ముద్రగడ ఏమైనా టెర్రరిస్టా?
కాపు నేతల అరెస్టుపై వైఎస్ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని కలిసేందుకు వచ్చిన వైఎస్ఆర్‌సీపీ కాపు నేతలను ఎందుకు అరెస్టుచేశారని ఆయన ప్రశ్నించారు.
ముద్రగడ పద్మనాభం ఏమైనా టెర్రరిస్టా.. ఆయనను ఎవరూ కలవకూడదా అంటూ నిలదీశారు. అంబటి రాంబాబును రహస్య ప్రదేశానికి తరలించాల్సిన అవసరం ఏం వచ్చిందని అడిగారు. పోలీసులు అరెస్టుచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ తక్షణం విడుదల చేయాలని కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.