సాక్షి,కాకినాడ: జిల్లా అధికారులందరూ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2019లో భాగస్వాములవ్వాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సర్వే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 27 మధ్యలో జరుగుతుందని పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ.. జిల్లాలో సెప్టెంబర్ మాసం చివరిలో సర్వే బృందాలు పర్యటించే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా సుమారు 30 గ్రామాల్లో ఈ బృందాలు పర్యటిస్తాయిని పేర్కొన్నారు. దీంతోపాటు సర్వే ర్యాకింగ్ ఆధారంగా జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందజేస్తారని స్పష్టం చేశారు. ఈ పురస్కారాలను అక్టోబర్ 2న ప్రధానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాకు మంచి ర్యాంకు సాధించే దిశగా కిందిస్థాయి ఉద్యోగులకు సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఆన్‌లైన్ సమీక్షలు అందించే అంశంలో కళాశాల విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా అన్ని గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉండేలా చూసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లను భాగస్వాముల్ని చేయాలని అధికారులను సూచించారు. ‘స్వచ్ఛ దర్పణ్’ ర్యాంకుల్లో రాష్ట్రంలోనే తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉందని మురళీధర్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment