సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వరద బాధితులను ఆదకునేందుకు అనునిత్యం చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. లోకేష్, చంద్రబాబు చెబితే పాలన జరగడం లేదని, తండ్రీ కొడుకులు హైదరాబాద్‌లో కాపురం పెట్టి ఏపీపై పెత్తనం చేస్తున్నారని దుయ్యబట్టారు. లోకేష్ చెప్తే వాళ్ళ కార్యకర్తలే వినరని, తమ బాధ్యత ఏంటో తమకు తెలుసునని ఎద్దేవా చేశారు. బహుశా లోకేష్ కొత్తగా వరద ప్రాంతాల్లో పర్యటించినట్లున్నాడని మంత్రి కన్నబాబు అన్నారు. అమరావతి ఏ ఒక్కరికో నోటిఫై చేసిన ప్రాంతం కాదని, ఇక్కడ అందరికీ హక్కు ఉంటుందని తెలిపారు. మాదే పెత్తనం అంటే ఒప్పుకునేది లేదని, పేదలు, దళితులకు ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందని గుర్తుచేశారు. (చంద్రబాబుది ఆరాటం.. జగన్‌గారిది నిరంతర పోరాటం)
పీడబ్ల్యూగ్రౌండ్ సమీపంలోని రైతు బజార్‌ను సందర్శించిన కన్నబాబు వినియోగదారులకు సబ్సిడీ ఉల్లిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉల్లి ధరలు పెరగడంతో సబ్సిడీకి ఇవ్వాలని నిర్ణయించామని, మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయల స్టాక్ తెప్పిస్తున్నామని తెలిపారు. సబ్సిడీ భరించడానికి ప్రభుత్వం సిద్ధమైందని, రైతుతో పాటు వినియోగదారుడిని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. 'ప్రజల ప్రతీ అంశం సూక్ష్మంగా ఆలోచించే సీఎం జగన్ వినియోగదారులకు సబ్సిడీని ఇవ్వాలని నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఉల్లి సరఫరా చేస్తున్నాం.దేశంలో నిత్యవసర వస్తువులపై స్పందించే సీఎం జగన్ మాత్రమ. ప్రతీ షాపు దగ్గర ధరల బోర్డులు ఉండాలి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్,సబ్ కలెక్టర్‌లు నిత్యావసరాల సరఫరా పర్యవేక్షణ చేస్తారు. నిత్యావసరాలు ఎక్కడా బ్లాక్ చేయడానికి వీలు లేదు. బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం' అని వెల్లడించారు. (వరదలు: సహాయ చర్యలపై సీఎం జగన్ ఆరా)
Comments
Please login to add a commentAdd a comment