అవినీతిపై కదలిక...? | officials moved in corruption | Sakshi
Sakshi News home page

అవినీతిపై కదలిక...?

Published Wed, Feb 1 2017 10:08 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

officials moved in corruption

ప్రొద్దుటూరు టౌన్‌ :  అవినీతికి పాల్పడిన వారిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి ఉత్తర్వులు వస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 2, 3 వార్డుల్లో  ఉన్న లుకు సంబంధించి పన్నులు వేయడంలో  అవినీతి జరిగింది. ఈ విషయంపై సాక్షిలో  కథనాలు వచ్చాయి. వీటి ఆధారంగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అలాగే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ వంగనూరు మురళీధర్‌రెడ్డి  కూడా డీఎంఏ కన్నబాబుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా అవినీతి జరిగిన విషయంపై ప్రశ్నించారు. విచారణ చేసిన డీఎంఏ విజిలెన్స్‌ అధికారులు అపార్ట్‌మెంట్లకు వేసిన పన్నుల్లో మున్సిపాలిటీ ఆదాయానికి అధికారులు రూ.40 లక్షల మేర నష్టం చేకూర్చారని నివేదిక ఇచ్చారు. అయితే ఎవరి హయాంలో జరిగిందన్న  విషయాన్ని విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీకి డీఎంఏ ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదిక ఇవ్వడంలో  జాప్యం ఏర్పడింది. మూడేళ్ల కిందట నిర్మించిన అపార్ట్‌మెంట్లకు అప్పటి కమిషనర్‌ ప్రమోద్‌కుమార్, ఆర్‌ఐ గిరిధర్‌బాబు, బిల్‌ కలెక్టర్‌లు కేవలం ఆరు నెలలకే పన్ను వేసి అధికార పార్టీ నాయకుడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. దీనిపై కూడా అప్పటి ఆర్డీ మురలీకృష్ణగౌడ్‌ విచారణ చేశారు.
గదుల వేలంలో...
 పట్టణంలోని శివాలయం వీధి, కోనేటికాలువ వీధిలో ఉన్న మున్సిపల్‌ గదుల వేలం నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహించారని, దీని వల్ల మున్సిపల్‌ ఆదాయానికి గండి పడిందన్న విషయంపై ఇటీవల డీఎంఏ కమిషనర్‌కు చార్జి మెమో ఇచ్చారు. అయితే కొత్తగా విధుల్లో చేరిన కమిషనర్‌కు రెవెన్యూ అధికారులు గతంలో జరిగిన విషయాలను ఏదీ చెప్పకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనిపై కూడా ఉన్నతాధికారులు కమిషనర్, రెవెన్యూ అధికారులకు చార్జి మెమోలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు, సిబ్బందికి ఈ విషయం తెలిసి ఆందోళన చెందుతున్నారు. మరో రెండు, మూడురోజుల్లో అధికారులపై చర్యల ప్రతులు వస్తాయని ఆశాఖ అధికారులే అంటున్నారు. ఏఏ మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారన్న విషయంపై కూడా ఆర్డీ కార్యాలయ అధికారులు వివరాలు సేకరించారు. ఇందులో ముగ్గురు కమిషనర్లు, నలుగురు ఆర్‌ఐలు, ఆర్‌ఓలు, బిల్‌కలెక్టర్లు, ఇతర సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement