కొరత వేధిస్తోంది. ఉత్పత్తికి విఘాతం కలగకుండా ఎప్పుడూ నెలరోజులకు సరిపడా నిల్వ ఉండేది కాగా, ప్రస్తుతమున్న స్టాక్ రెండ్రోజులకు కూడా సరిపడేలా లేదంటున్నారు. ఈ రోజు ర్యాక్ వస్తే సరి.. లేకుంటే లేదన్నట్టుగా పరిస్థితి తయారైంది. దీంతో ఏ క్షణాన ఉత్పత్తి ఆపేయాల్సి వస్తుందోనని స్టీల్‌ప్లాంట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితి స్టీల్‌ప్లాంట్‌కు గతంలో ఎన్నడూ ఎదురవలేదు. హుద్‌హుద్ సమయంలో.. ఆ తర్వాత నీటికొరత వల్ల ఉత్పత్తిలో స్వల్ప బ్రేకులు పడ్డాయి. ముడి ఇనుము కొరతతో ఉత్పత్తి ఆపేయాల్సిన దుస్థితి ఇప్పుడే ఏర్పడింది. స్టీల్‌ప్లాంట్‌పై కేకే లైన్ దెబ్బ.. కొండచరియలు విరిగిపడడంతో అక్టోబర్ 7 నుంచి కేకే లైన్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం పర్యాటకులకంటే స్టీల్ప్లాంట్పైనే ఎక్కువగా పడింది. ప్లాంట్ ఆరంభం నుంచి ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎండీసీయే ఐరన్ ఓర్‌ను సరఫరా చేస్తోంది. కిరండోల్ సమీప బైలదిల్లా, బచేలి గనుల నుంచి వచ్చే ఐరన్ ఓర్ కోరాపుట్, బొర్రా, కొత్తవలసల మీదుగా స్టీల్‌ప్లాంట్ చేరుతుండేది. ఆ మార్గంద్వారా ప్రతిరోజూ ఐదారురేకులకుపైగా సరఫరా జరిగేది. తద్వారా స్టీల్‌ప్లాంట్‌లో ఎప్పుడూ నెలరోజుల ఉత్పత్తికి సరిపడే ఐరన్ ఓర్ నిల్వ ఉండేది. కేకేలైన్ ప్రమాదంతో ఈ మార్గంలో ఐరన్ ఓర్ రవాణా నిలిచిపోయింది. ఉక్కు యాజమాన్యం విజ్ఞప్తి మేరకు రైల్వేశాఖ ప్రత్యామ్నాయంగా రాయగడ, పార్వతీపురం, విజయనగరంల మీదుగా సరుకు రవాణా ప్రారంభించింది. దీంతో ఆ మార్గంలో రద్దీ మరింత పెరగడంతో రోజుకు ఒక ర్యాక్ రావడం గగనమైంది. ఫలించని ప్రత్యామ్నాయ చర్యలు.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం చేసిన ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ఫలించలేదు. ఒడిశా మైనింగ్ కార్పొరేషన్‌తో చర్చలు జరిపినా ఆశించిన స్థాయిలో సరుకొచ్చేలా కనిపించట్లేదు. కర్ణాటకలోని ధోనిమలై, గువా తదితర ప్రాంతాల నుంచి ఐరన్ ఓర్ సర్దుబాటుకు అధికారులు చేపట్టిన ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ సమీపంలో ఎన్ఎండీసీ నిర్మిస్తున్న స్టీల్‌ప్లాంట్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన ఐరన్ ఓర్ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అది ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాలి. ఇప్పటికే సాంకేతిక సమస్యల కారణంగా రోజూ ఏదో బ్లాస్ట్‌లో ఉత్పత్తిని కొద్దిసేపు ఆపేస్తున్నారు. ప్రస్తుతం ప్లాంట్‌లో కృష్ణా, గోదావరి బ్లాస్ట్ ఫర్నేస్లుండగా, కొత్త ఫర్నేస్ ప్రారంభించి మూడేళ్లయింది. మూడు ఫర్నేస్‌లకు రోజుకు 18వేల టన్నుల హాట్‌మెటల్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం కాగా, అందుకోసం రోజుకు 27వేల టన్నుల ముడి ఇనుము కావాలి. ప్రస్తుతం 20వేల టన్నులకు మించి ముడి ఇనుము లేదు. ఇది రెండు ఫర్నేస్లకే సరిపోతుంది. దీంతో ఏ క్షణమైనా ఒక ఫర్నేస్ నుంచి ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, కృష్ణా ఫర్నేస్‌లో బుధవారం ఉత్పత్తి నిలిపేసినట్టుగా వచ్చిన పుకార్లను స్టీల్‌ప్లాంట్ వర్గాలు కొట్టిపారేశాయి. మూడు బ్లాస్ట్లద్వారా ఉత్పత్తి జరుగుతోందని తెలిపాయి. అయితే ఏ క్షణమైనా ఒక బ్లాస్ట్‌లో ఉత్పత్తి ఆపే అవకాశాలు లేకపోలేదన్నాయి. బకాయిల వల్లే ఒత్తిడి తేలేకపోతోంది.. ఎన్ఎండీసీకి విశాఖ ఉక్కు రూ.1000 కోట్లకుపైగా బకాయి పడినట్టు తెలుస్తోంది. ఇటీవలే రూ.200 కోట్ల బకాయిలు చెల్లించింది. మిగిలిన బకాయిలూ చెల్లించాలని ఎన్ఎండీసీ ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ కారణంగానే సామర్థ్యానికి తగినట్టుగా ముడిఇనుము రవాణా పెంచాలని స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఎన్ఎండీసీపై ఒత్తిడి తేలేకపోతుందన్న వాదన విన్పిస్తోంది. -
వైజాగ్ పోర్ట్‌లో ఎస్సార్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ పోర్టులో ఎస్సార్ పోర్ట్స్ తన నిర్వహణలోని ఐరన్ ఓర్ సామర్థ్యాలను రెట్టింపు చేయనుంది. ఇందుకోసం రూ.830 కోట్లను పెట్టుబడిగా పెడుతోంది. చివరి దశలో ఉన్న ఈ విస్తరణ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం రోజుకు 70,000 టన్నులుగా ఉన్న సామర్థ్యం 1,20,000 టన్నులకు పెరుగుతుందని ఎస్సార్ పోర్ట్స్ తెలిపింది. అలాగే, వార్షిక సామర్థ్యం 12.5 మిలియన్ టన్నుల నుంచి 23 మిలియన్ టన్నులకు పెరుగుతుందని వెల్లడించింది. గంటకు 8,000 టన్నులను లోడింగ్ చేసే సామర్థ్యం సమకూరుతుందని, దేశీయ పోర్టుల్లో ఇదే గరిష్టమని వివరించింది. అలాగే హార్బర్లో 2,00,000 డీడబ్ల్యూటీ సామర్థ్యంగల నౌకలను కూడా నిలపడం సాధ్యపడుతుందని పేర్కొంది. వైజాగ్ పోర్ట్‌లో ఐరన్‌ఓర్ నిర్వహణ ప్రాజెక్టును 2015 మే నెలలో ఎస్సార్ పోర్ట్స్ 30 ఏళ్ల కాలానికిగాను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి సామర్థ్యాలను రోజుకు 25,000 టన్నుల నుంచి 70,000కు విస్తరించింది. వైజాగ్ పోర్ట్‌లోని ఎస్సార్‌కు చెందిన ఈవీటీఎల్ ఐరన్ ఓర్ హ్యాండ్లింగ్ టెర్మినల్ అన్ని రకాల వాతావరణాల్లోనూ పనిచేసే సామర్థ్యంతో చైనా, జపాన్, కొరియా సహా ఆగ్నేయాసియా దేశాలకు సేవలు అందించగలదని ఎస్సార్ పోర్ట్స్ తెలిపింది. రెండు ఎల్ఎన్జీ పోర్టుల నిర్మాణం ఎస్సార్ పోర్ట్స్ పశ్చిమ తీరంలో ఒకటి, తూర్పు తీరంలో మరొక ఎల్ఎన్జీ టెర్మినల్‌ను వచ్చే 18 నెలల్లో నిర్మించాలనుకుంటోంది. మొదటి దశలో రూ.2,500 కోట్లను వ్యయం చేయనున్నట్టు ఎస్సార్ పోర్ట్స్ ఎండీ రాజీవ్ అగర్వాల్ తెలిపారు. ఇందుకోసం సొంత నిధులతోపాటు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకునే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటికే పోర్టులను నిర్వహిస్తున్న హజీరా, సలాయాను ఇందుకు కంపెనీ ఎంచుకుంది. ఈ ప్రణాళికపై దృష్టి సారించామని, రానున్న ఏడాది, ఏడాదిన్నరలో దీన్ని మొదలు పెట్టనున్నట్టు రాజీవ్ తెలిపారు. -
పోర్టు బెర్త్‌లపై ప్రై‘వేటు’
♦ బెర్త్‌ల నిర్మాణానికి వేసిన ప్రణాళికలు ఢమాల్ ♦ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయామంటున్న కంపెనీలు ♦ ఒక్క విశాఖ పోర్టులోనే రూ.1500 కోట్ల ప్రాజెక్టులపై ప్రభావం ♦ ఒప్పంద నిబంధనలే ప్రధాన కారణం సాక్షి, విశాఖపట్నం: రేవుల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పీపీపీ విధానంలో ఒక నిబంధన కారణంగా రేవుల్లో బెర్తులు మూసివేతకు సిద్ధమవుతున్నాయి. యూరప్ దేశాలలో 40% సరకు రవాణా నౌకలపై జరుగుతుంటే మన దేశంలో 7% మాత్రమే జరుగుతోంది. నిజానికి రోడ్డు రవాణాకు అయ్యే ఖర్చులో దాదాపు సగం ఖర్చుకే నౌకలపై తరలించవచ్చు. పైగా పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారులు విస్తరించాలంటే ఖర్చుతోపాటు భూ సమస్యలు తలెత్తుతాయి. నౌకామార్గానికి అలాంటి ఇబ్బందులు ఉండవు. దీంతో పోర్టులను అభివృద్ధి చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దాని కోసం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. కానీ ఒప్పందంలో ఒక నిబంధన వల్ల మొత్తం ప్రాజెక్టులన్నీ అటకెక్కించాల్సి వస్తోంది. బెర్త్‌ల నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీలకు ప్రభుత్వం ఓ నిబంధన పెట్టింది. బెర్త్‌ను ఏ ప్రయోజనం కోసం నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నారో దానికి మాత్రమే వినియోగించాలనే షరతు ఇప్పుడు సమస్యగా మారింది. ఉదాహరణకు ఐరన్ ఓర్ బెర్త్‌ను నిర్మిస్తే ఐరన్ ఓర్ మాత్రమే హ్యాండ్లింగ్ చేయాలి. కోల్గానీ, ఆహార ఉత్పత్తులుగానీ, ఎరువులుగానీ ఏదీ చేయకూడదు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఇప్పుడు ఐరన్ ఓర్, బొగ్గు దిగుమతుల పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో బెర్త్‌లను ఇతర అవసరాలకు వినియోగించుకుంటే తప్ప కంపెనీలు మనుగడ సాగించలేని పరిస్థితి. లక్ష్యం నెరవేరేదెలా? దేశంలోని పదమూడు మేజర్ పోర్టులలో విశాఖ పోర్టు ఒకటి. అంతేకాదు దేశంలో ఇది రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం విశాఖ పోర్టు ఇన్నర్ హార్బర్లో 18, అవుటర్‌లో 6 బెర్త్‌లు ఉన్నాయి. ఇ1 బెర్త్ నుంచి థర్మల్ కోల్‌ను దిగుమతి చేస్తున్నారు. ఓఆర్ 1,2 బెర్త్‌ల ద్వారా పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్‌ను ఎగుమతి, దిగుమతి చేస్తున్నారు. అవుటర్‌లో ఎస్పిఎం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. పోర్టు సామర్ధ్యం 65 మిలియన్ టన్నులు కాగా దానిని 150 మిలియన్ టన్నులకు పెంచాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం 6 బెర్తులను పోర్టు ఆధునీకరిస్తుండగా, నాలుగు బెర్తులను పీపీపీ పద్ధతిలో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ సుమారు రూ.1500 కోట్లు. ఇవి పూర్తయితే తప్ప పోర్టు అనుకున్న లక్ష్యం నెరవేరదు. కంపెనీలు కుదేలు: ప్రస్తుతం కోల్, ఐరన్ హ్యాండ్లింగ్‌కు అడ్డంకులు ఉండటంతో కంపెనీలు కుదేలవుతున్నాయి. దీంతో బెర్త్‌లు నిర్మించడంపై పునరాలోచనలో పడి రూ.1500 కోట్ల ప్రాజెక్టులన్నిటినీ నిలిపివేశాయి. ఇప్పటికే రూ.350 కోట్లతో కోల్ హ్యాండ్లింగ్ బెర్త్ నిర్మించిన అదానీ కంపెనీ ఆరు నెలల తర్వాత దానిని మూసేసింది. రూ.600 కోట్లతో ఐరన్ ఓర్ హ్యాండ్లింగ్ బెర్త్ నిర్మించిన వేదాంత సంస్థ తాజాగా దాన్ని మూసేయడానికి సిద్ధపడుతోంది. ఒకవేళ బెర్త్‌లు నిర్మిస్తే భవిష్యత్‌లో అప్పటి అవసరానికి అనుగుణంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ముందుకు వెళతామని కంపెనీలంటున్నాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు
-
‘బయ్యారం’ ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం జిల్లా బయ్యారంలో ప్రతిపాదించిన ఉక్కు కర్మాగార నిర్మాణం ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. పరిశ్రమ నిర్మాణం సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఏర్పాటైన జాయింట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ముడి ఇనుము నిక్షేపాలున్నట్లు నివేదికలో పేర్కొంది. బయ్యారంలో లభిస్తున్న ముడి ఇనుములో 65 శాతం నాణ్యత ఉన్నట్లు గుర్తించారు. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) కూడా దృష్టి సారించింది. 200 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజం నిక్షేపాలుంటేనే ఉక్కు కర్మాగారం పెట్టడం సాధ్యమవుతుందని సెయిల్ చెబుతోంది. ఒకేచోట 200 మిలియన్ టన్నుల ముడిఇనుము లభించడం అసాధ్యమని టాస్క్‌ఫోర్స్ ప్రాథమిక నివేదిక వెల్లడించింది. మరోవైపు సెయిల్ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఇవ్వాల్సిన రాయితీలను కూడా నివేదికలో పొందుపరిచారు. ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేట్, కస్టమ్స్, సేవా పన్నుల మినహాయింపు, సెయిల్ తీసుకునే రుణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇవ్వడం వంటి అంశాలను పేర్కొన్నారు. ప్రాథమిక నివేదిక అసమగ్రం నివేదికపై టాస్క్‌ఫోర్స్ సభ్యులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు 3 పర్యాయాలు సమావేశమయ్యాయి. నివేదికలోని అంశాలు అసంపూర్తిగా ఉన్నాయని, ముడి ఖనిజం లభ్యతపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించాయి. కేవలం ఒకట్రెండు ప్రాంతాల్లో నమూనాలు తీసుకుని ముడి ఇనుము లభ్యతపై అంచనాకు రావడం శాస్త్రీయంగా లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే బయ్యారంలో నిక్షేపాల లభ్యత, నాణ్యత కర్మాగారం ఏర్పాటుకు అవసరమైనంత మేర ఉండకపోవచ్చని మైనింగ్ విభాగం అనుమానం వ్యక్తంచేస్తోంది. ఎక్కువ నమూనాలు విశ్లేషించి తుది నివేదిక సమర్పించేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే కర్మాగారం నిర్మాణానికి కనీసం ఐదేళ్లు పడుతుందని సెయిల్ వర్గాలు ఇదివరకే చెప్పాయి. ఈ నేపథ్యంలో బయ్యారంలో సెయిల్ ఉక్కు కర్మాగారం ప్రతిపాదన ఇప్పట్లో కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. బయ్యారం నేపథ్యం ఇదీ... బయ్యారంలో 3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు గతంలో సెయిల్ సుముఖత వ్యక్తం చేసింది. తొలి దశలో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో బెనిఫికేషన్, పెల్లెట్ ప్లాంటు, రెండో దశలో ఉక్కు తయారీ యూనిట్ ఏర్పాటును ప్రతిపాదించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక తరహాలో పర్యావరణానికి హాని కలగని రీతిలో పరిశ్రమ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన, ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. అయితే ఉక్కు కర్మాగారం ఏర్పాటులో టాస్క్‌ఫోర్స్ తుది నివేదిక కీలకం కానుంది. మంత్రి హరీశ్ సమీక్ష బయ్యారంలో ముడి ఇనుము లభ్యతపై టాస్క్‌ఫోర్స్ తుది నివేదికను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని నీటిపారుదల, మైనింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వేలో కీలకంగా వ్యవహరిస్తున్న మైనింగ్, సింగరేణి, భూ భౌతిక పరిశోధన సంస్థ అధికారులతో గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నమూనాల సేకరణకు అవసరమైన డ్రిల్లింగ్‌లో సింగరేణి సహకారం తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన సర్వే తీరుతెన్నులు, టాస్క్‌ఫోర్స్ ప్రాథమిక నివేదికపై చర్చించారు. సమావేశంలో సింగరేణి సీఎండీ శ్రీధర్, టీఎస్ఎండీసీ ఎండీ లోకేశ్ కుమార్, డెరైక్టర్ మంగీరాం తదితరులు పాల్గొన్నారు. -
సర్వే సందడి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఇనుప ఖనిజానికి పెట్టని కోటగా ఉన్న బయ్యారం ప్రాంతంలో కేంద్ర ప్రతినిధి బృందం మంగళవారం మరోసారి సర్వే చేపట్టింది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలనే ప్రజల డిమాండ్, ప్రభుత్వాలు సైతం సానుకూలత వ్యక్తం చేయడంతో కొద్దిరోజులుగా బయ్యూరం గుట్టలపై సర్వే సందడి మొదలైంది. పూర్తి వెనుకబడిన గిరిజన ప్రాంతం బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి అవసరమైన పరిస్థితులపై పలు దఫాలుగా అధికారులు సర్వే చేస్తున్నారు. దీనిలో భాగంగా జియూలాజికల్ సర్వే బృందం మంగళవారం ఈ ప్రాంతంలో పర్యటించింది. ఇనుప ఖనిజాల లభ్యత, నాణ్యత, కర్మాగారం ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయూలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దాదాపు 10 రోజులపాటు ఈ బృందం ఇక్కడ పర్యటిస్తుంది. నిక్షేపాల కోసం అన్వేషణ నిక్షేపాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు జియూలాజికల్ ప్రతినిధి బృందం ఉపక్రమించింది. ఇక్కడి ఖనిజ నిక్షేపాలపై అధ్యయనం కోసం జియూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియూ, రాష్ట్ర భూగర్భగనుల శాఖ అధికారులు, కేంద్ర ప్రతినిధి బృందం పర్యటిస్తున్నారుు. నిక్షేపాల ఎంత మేరకు ఉన్నాయో అధ్యయనం చేస్తున్నారుు. ఇనుప ఖనిజంతో పాటు ఇక్కడి పర్యావరణ పరిస్థితులపై కూడా ఈ బృందాలు దృష్టి సారించారుు. ఇందుకు అటవీశాఖ అధికారుల సహకారాన్ని తీసుకుంటున్నారుు. పర్యావరణ పరమైన సహకారాన్ని అటవీశాఖ అందించనుంది. ఏ శాఖ భూమి ఎంత..? ఖనిజ నిక్షేపాలు, పర్యావరణ అంశాలపై అధ్యయనం చేస్తున్న ఈ బృందం భూములు, వాటి వివరాలు కూడా సేకరిస్తోంది. ఏ శాఖ భూమి ఎంత ఉందో తెలుసుకుంటోంది. అటవీశాఖ భూమి ఎంత?, ప్రభుత్వ భూమి ఎంత ఉంది? రైతుల పట్టా భూమి ఎంత? అనే అంశాలపై దృష్టి సారించింది. బయ్యూరం ఉక్కు కర్మాగారం నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సానుకూల పరిస్థితులు ఉన్న దృష్ట్యా మూడునెలలుగా వివిధ సాంకేతిక, గనుల అధికారిక బృందాలు సర్వేలు నిర్వహిస్తున్నారుు. సర్వే బృందాల విస్తృత పర్యటన నేపథ్యంలో ఈ ప్రాంత వాసుల్లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నారుు. మౌలిక వసతులపైనా దృష్టి బయ్యూరంలో ఉక్కు ఫ్యాక్టరీ ఖాయమైతే ఇక్కడ కల్పించాల్సిన మౌలిక వసతులు, ఖనిజం ఎగుమతి చేయడానికి రవాణా సౌకర్యం, ఖనిజ శుద్ధికి అవసరమైన నీటి సౌకర్యం వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యూరం పెదచెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చడం ద్వారా కర్మాగారానికి అవసరమైన నీరు సమకూరే అవకాశం ఉంది. ఈ విషయూన్ని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధి బృందం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారంపై త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెద్దగుట్టపై అన్వేషణ బయ్యారం: బయ్యూరం పెద్దగుట్టపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని జియూలాజికల్ అధికారులు మంగళవారం నుంచి సర్వే ప్రారంభించారు. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని జియూలాజికల్ ఇండియూ జియూలజిస్టులు వికాస్‌త్రిపాఠి, దేశ్ముఖ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని మైన్స్, జియూలాజికల్ అధికారులు మొదటిరోజు సర్వే నిర్వహించారు. గుట్టపై ఉన్న ఇనుపరారుుని క్షుణ్ణంగా పరిశీలించారు. అవసరమైన శాంపిల్స్ సేకరించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ 14 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సంయుక్త సర్వే నిర్వహిస్తున్నామని సర్వే కోఆర్డినేటర్ బి. సత్యనారాయణ విలేకరులకు తెలిపారు. పదిరోజుల పాటు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఈ సర్వేబృందం వెంట బయ్యూరం అటవీశాఖ అధికారి ప్రసాద్, రాయల్టీ ఇన్స్పెక్టర్ రవీందర్, గంగాధర్, వెంకటేశ్వరరావు, నగేశ్, టెక్నికల్ అసిస్టెంట్ శేఖర్, నాగరాజు, పరశురాం ఉన్నారు. -
గాలి జనార్దనరెడ్డి రూ.37 కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: ఇనుప ఖనిజం తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, ఆయన భార్య అరుణకు చెందిన రూ. 37.88 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక కోర్టు అటాచ్ చేసుకుంది. బెంగళూరులోని రూ. 4 కోట్ల విలువైన ఫ్లాట్, బళ్లారిలోని రూ. 14 లక్షల విలువైన ఇంటితో సహా పలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఈ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఉన్నాయి. -
కర్ణాటక మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తు ప్రారంభం
బళ్లారి: కర్ణాటకలో ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాలు, రవాణాపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అక్రమ మైనింగ్ ఆరోపణలున్న పలు కంపెనీలకు గత వారం రోజులుగా నోటీసులు జారీ చేసినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. 2006 ఏప్రిల్ 1 నుంచి 2010 డిసెంబర్ 31 మధ్య కాలంలో ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణా, ఎగుమతులకు సంబంధించిన పత్రాలను అందించాల్సిందిగా ఆదేశించింది. 2006-07 నుంచి 2010 మధ్యలో 7.74 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్‌ను అక్రమంగా తరలించడం వల్ల ఖజానాకు భారీగా గండిపడిందని 2011లో అప్పటి లోకాయుక్త సంతోష్ హెగ్డే వెల్లడించిన సంగతి తెలిసిందే -
చార్జీల కూత
స్లీపర్, ఏసీ చార్జీల పెంపు 14.2 శాతం వాత ప్రయాణికులపై రూ.50 కోట్లు భారం వాల్తేరు డివిజన్‌కు రూ.500 కోట్లుఅదనపు ఆదాయం విశాఖపట్నం : రైలు ప్రయాణికులపై చార్జీల భారం పడింది. రైల్వే బడ్జెట్ ప్రకటించకమునుపే బీజేపీ ప్రభుత్వం ఊహించని రీతిలో 14.2 శాతం చార్జీలను వడ్డించింది. రైల్వేలో వసతులు మెరుగుపరుస్తామంటూ అదనపు భారం వేశారు. పెరిగిన చార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి. చార్జీల పెంపు వల్ల వాల్తేర్ డివిజన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై ఏటా దాదాపు రూ.50 కోట్ల అదనపు భారం పడనుంది. బొగ్గు, ఇనుప ఖనిజం, ఇనుము, పెట్రోలియం, ఫెర్టిలైజర్స్, ఆహార ధాన్యాల ఋఎగుమతుల రవాణా వల్ల కూడా వాల్తేరు డివిజన్‌పై అధిక భారం పడనుంది. కొత్తగా ఎలాంటి సరకు రవాణా పెరగకపోయినా గత ఏడాదిలాగే రవాణా జరిగితే అదనంగా రూ.450 కోట్ల ఆదాయం వాల్తేరు డివిజన్‌కు సమకూరనుంది. ప్రయాణికుల చార్జీలు పెంపు, సరకు రవాణా పెంపు వల్ల వాల్తేరు డివిజన్‌కు రూ.500 కోట్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్టు రైల్వే వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటికే వాల్తేరు రైల్వే ఆదాయం రూ.6265.28 కోట్లకు చేరింది. తాజా పెంపుతో రూ. 6765 కోట్లకు పెరిగే అవకాశాలున్నాయి. సమీపంలో ఇంత భారీ ఆదాయాన్ని ఆర్జించే రైల్వే డివిజన్లు లేవు. విజయవాడ రైల్వే డివిజన్ ఏటా రూ.3279 కోట్లు, గుంతకల్ రూ. 1300 కోట్లు, గుంటూరు రూ. 452 కోట్లు, సంబల్పూర్ రూ. 630 కోట్లు, కుర్దా డివిజన్ రూ. 3630 కోట్లు మాత్రమే ఆర్జిస్తున్నాయి. విశాఖ నుంచి రోజూ దాదాపు 90 రైళ్లలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచే రోజూ 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు. సికింద్రాబాద్, విజయవాడ, భువనేశ్వర్, హౌరా, చెన్నై ప్రాంతాలకు ఎక్కువ మంది విశాఖ నుంచి బయల్దేరుతుంటారు. సికింద్రాబాద్‌కు ఎన్ని రైళ్లు వేసినా అవన్నీ నిత్యం రద్దీగానే నడుస్తుంటాయి. తాజాగా పెరిగిన రవా ణా చార్జీలతో నిత్యావసర ధరలు చుక్కలనంటే ప్రమాదం ఉందని సామాన్యులు భయపడుతున్నారు. ఆహార ధాన్యాలన్నీ రైళ్లలోనే రవాణా అవుతుం టాయి. పెట్రోలియం ఉత్పత్తులకు కూడా ఈ చార్జీల మోత తోడైతే రవాణా, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. సౌకర్యాలేవీ...! : ప్రస్తుతం పెంచిన చార్జీల్లో 4.2 శాతం మౌలిక వసతుల కల్పనకేనని రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం సౌకర్యాలేవీ కనిపించడం లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. టాయిలెట్లు నిత్యం కంపుకొడుతూనే ఉంటున్నాయని, నీళ్లు కూడా రాని పరిస్థితి ఉందని చె బుతున్నారు. ప్రయాణికుల నుంచి 4.2 శాతం అదనపు చార్జీలను వసూలు చేయడం సరికాదని రైల్వేపై నిప్పులు చెరుగుతున్నారు. వసతులు, సదుపాయాలు, పరిశుభ్రతకు పెద్దపీట వేయకుండా చార్జీలు పెంచడాన్ని రైల్వే వర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. ఉపసంహరించుకోవాలి బీజేపీ ప్రభుత్వం రైల్వే చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి. గత ప్రభుత్వంలా కాకుండా తమ హయాంలో అందరికీ మేలు చేకూరుతుందంటూ అధికారం చేపట్టిన నెలరోజులకే ప్రయాణికులపై భారం మోపడం శోచనీయం. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. -సీహెచ్. మైఖేల్, న్యాయవాది, అనకాపల్లి. సామాన్యులకు కష్టమే.. ప్రయాణ,రవాణా చార్జీలను రైల్వే పెంచడంతో పరోక్షం గా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉం ది. ఇప్పటికే పెరిగిన బస్సు చార్జీలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ఇక నుంచి రైలు ప్రయాణం కూడా కష్టమవుతుంది. -ఎ. పరమేశ్వరావు, ఉద్యోగి అనకాపల్లి. చార్జీల పెంపు దారుణం అధికారం ఉంది కదాని ప్రయాణికులపై ఇలా భారం మోపడం సరికాదు. ఏసీ ప్రయాణికులపై కాకుండా సాధారణ ప్రయాణికులు వెళ్లే స్లీపర్ క్లాస్‌పై వడ్డించడం బాధాకరం. పెంచిన ధరలు తగ్గించేందుకు బీజేపీ, టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి పోరాటాలు చేయాలి. - గుడివాడ అమరనాథ్, వైఎస్సార్సీపీ నేత -
5 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసిక నికర లాభంలో 34 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది (2012-13) ఇదే కాలానికి రూ. 1,465 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ.1,962 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం 21 శాతం పెరిగి రూ.3,204 కోట్ల నుంచి రూ. 3,884 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం మీద చూస్తే నికర లాభం రూ. 6,342 కోట్ల నుంచి రూ. 6,420 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 10,704 కోట్ల నుంచి రూ. 12,058 కోట్లకు చేరింది. ఏడాది మొత్తం మీద లాభాల్లో వృద్ధి శాతం తక్కువగా ఉండటానికి వేతన సవరణ, ఎగుమతులకు సంబంధించి వ్యయం కారణంగా ఎన్ఎండీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ నరేంద్ర కొఠారి పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ఎండీసీ తొలిసారిగా ముడి ఇనుము ఉత్పత్తి అమ్మకాల్లో 3 కోట్ల టన్నులు దాటినట్లు తెలిపారు. ఈ ఏడాది 3.1 కోట్ల టన్నుల ఉత్పత్తి, గతేడాది మిగులుతో కలిపి 3.2 కోట్ల టన్నుల అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొఠారి తెలిపారు. ఇప్పుడిప్పుడే ఇనుముకు డిమాండ్ పెరుగుతోందని, ఏడాది మొత్తం మీద చూస్తే ధరలు పెరగడమే కాని తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. సొంత నిధులతోనే స్టీల్‌ప్లాంట్, క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు... 2019-20 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ముడి ఇనుము ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 కోట్ల టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొఠారి తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.5,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ ఏడాది స్టీల్ ప్లాంట్, గనుల విస్తరణ కోసం రూ.3,495 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. గతేడాది కంపెనీ రూ. 2,518 కోట్లు విస్తరణ కోసం ఖర్చు చేసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్, క్యాపిటివ్ విద్యుత్ ప్రాజెక్టులను సొంత నిధులతోనే ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం కంపెనీ దగ్గర ఉన్న రూ.18,000 కోట్ల మిగులు నిధులను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నగర్నర్లో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ 2016-17కి అందుబాటులోకి వస్తుందని అంచనా. విదేశీ విస్తరణపై దృష్టి విదేశాల్లో బొగ్గు, బంగారం, డైమండ్స్, ఫాస్పేట్ గనులపై దృష్టిసారిస్తున్నట్లు ఎన్ఎండీసీ ప్రకటించింది. ఇందుకోసం ఇండోనేషియాలో బొగ్గు గనులు, మొజాంబిక్, ఆస్ట్రేలియాలో ఇనుప ఖనిజాలు, రష్యాలో రాక్ ఫాస్పేట్ గనులపై మదింపు చేస్తున్నామని, వీటి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కొఠారి తెలిపారు. -
స్టీల్ ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: మార్చి నుంచి స్టీల్ ధరలు పెరగనున్నాయ్. ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్)తో పాటు, ప్రయివేట్ రంగ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సైతం ధరల్ని పెంచుతున్నాయి. మార్చి 1 నుంచి స్టీల్ ధరలను టన్నుకి రూ. 1,000 వరకూ పెంచనున్నట్లు వైజాగ్ స్టీల్ వెల్లడించింది. ఇక జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఇప్పటికే టన్ను ధరపై రూ.750 వరకూ వడ్డించనున్నట్లు తెలిపింది. ముడిఇనుము ధరలతోపాటు, రవాణా చార్జీలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా వైజాగ్ స్టీల్ పేర్కొంది. వెరసి వివిధ రకాల ఉత్పత్తులపై టన్నుకి కనిష్టంగా రూ. 750, గరిష్టంగా రూ. 1,000ను పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ బాటలో ఎస్సార్ స్టీల్ కూడా వచ్చే నెల నుంచి టన్నుకి రూ. 1,000 వరకూ స్టీల్ ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉక్కు తయారీ వ్యయాలు పెరగడానికితోడు డిసెంబర్ క్వార్టర్లో స్టీల్‌కు కొంత డిమాండ్ పుంజుకోవడం కూడా ధరల పెంపుకు కారణమైనట్లు ఆ వర్గాలు వివరించాయి. మూడోసారి ఈ ఏడాది ఇప్పటివరకూ స్టీల్ ధరలు రెండు సార్లు పెరిగాయి. ప్రస్తుత ప్రతిపాదనల నేపథ్యంలో స్టీల్ ధరలు మూడోసారి హెచ్చనున్నాయి. దేశీయ స్టీల్ తయారీ సంస్థలు ఇప్పటికే జనవరి-ఫిబ్రవరిలో టన్నుకి రూ. 2,500-3,000 స్థాయిలో ధరలను పెంచాయి. ఇందుకు ముడిసరుకుల ధరలు, రవాణా వ్యయాలే కారణమైనప్పటికీ ఇటీవల స్టీల్‌కు డిమాండ్ పుంజుకోవడం కూడా దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. విదేశాలకు స్టీల్ ఎగుమతులు వృద్ధి చెందుతుండటంతో దేశీయంగా అధిక సరఫరాకు చెక్ పెట్టేందుకు కంపెనీలకు వీలు చిక్కుతోంది. ఇది మరోవైపు ఉత్పత్తుల ధరలు పెంచేందుకు కూడా దారి చూపుతోంది. అయితే ధరల పెంపును మార్కెట్లు పూర్తిస్థాయిలో గ్రహించే అవకాశాలు తక్కువేనని పరిశ్రమ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతానికి స్టీల్ వినియోగం అంత ప్రోత్సాహకరంగా ఏమీలేదని, ఈ నేపథ్యంలో ధరల పెంపు కొనసాగేదీ లేనిదీ చూడాల్సి ఉన్నదని జయంత్ రాయ్ వ్యాఖ్యానించారు. రేటింగ్ దిగ్గజం ఇక్రాకు చెందిన కార్పొరేట్ రంగ విభాగానికి సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా జయంత్ పనిచేస్తున్నారు. ఇదీ ధరల తీరు: నిర్మాణ రంగంలో వినియోగించే టీఎంటీ బార్లు, స్ట్రక్చర్లు వంటి లాంగ్ ప్రొడక్ట్‌ల ధరలు ప్రస్తుతం టన్నుకి రూ. 37,000-39,000 స్థాయిలో ఉన్నాయి. ఇక ఆటోమొబైల్, వినియోగ వస్తు రంగాలు కొనుగోలు చేసే హెచ్ఆర్ క్వాయిల్, సీఆర్ క్వాయిల్ వంటి ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తుల ధరలైతే టన్నుకి రూ. 39,500-43,500 మధ్య పలుకుతున్నాయి. -
మైనింగ్ మాఫియా ఇష్టారాజ్యం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఖనిజం.. మైనింగ్ మాఫియాకు సిరులు కురిపిస్తోంది.. అధికారుల కళ్లుగప్పి మాంగనీస్ వ్యాపారులు సరిహద్దులు దాటిస్తున్నారు.. అనుమతి లేనిచోట తవ్వకాలు జరుపుతూ రూ.కోట్లు గడిస్తున్నారు.. గనులు, రెవెన్యూ, పోలీసు అధికారులను మచ్చిక చేసుకుని దందా కొనసాగిస్తున్నారు.. ప్రభుత్వానికి గండి కొడుతున్నారు.. జిల్లాలో ఆదిలాబాద్, తాంసి, జైనథ్ మండలాల్లో మాంగనీస్(ఐరన్ ఓర్) లభిస్తుంది. సీజన్లవారీగా కంపెనీలు తవ్వకాల అనుమతి, లెసైన్స్, పర్యావరణ అనుమతి పొంది గనుల శాఖ సూచించే కొన్ని షరతులకు లోబడి తవ్వకాలు జరపాలి. లేకుంటే ఆ కంపెనీలకు మాంగనీసు తరలించేందుకు అనుమతిని మైనింగ్ అధికారులు ఇవ్వరాదు. నిబంధనలు తుంగలో తొక్కి కొన్ని కంపెనీలు రూ.కోట్ల విలువ చేసే మాంగనీసును మూడో కంటికి తెలియకుండా రాత్రిపూట సరిహద్దులు దాటిస్తున్నాయి. ఇంకా మైనింగ్ శాఖ పర్యావరణ అనుమతి లేని కంపెనీలకు పర్మిట్లు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. ఏడాది క్రితం ఆదిలాబాద్ నుంచి ఆదిత్య మినరల్స్ పర్మిట్‌పై రాయల్టీ ఎగవేసి అక్రమంగా రాజస్థాన్‌కు తరలుతున్న లారీని ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. కొంత మంది ప్రాస్పెక్టీవ్ లెసైన్స్(పీఎస్) అనుమతి తీసుకుని 200 టన్నుల మాంగనీసును తవ్వాల్సి ఉండగా వేలాది టన్నులు తవ్వుతూ ఏటా రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. నెలనెలా మామూళ్లు తీసుకునే భూగర్భగనుల శాఖ అధికారులు అక్రమంగా మైనింగ్ జరుపుతున్న ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్థలున్నాయి. ‘మామూలు’గా తీసుకుంటున్న మైనింగ్ శాఖ ఆదిలాబాద్, తాంసి, జైనథ్ మండలాల్లో మాంగనీసు తవ్వకాల కోసం 16 కంపెనీలకు 12,200 ఎకరాల్లో అనుమతి ఉంది. అయితే చాలామంది వ్యాపారులు పర్యావరణ అనుమతి తీసుకోకుండానే మాంగనీసు తవ్వి తరలిస్తున్నారు. తమకు లీజు ఇచ్చిన స్థలంతోపాటు ప్రభుత్వ, రెవెన్యూ, ఫారెస్టు భూముల నుంచి కూడా అక్రమంగా మాంగనీసు తవ్వకాలు చేస్తున్నారు. ఈ విషయమై పలువురు లోకాయుక్తకు చేసిన ఫిర్యాదుపై జరిపిన విచారణలో తేలినా ఇప్పటివరకు అక్రమ మైనింగ్‌కు కళ్లెం పడలేదు. అయితే ఇప్పుడు తవ్వకాలు జరపడం లేదని అధికారులను బుకాయిస్తున్నా, గుట్టుచప్పుడు కాకుండా కొందరు వ్యాపారులు 20 రోజులుగా ఆదిలాబాద్ నుంచి తరలిస్తుండంపై పోలీసు, రెవెన్యూశాఖల అధికారులకు ఇటీవలే ఫిర్యాదులు అందాయి. ఇదిలా వుంటే అక్రమ మైనింగ్‌కు తోడు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. బోర్వెల్ మిషన్లతో డ్రిల్‌చేసి పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తూ మాంగనీసు తవ్వకాలు చేపడుతున్న వ్యాపారులు, ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తుండటంపై చర్చ జరగుతోంది. అంతేగాకుండా మాంగనీసు తవ్వకాల్లో కొందరు ప్రభుత్వ నిబంధనలకు నీళ్లొదులుతూ ప్రభుత్వానికి రూ.కోట్లలో రాయల్టీ ఎగవేస్తున్నారు.