రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్ | rajahmundry: police arrest ysrcp leaders | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్

Published Sat, Jun 11 2016 12:13 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్ - Sakshi

రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్

రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు శనివారం అడ్డుకున్నారు. ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను తదితరులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్నారు. అయితే వారిని రాజమండ్రి విమానాశ్రయం వద్దే పోలీసులు అడ్డుకోవడంతో, ఆ చర్యను నిరసిస్తూ నిరసనకు దిగారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కోరుకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు కాపు నేతలను ఎక్కడకక్కడ ముందస్తు అరెస్ట్లు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement