ఉద్యమించాల్సిన సమయం వచ్చేసింది: భూమన | this is the time to revolt on ap government, says bhumana karunakar reddy | Sakshi
Sakshi News home page

ఉద్యమించాల్సిన సమయం వచ్చేసింది: భూమన

Published Fri, Dec 23 2016 1:40 PM | Last Updated on Mon, Jul 30 2018 6:25 PM

ఉద్యమించాల్సిన సమయం వచ్చేసింది: భూమన - Sakshi

ఉద్యమించాల్సిన సమయం వచ్చేసింది: భూమన

చంద్రబాబు హమీలతో మోసపోయిన అన్ని వర్గాలూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆయన ఎన్నికల సమయంలో 600కు పైగా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఆ మాటలు నమ్మి నష్టపోయిన రైతులు, డ్వాక్రా మహిళలు, బలహీన వర్గాలు, దళితులు, మహిళలు.. ఎవరైనా సరే ఉద్యమాలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే వారికి పూర్తి వెన్నుదన్నుగా నిలబడతానని చెప్పారు. అందుకు ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధమన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కలిసి ఆయన ఉద్యమానికి మద్దతు తెలిపిన అనంతరం భూమన మీడియాతో మాట్లాడారు. 
 
ముద్రగడ పద్మనాభాన్ని మనస్ఫూర్తిగా అభినందించడానికే తాను వచ్చానని, ఆయన నిబద్ధత కలిగిన వ్యక్తి అని అన్నారు. కాపులకు జరిగిన అన్యాయాన్ని చూసి భరించలేక.. ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం జనవరి 19న పద్మనాభం నిర్వహించిన సభకు నైతిక మద్దతు ఇవ్వడానికి నేను ఆయన్ను కలిస్తే తనను ద్రోహిగా, సంఘవిద్రోహిగా, అరాచక శక్తిగా చంద్రబాబు సృష్టించడానికి విశ్వప్రయత్నం చేశారన్నారు. ముద్రగడ లక్ష్యం పట్ల నమ్మకం కలిగిన వ్యక్తిగా అప్పుడు, ఇప్పుడు తాను చెప్పేది ఒకటేనని, కాపులు చేస్తున్న ఈ పోరాటానికి తమ పరిపూర్ణ మద్దతు కొనసాగుతుందని అన్నారు. తాను చంద్రబాబులా హింసాయుత రాజకీయాలను ప్రోత్సహించనన్నారు. చంద్రబాబు చేసిన కిరాతక చర్యలకు లెక్కేలేదని, అందుకు పరాకాష్ట.. రంగా హత్యలో కూడా చంద్రబాబు పాత్ర ఉందని లోకం కోడై కూస్తోందని చెప్పారు. మామ ఎన్టీ రామారావు మీదే చెప్పులు విసిరిన ఘనత ఆయనదేనని భూమన విమర్శించారు.

పరిటాల, వైఎస్‌ఆర్‌ కుటుంబానికి ఎలాంటి రాజకీయ గొడవలు లేవని భూమన అన్నారు. పరిటాలపై జూబ్లీహిల్స్‌లో కారుబాంబు దాడి జరిగినప్పుడు వైఎస్తో పాటు ఆయన తండ్రి రాజారెడ్డి కూడా పరామర్శించారని భూమన గుర్తుచేశారు. అలాగే రాజారెడ్డి చనిపోయినప్పుడు పరిటాల రవి నివాళులర్పించారన్నారు. ఎన్‌టీఆర్‌ హయాంలో పరిటాల రవిని అణగదొక్కాలని బాబు కుట్రపన్నారని భూమన ఆరోపించారు. ఆధారాలు లేకుండా భయపెట్టాలని చూస్తే తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. 'తుని ఘటనలో నా ప్రమేయముందని సాక్ష్యాలుంటే అరెస్ట్‌ చేయమనండి' అని భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement