కర్ణాటక మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తు ప్రారంభం | Karnataka to start mining investigation | Sakshi
Sakshi News home page

కర్ణాటక మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తు ప్రారంభం

Published Mon, Jul 21 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

Karnataka to start mining investigation

బళ్లారి: కర్ణాటకలో ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాలు, రవాణాపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అక్రమ మైనింగ్ ఆరోపణలున్న పలు కంపెనీలకు గత వారం రోజులుగా నోటీసులు జారీ చేసినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. 2006 ఏప్రిల్ 1 నుంచి 2010 డిసెంబర్ 31 మధ్య కాలంలో ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణా, ఎగుమతులకు సంబంధించిన పత్రాలను అందించాల్సిందిగా ఆదేశించింది. 2006-07 నుంచి 2010 మధ్యలో 7.74 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్‌ను అక్రమంగా తరలించడం వల్ల ఖజానాకు భారీగా గండిపడిందని 2011లో అప్పటి లోకాయుక్త సంతోష్ హెగ్డే వెల్లడించిన సంగతి తెలిసిందే

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement