సాక్షి, మండపేట : రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న చిన్నారి జసిత్ కిడ్నాప్ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బుధవారం మండపేటలోని జసిత్ నివాసానికి వచ్చారు. చిన్నారి తల్లిదండ్రులు వెంకటరమణ, నాగవల్లిని పరామర్శించిన కలెక్టర్, ఘటనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, నిందితుల్ని అదుపులోకి తీసుకుని జసిత్‌ను సురక్షితంగా తీసుకువస్తామని ఓదార్చారు.
చదవండి: జసిత్ కిడ్నాప్; వాట్సప్ కాల్ కలకలం
మరోవైపు తన కుమారుడిని క్షేమంగా అప్పగించాలంటూ కిడ్నాపర్లను జసిత్ తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు. అయితే కిడ్నాపర్ల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి డిమాండ్లు రాలేదు. దీంతో కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక జసిత్ ఆచూకీ కోసం వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment