muralidhar reddy
-
చరిత్రను చెరిపేస్తున్నారు.. క్రీ.పూ.2 వేల ఏళ్లనాటి చిత్రకళ కనుమరుగు!
అదో గుట్ట.. దానిపై ఉన్న గుండ్లనే కాన్వాస్‌గా మలచి ఆదిమానవులు దానిపై పురివిప్పి నర్తించిన నెమలిని గీశారు.. ఘీంకరిస్తూ కదలాడిన ఏనుగును సాక్షాత్కరింపజేశారు.. భారీ అడవిదున్నలను నియంత్రించిన తమ సహచరుల వీరత్వాన్ని చూపారు. సుమారు పదివేల ఏళ్ల నాటి ఈ చిత్రాలు పాత రాతియుగం మొదలు క్రీ.పూ.2 వేల ఏళ్ల క్రితం విలసిల్లిన తొలి చారిత్రక యుగం వరకు వివిధ కాలాల్లో ఆదిమానవులు గీసినవి. కానీ ఇప్పుడు వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లు మింగేస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో చారిత్రక విధ్వంసం జరుగుతోంది. హైదరాబాద్‌కు 30 కి.మీ. దూరంలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఆదిమానవుల కాలం నాటి చిత్రకళ కనుమరుగవుతోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లలో భాగంగా ఆదిమానవులు గీసిన చిత్రాలున్న గుట్ట శిథిలమవుతోంది. ఇప్పటికే రెండు కాన్వాస్‌లు మాయమవగా మరో మూడు విధ్వంసం అంచున నిలిచాయి. వాటిని పురావస్తు శాఖ రక్షిత ప్రాంతంగా గుర్తించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. 30 అడుగుల భారీ కాన్వాస్.. గుట్టమీద ఎక్కువ చిత్రాలున్న గుండు ఓ కాన్వాస్లాగా కనిపిస్తోంది. దాదాపు 30 అడుగుల పొడవు, 6 అడుగుల ఎత్తుతో ఈ కాన్వాస్ నిండా ఆదిమానవులు ఎరుపురంగుతో గీసిన చిత్రాలే కనిపిస్తున్నాయి. క్రీ.పూ.10 వేల ఏళ్ల నుంచి 4 వేల ఏళ్ల మధ్యలో విలసిల్లిన పాత రాతియుగం, క్రీ.పూ.4 వేల ఏళ్ల నాటి కొత్త రాతియుగం, ఆ తర్వాతి తొలి చారిత్రక యుగం.. ఇలా మూడు కాలాల్లో ఈ చిత్రాలు గీసినట్టు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వీటిల్లో ఎక్కువగా అడవి దున్నల చిత్రాలున్నాయి. ఒక దున్న విడిగా ఉండగా, మరోచోట లావుగా ఉన్న దున్న ముందు మనిషి చేతిలో ఆయుధం పట్టుకుని నిలబడి ఉన్నాడు. దానికి ఓ పక్కన ఏనుగు చిత్రం కనిపిస్తోంది. దానికి దిగువన భారీ పింఛాన్ని విప్పిన నెమలి చిత్రం ఉంది. ఈ చిత్రం కొంత అస్పష్టంగా ఉంది. దాన్ని జిరాఫీ లేదా నీల్గాయ్ లాంటి జంతువుగా కూడా పరిశోధకులు భావిస్తున్నారు. వాటి చుట్టూ మరిన్ని చిత్రాలున్నాయి. వాటిలో పక్షులు, చెట్లు, చేపలు తదితర ఆకృతులున్నాయని అంటున్నారు. మరోపక్కన మనిషి రెండు చేతులతో రెండు భారీ జంతువుల మెడలు పట్టుకొని గాలిలో ఎత్తి పట్టుకున్నట్లు ఉంది. మరో కోణంలో చూస్తే మనుషులు చేతులను జతగా పట్టుకొని నర్తిస్తున్న అనుభూతి కూడా కలుగుతోంది. 2016లో చిత్రాల గుర్తింపు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 80 ప్రాంతాల్లో ఆదిమానవుల చిత్రాలు వెలుగుచూశాయి. 2016లో గుండ్ల పోచంపల్లికి చెందిన సాయికృష్ణ అనే రీసెర్చ్ స్కాలర్ గ్రామానికి 2 కి.మీ. దూరంలో ఉన్న మల్లన్నగుట్ట, చిత్రాలగుట్టలో ఆదిమానవులు గీసిన చిత్రాలతో ఉన్న ఐదు ప్రాంతాలను గుర్తించారు. ఆదిమానవులు గీసిన చిత్రాల్లో ఏనుగు బొమ్మ ఉందంటే అప్పుడు, అక్కడ ఏనుగులు తిరగాడాయని స్పష్టమవుతోంది. ఇప్పటివరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని పోతనపల్లిలో తొలి చారిత్రక కాలానికి చెందిన చిత్రాల్లో, సిద్దిపేట సమీపంలోని దాసర్లపల్లిలో చారిత్రక యుగానికి చెందిన చిత్రాల్లో ఏనుగులు ఉన్నాయి. తాజాగా గుండ్లపోచంపల్లిలో ఆదిమానవులు గీసిన చిత్రాల్లోనూ అవి కనిపించడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ విస్తరించిన ప్రాంతంలో ఒకప్పుడు ఏనుగులు తిరిగేవనడానికి ఆదిమానవులు గీసిన ఈ చిత్రమే సాక్ష్యం. చట్టం ఏం చెబుతోంది? ప్రభుత్వ స్థలం కానప్పటికీ చరిత్రలో కీలక ప్రాధాన్యం ఉన్న ఆధారాలు ఉంటే ఆ ప్రాంతాన్ని పురావస్తు శాఖ రక్షిత ప్రాంతంగా గుర్తించే వీలుంది. పురావస్తు శాఖ పరిరక్షించాలి.. పురాతన స్థలాలు, రక్షిత కట్టడాల పరిరక్షణ చట్టం ప్రకారం చారిత్రక ఆధారాలున్న స్థలాన్ని సేకరించి రక్షిత కట్టడంగా ప్రకటించొచ్చు. లేదా ప్రైవేటు వ్యక్తుల అధీనంలోనే ఉంచుతూ దాన్ని రక్షిత కట్టడంగా ప్రకటించొచ్చు. ఇలాంటి ప్రాంతాలు ప్రమాదంలో పడ్డప్పుడు పురావస్తు శాఖ వెంటనే స్వాధీనం చేసుకొని పరిరక్షించాలి. వాటిని ధ్వంసం చేయకుండా స్థల యజమానులతో మాట్లాడాలి. – డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ అవి ధ్వంసమైతే ఆధారాలు దొరకవు.. గుండ్లపోచంపల్లిలో వెలుగుచూసిన ఆదిమానవుల చిత్రాలు అరుదైనవే. ఏనుగు, నెమలి బొమ్మలు రెండు, మూడుచోట్లనే కనిపించాయి. వాటి ఆధారంగా ఆదిమానవులకు సంబంధించి మరింత ఆసక్తి కలిగించే సమాచారం తెలుసుకునే వీలుంటుంది. అవి ధ్వంసమైతే అత్యంత విలువైన సమాచారాన్ని మనం చేజేతులా నాశనం చేసుకున్నట్టే. ప్రభుత్వం పరిరక్షణకు కదలాలి. – బండి మురళీధర్‌రెడ్డి, ఆదిమానవుల రాతిచిత్రాల నిపుణుడు -
వైఎస్సార్సీపీ నేత మురళీధరరెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ విజయమ్మ
-
ఆ గ్రామాలను కంటైన్మెంట్గా ప్రకటిస్తాం: కలెక్టర్
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో నేడు కొత్తగా 367 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,539 కు చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం 1883 యాక్టివ్ కేసులు ఉండటంతో రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా పలు ఆంక్షలతో కూడిన నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదైన గ్రామాలను పూర్తిగా కంటైన్మెంట్గా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కేసులు అధికంగా నమోదైన ప్రాంతాల్లో అధికారులు పర్యటిస్తారని కలెక్టర్ తెలిపారు. యువకులు అనవసరంగా బైకులపై రోడ్ల మీద తిరుగుతున్నారని, వారు బయటకు రాకుండా తల్లిదండ్రులు కట్టడి చేయాలని ఆయన కోరారు. కరోనా రోజురోజుకు కోరలు చాస్తున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, లేదంటే మహమ్మారి మరింత విజృంభిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉందని, మెడికల్ షాపులు నిత్యవసరాల దుకాణాలకు మాత్రమే మినహాయింపు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం మటన్, చికెన్ షాపులు, చేపల మార్కెట్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. -
ఇసుక కోసం ఆందోళన చెందవద్దు
సాక్షి, తూర్పుగోదావరి : ఇసుక కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లా స్ధాయిలో ఇసుకపై ఒక అధ్యయనం చేశామని కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నూతన ఇసుక పాలసీ వచ్చిన తరువాత 112 రీచ్‌లకు అనుమతి ఇచ్చాం. ప్రస్తుతం 48 ఇసుక రీచ్‌లు పని చేస్తున్నాయి. 30 రీచ్‌లు ఇసుక లేని కారణంగా పని చేయడం లేదు. వాటిని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాధారణ ఇసుక వినియోగదారులు ఇప్పటి వరకు 9,19,900 మెట్రిక్ టన్నుల ఇసుకను బుక్ చేసుకున్నారు. దాంట్లో 8.29 లక్షల మెట్రిక్ టన్నులు( 90 శాతం) సరఫరా చేశాం. ప్రభుత్వ పనులకు 3.72 లక్షల మెట్రిక్ టన్నులకు గానూ 2 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశాం. నాడు-నేడు కార్యాక్రమానికి 50 వేల మెట్రిక్ టన్నులకు గానూ 39 వేల మెట్రిక్ టన్నులు ఇసుకను సప్లయి చేశాం. ఇసుక రీచ్‌ల వద్ద సమస్యలు, ఆన్లైన్ బుకింగ్ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి. వాటి మీద మైనింగ్, ఎపీఎండీసీ అధికారులతో చర్చించాం. జేసీకే ఇసుక తవ్వకాలకు సంబంధించిన అనుమతులు ఇచ్చాం. అనుమతి కోసం అమరావతికి వెళ్లనవసరం లేదు. ఇసుక బల్క్ బుకింగ్ కూడా జాయింట్ కలెక్టర్( సంక్షేమం)కే అనుమతి అధికారం ఇచ్చాం. జిల్లాలో ఇసుక రిజర్వర్స్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక స్టోర్ చేసి పెట్టుకున్నాం. ప్రతి రోజు వీటి నుండి 30 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సప్లయి అవుతుంది. కెడ్రాయి సంస్ధ వాళ్లు తమ ఇసుక అవసరాల కోసం జేసీ (సంక్షేమం) నుండి అనుమతి తీసుకోవాలి. -
అంఫన్‌తో జాగ్రత్త
సాక్షి, కాకినాడ: అంఫన్ తుపాను హెచ్చరిక నేపథ్యంలో అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రా ల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి సోమ వారం రాత్రి తీర ప్రాంత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. తుని, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, కాకినాడలతో పాటు కోనసీమ ప్రాంతంలోని కాట్రేనికోన, అల్లవరం, అమలాపురం, మలికిపురం, రాజోలు, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అయినవిల్లి మండలాల అధికారులు అప్రమత్తంగా ఉంటూ 24 గంటల తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాల్లో తుపాను హెచ్చరికలపై ప్రచారం చేయాలన్నారు. అవసరమైతే పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే తమిళనాడు దక్షిణ కోస్తాతో పాటు నెల్లూరు లో వర్షాలు పడుతున్నాయన్నారు. ఇది ఉత్తర దిశగా కదులుతుందని, ఈ నెల 20, 22 తేదీల మ«ధ్య ఒడిశా, భువనేశ్వర్ తీరంవైపు కదులు తూ బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలున్నట్టు తు పాను హెచ్చరిక కేంద్రం ప్రకటించడంతో అధికారు లు అప్రమత్తం కావాలన్నారు. జిల్లాలో బుధవారం ఈదురుగాలులతో వర్షం పడే అవకాశాలున్నట్టు తెలిపారు. సముద్రం తీరానికి పర్యాటకులను అనుమతించ వద్దని, ఎవరైనా వస్తే వారిపై అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని మండల కేంద్రాలు, రెవెన్యూ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించారు. తుపాను సమయంలో వినియోగించే వివిధ పరికరాల పని తీరును పరిశీలించి తదనుగుణంగా వాటిని సిద్ధం చేసుకోవాలని మండల పరిధిలోని అధికారులను కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. రాజోలు దీవిలో ‘అల’జడి 30 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం మలికిపురం: అంఫన్ తుపాను ప్రభావం రాజోలు దీవి సముద్ర తీరంలో తీవ్రంగా ఉంది. తుపాను కారణంగా సముద్రపు అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. సుమారు 30 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. రాజోలు దీవిలో సముద్ర తీరం వెంబడి భారీగా అలలు భూభాగం వైపు చొచ్చుకుని వచ్చాయి. భూభాగం కూడా కొట్టుకుపోతోంది. మలికిపురం ఎస్సై ఎం.నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది సముద్ర తీరం వద్ద బందోబస్తు నిర్వహించి ప్రజలు అటు వైపు రాకుండా అడ్డుకున్నారు. -
‘కరోనా వస్తే పరిశ్రమ మూసేస్తాం’
సాక్షి, కాకినాడ : ఏదైనా పరిశ్రమ పరిధిలో కరోనా పాజిటివ్ కేసు నమోదైతే ఆ పరిశ్రమను తక్షణమే మూసివేస్తామని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అన్నారు. శనివారం ప్రమాదకర పదార్ధాలు కలిగిన పరిశ్రమల భద్రతపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఓఎన్జీసీ, గెయిల్, రిలయన్స్, కోరమాండల్, ఎన్ఎప్సీయల్, తదితర పరిశ్రమల ప్రతినిధులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ జిల్లాలో ప్రమాదకర పదార్ధాలు కలిగిన 21 పరిశ్రమలు ఉన్నట్లు గుర్తించాము. వారంలోగా ఈ పరిశ్రమలు సేప్టీ ఆడిట్‌పై నివేదిక ఇవ్వాలి. మాక్ డ్రిల్స్‌ను నిర్వహించి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ ఉండే ప్రజలు ఎలా రక్షణ పొందాలనేదానిపై అవగాహన కల్పించాలి. ప్రమాద సమయాలలో వినియోగించే సైరన్ పని చేస్తుందో లేదో తనిఖీ చేయాలి. ప్రమాదాల నుండి బయట పడే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా సహకారం తీసుకోండి. ( ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం ) ప్రతి పరిశ్రమలో ఉన్న అన్ని యూనిట్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చాలి. అవి నిరంతరం పని చేయాలి. ఏదైనా ప్రమాదం వాటిల్లితే.. ప్రస్తుత లాక్డౌన్ పరిస్ధితుల వల్ల ఇతర ప్రాంతాల నుండి నిపుణులు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. అందువల్ల మనమే ప్రమాదాన్ని త్వరగా నివారించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పరిశ్రమలలో పని చేసే కార్మికులకు పూర్తి భద్రత కల్పించాలి. సోషల్ డిస్టన్స్ పాటించేలా చర్యలు తీసుకోండ’’ని ఆదేశించారు. -
‘చిన్న తరహా పరిశ్రమలకు అనుమతి ఇచ్చాం’
సాక్షి, తూర్పుగోదావరి: కరోనా(కోవిడ్-19) ప్రభావిత ప్రాంతాలను మూడు జోన్లుగా కేంద్రం నిర్ణయించగా తూర్పుగోదావరి జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మే 1న జిల్లాలో మళ్లీ తునిలో తొలి కేసు నమోదైందని ఆయన తెలిపారు. పాజిటివ్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ల ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. జిల్లాలో 12 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని ఆ ప్రాంతాల్లో ఎటువంటి సడలింపులు లేవని ఆయన స్పష్టం చేశారు. (కరోనా: ఏపీలో మరో 58 పాజిటివ్ కేసులు) రాజమండ్రి, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, తుని, ప్రాంతాల్లో కంటైమెంట్ జోన్లు ఉన్నాయన్నారు. కంటైన్మెంట్ మినహా మిగతా ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో 33 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు హ్యాండ్ వాష్, ఫేస్ మాస్క్ తప్పనిసరిగా వినియోగించాలని ఆయన సూచించారు. భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. ఆటోల్లో ఇద్దరు, కారులో ముగ్గురు, టూ వీలర్ వాహనాల్లో ఒక్కరు మాత్రమే ప్రయాణించాలని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 12, 372 శాంపిల్స్ పరీక్షిస్తే, 45 పాజిటివ్ కేసులు నమోదు కాగా 17 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. ప్రతీరోజు 5 నుంచి 6 వందల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. హెల్త్, శానిటేషన్ సిబ్బందికి హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. జిల్లాలో ఆరు కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. జిల్లాకు చెందిన కరోనా బాధితులంతా కోలుకుంటున్నారని, ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 65 చిన్న తరహా పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని రేపటి (సోమవారం) నుంచి గ్రీన్‌జోన్‌లోని పరిశ్రమలు నిబంధనలు అనుసరిస్తూ కార్యకాలపాలు చేపట్టవచ్చని ఆయన వివరించారు. జిల్లాలో 2765 మంది వలస కార్మికులు ఉన్నట్టు గుర్తించామని ఆయన తెలిపారు. వీరిలో 885 మంది ఏపిలో వివిధ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా వారిని సొంత ఊర్లకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. సొంత వాహనాలు ఉంటే సొంత ఊర్లు వెళ్లేందుకు అనుమతిస్తామని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. గ్రీన్జోన్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారపు సంతలు, సభలు సమావేశాలకు అనుమతి లేదని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. -
పరీక్ష చేయించుకో.. బహుమతి తీసుకో..!
సాక్షి, కాకినాడ: కోవిడ్–19 వ్యాధి నివారణ దిశగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. పొడి దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకుంటే ఆకర్షణీయమైన గిఫ్ట్‌తోపాటు నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. ఈ లక్షణాలున్నవారు అధికారులకు సమాచారం అందిస్తే ఇంటి వద్దకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఒకవేళ పాజిటివ్‌గా తేలితే పేరు గోప్యంగా ఉంచి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో ప్రతి వారం ఐదుగురు చొప్పున లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసి మిక్సీ, గ్రైండర్, గ్యాస్ స్టౌ, కుక్కర్ తదితర బహుమతులతోపాటు ఒక్కొక్కరికి రూ.5,500 అందజేస్తామని వివరించారు. ఈ వారం రోజుల్లో వైద్య పరీక్షలకు ముందుకు వచ్చిన వారిలో లక్కీడిప్ ద్వారా ఎంపికైన ఐదుగురు విజేతలకు శనివారం కలెక్టరేట్లో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం కోవిడ్–19 నియంత్రణ, పర్యవేక్షణకు నియమించిన ప్రత్యేకాధికారి కాంతిలాల్ దండే ఆధ్వర్యంలో జరిగింది. -
‘ఆ ఉద్యోగి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు’
సాక్షి, కాకినాడ: ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ ఆసుపత్రులు బేఖాతరు చేస్తే ఉపేక్షించేది లేదని.. గుర్తింపు రద్దు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి హెచ్చరించారు. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం కాకినాడ ఎస్ఈజడ్ లోని పాల్స్ ప్లస్ పరిశ్రమలో తయారు చేసిన పిపిఈ కిట్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్లో విధులు నిర్వహించే పోలీసులు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు చికిత్సనందించే వైద్యులు, సిబ్బందికి పిపిఈ కిట్స్ అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శంఖవరం మండలం కత్తిపూడిలో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యిందని తెలిపారు. విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పది రోజుల క్రితం కత్తిపూడికి వచ్చారని.. కరోనా లక్షణాలు ఉన్నప్పటికి గోప్యంగా ఉంచి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. విశాఖ కొవిడ్ ఆసుపత్రికి తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు కాంటాక్ట్స్ ను రెవెన్యూ, వైద్యాధికారులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. ఆయనకు చికిత్స అందించిన ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. -
యాచకులకు శారద స్వచ్చంద సంస్థ ఆహార పోట్లాల పంపిణీ
-
కట్టుబట్టల్తో బయటపడ్డాం
సాక్షి, కాకినాడ : నగరంలోని దేవి మల్టీప్లెక్స్ సమీపంలో పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం భాస్కర్ ఎస్టేట్స్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం భాస్కర్ ఎస్టేట్స్ భవనాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ రమేష్, స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు కలెక్టర్ వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. మందులు కూడా తీసుకోకుండా కట్టుబట్టలతో రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం మురళీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ భవనాన్ని పరిశీలించాము. మూడు పిల్లర్లు డామేజ్ అయ్యాయి. భవనంలోనికి ఎవరినీ అనుమతించేది లేదు. విలువైన సామగ్రిని తీసుకోవడానికి అవకాశం కల్పించాలంటూ స్థానికులు కోరుతున్నారు. ఫైర్ సిబ్బందితో మాట్లాడి వారి సహాయంతో ఒక్కొక్కరినీ లోపలికి పంపించి సామాన్లు తెప్పించే ప్రయత్నం చేస్తాము. భవనం పరిస్థితిని అధ్యయనం చేయడానికి జేఎన్టీయూ కాకినాడ నిపుణుల బృందం వస్తుంది. భవనం పరిస్థితిని అధ్యయనం చేసిన తరువాత వారి సూచనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. నిపుణుల నివేదిక ఆధారంగా భవనాన్ని కూల్చాలా లేక రిట్రో ఫిటింగ్ చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. భవనం నిర్మించిన బిల్డర్లను, ఇంజనీర్లను రప్పించి వారితో మాట్లాడతామ’’ని అన్నారు. చదవండి : కాకినాడ: పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం -
‘గ్రామ వాలంటీర్లను భాగస్వాముల్ని చేయాలి’
సాక్షి,కాకినాడ: జిల్లా అధికారులందరూ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2019లో భాగస్వాములవ్వాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సర్వే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 27 మధ్యలో జరుగుతుందని పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ.. జిల్లాలో సెప్టెంబర్ మాసం చివరిలో సర్వే బృందాలు పర్యటించే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా సుమారు 30 గ్రామాల్లో ఈ బృందాలు పర్యటిస్తాయిని పేర్కొన్నారు. దీంతోపాటు సర్వే ర్యాకింగ్ ఆధారంగా జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందజేస్తారని స్పష్టం చేశారు. ఈ పురస్కారాలను అక్టోబర్ 2న ప్రధానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాకు మంచి ర్యాంకు సాధించే దిశగా కిందిస్థాయి ఉద్యోగులకు సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఆన్లైన్ సమీక్షలు అందించే అంశంలో కళాశాల విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా అన్ని గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉండేలా చూసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లను భాగస్వాముల్ని చేయాలని అధికారులను సూచించారు. ‘స్వచ్ఛ దర్పణ్’ ర్యాంకుల్లో రాష్ట్రంలోనే తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉందని మురళీధర్ రెడ్డి తెలిపారు. -
జసిత్ నివాసానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ
సాక్షి, మండపేట : రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న చిన్నారి జసిత్ కిడ్నాప్ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బుధవారం మండపేటలోని జసిత్ నివాసానికి వచ్చారు. చిన్నారి తల్లిదండ్రులు వెంకటరమణ, నాగవల్లిని పరామర్శించిన కలెక్టర్, ఘటనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, నిందితుల్ని అదుపులోకి తీసుకుని జసిత్‌ను సురక్షితంగా తీసుకువస్తామని ఓదార్చారు. చదవండి: జసిత్ కిడ్నాప్; వాట్సప్ కాల్ కలకలం మరోవైపు తన కుమారుడిని క్షేమంగా అప్పగించాలంటూ కిడ్నాపర్లను జసిత్ తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు. అయితే కిడ్నాపర్ల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి డిమాండ్లు రాలేదు. దీంతో కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక జసిత్ ఆచూకీ కోసం వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. -
హాస్టల్లో నిద్రించిన కలెక్టర్
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) : వసతి గృహాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలల్లో కలెక్టర్లు వారంలో ఒక రోజు నిద్రించి అక్కడి సమస్యలను పరిష్కారించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో కలెక్టర్ మురళీధర్ రెడ్డి రాజమహేంద్రవరం నుంచి ఈ కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టారు. స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాలకు చెందిన వసతి గృహం, దాని పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌ను తనిఖీ చేశారు. అక్కడి మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్వహణ, భోజనం తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలని, అమ్మఒడి పథకం గురించి తెలుసుకోవాలన్నారు. వసతుల కల్పనకు ప్రాధాన్యం కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో నిర్ణయించిన విధంగా హాస్టళ్లు, ఆస్పత్రులను తనిఖీ చేసి వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక రిటైర్ అధికారిని ఏర్పాటు చేసి వసతులు, మరుగుదొడ్డి సౌకర్యాలను పరిశీలిస్తున్నామన్నారు. వారంలో ఒక రోజు ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు వసతి గృహాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులను మెరుగు పరుస్తామన్నారు. రాజమహేంద్రవరంలోని వసతి గృహాల్లో వసతుల కల్పనకు మున్సిపల్ కమిషనర్ చర్యలు చేపట్టాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కళాశాలకు కమిషనర్ రూ.15 లక్షల నిధులు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారన్నారు. వసతి గృహాల్లో వసతుల కోసం రూ.15 కోట్లు ఖర్చు చేయడానికి కలెక్టర్లకు ప్రభుత్వం వీలు కల్పించిందన్నారు. అభివృద్ధికి దోహదం ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ ఆస్పత్రులు, వసతి గృహాల్లో కలెక్టర్లు బస చేయడం వాటి అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పరిష్కారానికి వీలుంటుందన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎంపీ ఆకాంక్షించారు. విద్యార్థులతో మాటామంతీ ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. అమ్మఒడి పథకం గురించి ఎంతమందికి తెలుసు అని అడగడంతో విద్యార్థులందరూ చేతులు పైకెత్తి మాకు తెలుసు అని చెప్పారు. భోజనానికి ముందు, అనంతరం చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో వారిని అడిగారు. స్వయంగా చేసి చూపిం చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల న్నారు. టెస్టు పుస్తకాలను బాగా చదివితే విషయ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాత్రికి సాంఘిక బాలుర వసతి గృహం–1లో బస చేశారు. ఆయన వెంట రాజమహేంద్రవరం ఇన్చార్జి సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి ఉన్నారు. -
తండ్రి కోరికను కాదనుకుండా...
నాకు ఇంజినీరింగ్ అంటే ఇష్టం. మా నాన్నకు ప్రజలకు సేవ చేసే ఉద్యోగం అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన తన జీవిత కాలమంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజినీర్‌గా పని చేశారు. అదంతా రొటీన్. పరిపాలనా విభాగాల్లో ఉద్యోగం చేస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు కొంతయినా సేవ చేసే భాగ్యం కలుగుతుందనే భావన ఆయనది. నా ఇష్టాన్ని, నాన్న ఆశయాన్ని కలగలిపి నా జీవన పయనం సాగిస్తున్నాను. ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పూర్తి చేసి.. తరువాత గ్రూప్–1 పరీక్ష రాసి తొలిసారి ఆర్డీఓగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాను. తరువాత వివిధ జిల్లాల్లో పలు బాధ్యతలు నిర్వర్తిస్తూ.. తొలిసారిగా ఇంత పెద్ద జిల్లాకు కలెక్టర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అన్ని సమస్యలూ కలగలిపిన జిల్లా ఇది. అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ అందరికీ అభివృద్ధి ఫలాలను అందించాలి. కార్యాలయంలో కూర్చొని మిగిలిన వారిపై గద్దిస్తే సరిపోదు. ప్రజాక్షేత్రంలో ఉంటూ ‘రండి పని చేద్దాం’ అని పిలుపునిచ్చే మనస్తత్వం నాది. ఆ దిశగానే అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలల పంటయిన నవరత్నాలను విజయవంతంగా అమలు చేయడం నా ముందున్న ప్రథమ కర్తవ్యం. ‘సాక్షి’తో జిల్లా నూతన కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి :తండ్రే ఆయనకు స్ఫూర్తి. వృత్తిలో ఒడిదొడుకులు సహజం. బాధ కలిగినా, సంతోషం కలిగినా ఎక్కువగా రియాక్ట్ కాకూడదనే తన తండ్రి సిద్ధాంతాన్ని విశ్వసించారు. బ్యాలెన్స్డ్గా ఉంటే అదే సక్సెస్‌ను తెచ్చి పెడుతుందనే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. టెక్నాలజీలో ముందుకు వెళ్దామనుకున్నారు. తండ్రి మాత్రం ప్రజలకు సేవచేసే ఉద్యోగం సంపాదించాలన్నారు. తన ఆసక్తిని పక్కన పెట్టకుండా, తండ్రి కోరికను కాదనుకుండా నొప్పింపక తానొవ్వక అన్నట్టు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో చేరి వృత్తికి సాంకేతికతను జోడించి ముందుకు వెళ్తున్నారు. ఆయనే మన కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి. బాల్యం నుంచి కలెక్టర్ పదవి వరకు తన ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రతిష్టాత్మకమైన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా తన ప్రాధాన్య అంశాలను వివరించారు. స్వస్థలం, చదువు.. మాది కర్నూలు జిల్లా పాణ్యం మండలం బలపనూరు గ్రామం. బాల్యం వివిధ ప్రాంతాల్లో గడిచింది. ఉద్యోగ రీత్యా మా తండ్రి గారు ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పనిచేయడం వల్ల తిరగాల్సి వచ్చేది. స్వగ్రామమైన బలపనూరులోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేశాను. ఏడో తరగతి వరకు అక్కడే చదివాను. తర్వాత కర్నూలులో పదో తరగతి వరకు చదివాను. ఇంటర్మీడియట్ (ఎంపీసీ) గుంటూరులోని విజ్ఞాన్ కళాశాలలో, కర్నూల్లో పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎంటెక్ చేశాను. కుటుంబ నేపథ్యం.. మాతండ్రి పేరు రవికుమార్‌రెడ్డి, తల్లి శ్యామల. మా నాన్న గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఏఈగా బాధ్యతలు ప్రారంభించి ఈఈ వరకూ ఎదిగి ఉద్యోగ విరమణ చేశారు. నా సతీమణి పేరు హేమ. వారిది కూడా కర్నూలే. పెద్దలు కుదిర్చిన వివాహం మాది. ఆమె ఎమ్మెస్సీ చేశారు. వివాహం తరువాత ఎంబీఏలో డిప్లమో చేశారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు మణిపాల్‌లో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పాప వెల్లూరు బిట్స్‌లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతోంది. ఇంజినీరింగ్ వైపు వెళ్దామనుకుని.. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులోకి.. తండ్రి ఇంజినీర్‌గా పని చేయడంతో నాకు కూడా ఇంజినీర్‌గా స్థిరపడాలని ఉండేది. అందుకే ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పీజీ చేశాను. నాకేమో ఇంజినీరింగ్ వైపు ఆసక్తి. టెక్నికల్‌గా వెళ్దామనుకున్నాను. కానీ మా తండ్రి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వైపు వెళ్లాలని కోరుకునేవారు. ప్రజలకు సేవ చేసే సర్వీసులో ఉద్యోగం సంపాదించాలని, పేదల సేవలో ఉండే ఉద్యోగం చేస్తే మనిషికి సంతృప్తి అనేది ఉంటుందని చెప్పేవారు. తొలుత ఇంజినీరింగ్ సర్వీస్ కోసం ప్రిపేర్ అయ్యాను. అలాగని తండ్రి కోరికను కాదనలేకపోయాను. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు కోసం ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో భాగంగా 1996లో గ్రూప్–1 సర్వీసు వచ్చింది. ఆ తర్వాత ఇటువైపు ఉండిపోయాను. అలాగని అడ్మినిస్ట్రేటివ్లోకి వచ్చిన తర్వాత టెక్నాలజీని ఎక్కడా వదలలేదు. టెక్నాలజీకి దూరం కాలేదు. నా స్టైల్ ఆఫ్ ఫంక్షన్లో కూడా ఎప్పుడూ సాంకేతికత ఉంటుంది. ప్రతి దాంట్లో సాంకేతికతను జోడిస్తాను. వృత్తిలో ఆ ఇద్దరే ఆదర్శం అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులోకి వచ్చాక ఓ ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లను ఆదర్శంగా తీసుకున్నాను. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కృష్ణయ్య, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్‌తో పనిచేసిన అనుభవం ఉంది. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ప్రతి దానిలో వారి ద్వారా స్ఫూర్తి పొందాను. వారిని నేనొక మోడల్‌గా తీసుకునే వాడిని. పనిచేసే చోట ప్రతి అధికారి వద్ద మంచి సంబంధాలు కొనసాగిస్తూ రావడం నాకు ఆయా విభాగాల్లో మంచి సంతృప్తిని ఇచ్చింది. ఫస్ట్‌టైమ్ కలెక్టర్‌గా ఫీలింగ్? ఒకసారి కలెక్టర్‌గా చేస్తే రాష్ట్రస్థాయి పోస్టుకు వెళ్లే సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. స్వచ్ఛభారత్ కమిషన్‌గానీ, ఈజీఎంఎంగానీ, అగ్రికల్చర్ కమిషనర్ పోస్టులు రాష్ట్రస్థాయి పోస్టులే. కలెక్టర్‌గా చేసి వెళ్లిన తరువాత అన్ని విభాగాలపై ఒక పట్టు అనేది వస్తుంది. మిగిలిన పోస్టులలో ఇంత గుర్తింపు రాదు. సీఎం జగన్ అప్పగించిన బాధ్యతపై.. రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. చాలా మంచి కలెక్టర్లు ఇక్కడ పనిచేశారు. ఇక్కడా చాలా విభిన్నంగా ఉంటుంది. అలాగే రాజకీయంగా కూడా.. ఇలాంటి జిల్లాకు కలెక్టర్‌గా నియమించడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రాధాన్య అంశాలు వైద్య, ఆరోగ్యం, విద్య అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇస్తాను. వైద్యులు ఆస్పత్రుల్లో వారివారి పనులు సక్రమంగా నిర్వర్తిస్తే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. ఖర్చు కూడా చేయాల్సిన పని ఉండదు. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా తమ వృత్తిని సక్రమంగా నిర్వర్తిస్తే ప్రభుత్వ పాఠశాలలు మూతవేయాల్సిన పని ఉండదు. చాలామంది ఉపాధ్యాయులు సక్రమంగా పాఠశాలలకు వెళ్లడం లేదని తమకు తెలిసిందని, దీనిపై మొదటిసారిగా ప్రత్యేక దృష్టి సారించి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాను. నాకు కావల్సింది నాణ్యమైన విద్య మాత్రమేనని, అంతే తప్ప పర్సంటేజ్‌లో మొదటి స్థానం ఉండడం కాదని జిల్లా విద్యాశాఖాధికారికి చెప్పాను. ఏజెన్సీపై ప్రధాన దృష్టి నేను శుక్రవారం విధుల్లో చేరాను. శనివారం, ఆదివారం ఏజెన్సీలో గడిపాను. అక్కడ ఉన్న సమస్యలపై ప్రత్యక్షంగా అవగాహన ఉంటుంది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిని అక్కడ పోస్టింగ్ వేస్తే అది ఒక శిక్షలా భావిస్తారు. అగ్రికల్చర్లో నేను ఉన్నప్పుడు ఏజెన్సీకి వేస్తారంటే మా వాళ్లు ‘వద్దుసార్ ట్రైబల్ ఏరియా సార్, అక్కడ పీవోలు వదలరు సార్’ ఇలా రకరకాలుగా అంటుండేవారు. సీనియర్ అధికారులుగా మేమే ముందుగా వెళ్తే మిగిలివారిలో ఆత్మస్థైర్యం వస్తుంది. అంతే కాకుండా మనం ఇక్కడ కూర్చుని వెళ్లండి అంటే బాగుండదు. నేను మా అధికారులకు, డీఎంహెచ్‌వోకు చెప్పేదదే. అక్కడికి వెళ్లండి.. ఒక నైట్ అక్కడ ఉండండి అంటుంటాను. డీఎంహెచ్‌వో వెళ్లారనుకోండి, ఆయన నైట్ అక్కడ ఉంటే ఆయనతో పాటు వైద్యులంతా అక్కడ ఉంటారు. ఆయన ఉదయం వెళ్లి రాత్రికి వచ్చేస్తే ఆయనతోపాటు తిరిగి డాక్టర్లూ వచ్చేస్తారు. నాణ్యమైన విద్యావిధానం అవసరం.. నాణ్యమైన విద్య కావాలని అధికారులను కోరుతున్నాను. పిల్లలకు ఏ పరీక్ష పెడుతున్నామో అదే పరీక్షను ఉపాధ్యాయులకు పెడితే ఎంత వరకు విజయవంతం అవుతారో చూడాలని డీఈవోకు వివరించాను. పిల్లలకు పరీక్ష పెట్టిన ఉపాధ్యాయులు, తమ సబ్జెక్టుల్లో ఎలాంటి నిపుణత కలిగి ఉంటారనేది తెలుసుకోవచ్చని అన్నాను. అటువంటప్పుడే మనం కోరుకున్న విద్యను విద్యార్థులకు అందించగలమని అన్నాను. నాకు ఉద్యోగం వచ్చేసింది.. నాకేంటి అనేది ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతిదీ నేర్చుకుంటూ ఉండాలి. టీచర్‌కు ఇది ఇంకా ఎక్కువగా ఉండాలి. ఒక మాడ్యూల్ చేయమని డీఈఓకు చెప్పాను. అసోసియేషన్ వాళ్లతో కూడా సమావేశం పెట్టమని చెప్పాను. దీనిలో వారికి ఏమైనా సాధకబాధకాలు చెప్పుకోవచ్చు. ఆస్పత్రులపై దృష్టి సారిస్తా.. జిల్లాలోనూ, ఏజెన్సీ ప్రాంతాల్లోను ఆస్పత్రుల్లో ఉండే సిబ్బంది వివరాలను సేకరిస్తున్నాను. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యులను నియమించడంతో పాటు మెరుగైన వైద్యం అక్కడివారికి అందజేసేలా చర్యలు తీసుకుంటాను. మాతా శిశు మరణాల తగ్గింపునకు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. చింతూరు, రంపచోడవరం ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఉంది. కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకుందామంటే రాజమహేంద్రవరం నుంచి, కాకినాడ నుంచి రంపకు ఫర్వాలేదు కానీ, చింతూరుకు ఇబ్బందే. కొన్ని అంశాలను గుర్తించాము. స్పెషలిస్ట్ డాక్టర్లను భద్రాచలం నుంచి చింతూరుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. డాక్టర్లు అందరినీ కాకుండా ఒకసారి డీఎంహెచ్‌వోతో కూర్చుని మాట్లాడి ప్రతి నెలా కాకపోయినా ప్రతి ఆరు నెలలకైనా ఏజెన్సీకి వెళ్లాలనే అంశాన్ని పరిశీలిస్తున్నాను. రొటేషన్ పద్థతిలో ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యులు పని చేసేలా చర్యలు చేపడతాను. బాల్యంలో సంతోషపడిన,బాధపడిన ఘటనలు.. కుటుంబపరంగా కానీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యలో ఎక్కువ అంచనాలు ఉన్నవారు బాధపడతారు. నా సామర్థ్యాన్ని బట్టి నేను పనిచేయడమే నేర్చుకున్నాను. ఉత్తమ ర్యాంకులు..! చదువులో కూడా నేను టాప్‌లో రావాలని ఎప్పుడు అనిపించలేదు. కానీ టాప్ ప్లేస్‌లో ఉండేవాడిని. గ్రూప్–1లో కూడా సెకండ్ ర్యాంక్ వచ్చింది. సినిమాలపై.. సినిమాలంటే ఇష్టం. ఎక్కువగా చూస్తాను. తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తాను. చిన్నప్పుడు సహజంగా ఎన్టీఆర్.. తరువాత కమల్‌హాసన్, మాధవన్‌లను.. అభిమానించేవాడిని. ఈ జనరేషన్లో ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఫిట్‌నెస్‌పై.. చిన్నప్పటి నుంచి యాక్టివ్ ఫిజికల్ లైఫ్ నాది. చిన్నపుడు ఎన్సీసీ, ఇంటర్మీడియట్లో డ్రిల్, తరువాత షటిల్, క్రికెట్, యుక్త వయసులో ఆడే అన్ని క్రీడల్లో పాల్గొనేవాడిని. ప్రత్యేకంగా ఒకటని లేదు. ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడతాను. పనివేళల్లో పనిచేస్తే చాలు.. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి ఉద్యోగి తనకు కేటాయించిన విధులను కార్యాలయ పని వేళల్లో సక్రమంగా చేస్తే సరిపోతుంది. తాను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు కలెక్టరేట్లో ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఎక్కడ ఏ విభాగంలో అవినీతి జరుగుతున్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చు. నవరత్నాలే మొదటి ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలే మొదటి ప్రాధాన్యం. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేసేందుకు కృషి చేస్తాను. పేద వర్గాల సంక్షేమమే ప్రధాన ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్న పథకాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటే వాటిని నేరుగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. వీటిలో ఏవిధమైన నిర్లక్ష్యం సహించను. వ్యవసాయంలో కొత్త విధానాలకు శ్రీకారం జిల్లాలో 4 లక్షలకు పైగా హెక్టార్లలో సాగు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మిగిలిన జిల్లాల కన్నా తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ రంగంలో సమస్యలు తక్కువగా ఉంటాయి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు పంటను విక్రయించుకునేలా ప్రత్యేక మార్కెటింగ్ యార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. రైతు ఆదాయాన్ని పెంచేలా పంట ఉత్పత్తులు ఉండాలి. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జీరో బేస్డ్ బడ్జెట్ కింద ప్రకృతి వ్యవసాయం చేయడంపై దృష్టి పెడతా. ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులు పండించిన పంట బయటకు తీసుకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ప్రాంతాల్లో మినీ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా పెట్టాల్సి ఉంది. అదే విధంగా ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతాం. పోలవరం సమస్యలు పరిష్కరిస్తా పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా అర్హులై ఉండి ప్రభుత్వ సాయం అందకపోతే తప్పకుండా పరిశీలిస్తాం. ఏజెన్సీలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద భూములు కోల్పోయిన వారికి మంచి భవనాలను కట్టించి ఇస్తాం. రంగం మారడం వల్ల నిరాశచెందారా? అదేంలేదు. నేను ఆర్డీవో స్థాయి నుంచీ సాంకేతికతను వినియోగిస్తూ వస్తున్నాను. ఏ బాధ్యతలు చేపట్టినా సంతృప్తిగానే చేశాను. అనంతపురంలో శిక్షణ అయిన తర్వాత గద్వాల్ ఆర్డీవోగా మొదటి పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత విజయనగరం ఆర్డీవోగా, అక్కడే హౌసింగ్ పీడీ చేశాను. అనంతరం వైద్య, ఆరోగ్య మంత్రి అరుణ వద్ద పీఏగా వెళ్లాను. మాకు పదోన్నతి వచ్చే సమయంలో హైదరాబాద్‌లో ఆర్కియాలజీ మ్యూజియంలో తక్కువ సమయం పనిచేశాను. అనంతరం భద్రాచలం దేవస్థానం ఈవోగా పనిచేశాను. అక్కడి నుంచి విజయనగరం డీఆర్డీఏ పీడీగా బదిలీ అయ్యాను. తర్వాత వుడా కార్యదర్శిగా, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పనిచేశాను. అక్కడి నుంచి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బదిలీ అయింది. తదుపరి కృష్ణా జిల్లాలో అడిషనల్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశాను. ఐఏఎస్‌గా పదోన్నతి వచ్చాక కాకినాడ పోర్ట్ డైరెక్టర్‌గా వచ్చాను. తర్వాత గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా, ఈజీఎంఎం సీఈవోగా పనిచేశాను. రాష్ట్ర విభజన తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ మొదటి ఎండీగా చేశాను. ఈ పోస్టులో ఉండగా వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రతిచోటా సంతృప్తికరంగానే విధులు నిర్వహించాను. అసంతృప్తి అనేది లేదు. తండ్రే స్ఫూర్తి.. నా తండ్రినే స్పూర్తిగా తీసుకున్నాను. ఏ ఉద్యోగికైనా వృత్తిలో ఒడుదొడుకులు సహజమని, అటువంటప్పుడు ఏ సవాల్ ఎదురైనా బాధపడకూడదనే విషయాన్ని తండ్రి రవికుమార్‌రెడ్డి నుంచి నేర్చుకున్నాను. మా తండ్రి నీటిపారుదల విభాగంలో చిన్న ఉద్యోగం చేసినప్పటికీ ఎన్నో ఒడుదొడుకులు వస్తున్నా, వాటిని పట్టించుకోకుండా వృత్తిలో మమేకమై పని చేస్తుండేవారు. తనకు బాధకలిగినా, సంతోషం కలిగిన ఎక్కువగా స్పందించేవారుకాదు. బ్యాలెన్స్డ్గా ఉండేవారు. నేనూ అలాగే ఉండాలనుకునేవాడిని. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయనలా పని చేయాలనే సంకల్పం మొదటి నుంచీ ఉంది. కలెక్టర్ : డి.మురళీధర్ రెడ్డి తల్లిదండ్రులు : రవికుమార్‌రెడ్డి, శ్యామల స్వస్థలం : బలపనూరు, కర్నూలు జిల్లా భార్య : హేమ పిల్లలు : నిఖిత్, రచన -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేత
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం, అవినీతి కారణంగా పార్టీ వీడుతున్నారు. తాజగా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో గురజాలకు చెందిన టీడీపీ నేత వై మురళీధర్ రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. వైఎస్ జగన్ ద్వారానే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు. -
అవినీతిపై కదలిక...?
ప్రొద్దుటూరు టౌన్ : అవినీతికి పాల్పడిన వారిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి ఉత్తర్వులు వస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 2, 3 వార్డుల్లో ఉన్న లుకు సంబంధించి పన్నులు వేయడంలో అవినీతి జరిగింది. ఈ విషయంపై సాక్షిలో కథనాలు వచ్చాయి. వీటి ఆధారంగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అలాగే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి కూడా డీఎంఏ కన్నబాబుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా అవినీతి జరిగిన విషయంపై ప్రశ్నించారు. విచారణ చేసిన డీఎంఏ విజిలెన్స్ అధికారులు అపార్ట్మెంట్లకు వేసిన పన్నుల్లో మున్సిపాలిటీ ఆదాయానికి అధికారులు రూ.40 లక్షల మేర నష్టం చేకూర్చారని నివేదిక ఇచ్చారు. అయితే ఎవరి హయాంలో జరిగిందన్న విషయాన్ని విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీకి డీఎంఏ ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదిక ఇవ్వడంలో జాప్యం ఏర్పడింది. మూడేళ్ల కిందట నిర్మించిన అపార్ట్మెంట్లకు అప్పటి కమిషనర్ ప్రమోద్‌కుమార్, ఆర్ఐ గిరిధర్‌బాబు, బిల్ కలెక్టర్లు కేవలం ఆరు నెలలకే పన్ను వేసి అధికార పార్టీ నాయకుడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. దీనిపై కూడా అప్పటి ఆర్డీ మురలీకృష్ణగౌడ్ విచారణ చేశారు. గదుల వేలంలో... పట్టణంలోని శివాలయం వీధి, కోనేటికాలువ వీధిలో ఉన్న మున్సిపల్ గదుల వేలం నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహించారని, దీని వల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడిందన్న విషయంపై ఇటీవల డీఎంఏ కమిషనర్‌కు చార్జి మెమో ఇచ్చారు. అయితే కొత్తగా విధుల్లో చేరిన కమిషనర్‌కు రెవెన్యూ అధికారులు గతంలో జరిగిన విషయాలను ఏదీ చెప్పకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనిపై కూడా ఉన్నతాధికారులు కమిషనర్, రెవెన్యూ అధికారులకు చార్జి మెమోలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు, సిబ్బందికి ఈ విషయం తెలిసి ఆందోళన చెందుతున్నారు. మరో రెండు, మూడురోజుల్లో అధికారులపై చర్యల ప్రతులు వస్తాయని ఆశాఖ అధికారులే అంటున్నారు. ఏఏ మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారన్న విషయంపై కూడా ఆర్డీ కార్యాలయ అధికారులు వివరాలు సేకరించారు. ఇందులో ముగ్గురు కమిషనర్లు, నలుగురు ఆర్ఐలు, ఆర్ఓలు, బిల్కలెక్టర్లు, ఇతర సిబ్బంది ఉన్నట్లు సమాచారం. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
బూధాన్ పోచంపల్లి(నల్లగొండ): నల్లగొండ జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జిల్లాలోని బూధాన్ పోచంపల్లి మండలంలోని అంకమ్మగూడ స్టేజీవద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి దగ్గర లభించిన ఆధారాలను బట్టి బాధితుడు అతడు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మురళీధర్రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.