East Godavari SP
-
జసిత్ నివాసానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ
సాక్షి, మండపేట : రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న చిన్నారి జసిత్ కిడ్నాప్ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బుధవారం మండపేటలోని జసిత్ నివాసానికి వచ్చారు. చిన్నారి తల్లిదండ్రులు వెంకటరమణ, నాగవల్లిని పరామర్శించిన కలెక్టర్, ఘటనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, నిందితుల్ని అదుపులోకి తీసుకుని జసిత్‌ను సురక్షితంగా తీసుకువస్తామని ఓదార్చారు. చదవండి: జసిత్ కిడ్నాప్; వాట్సప్ కాల్ కలకలం మరోవైపు తన కుమారుడిని క్షేమంగా అప్పగించాలంటూ కిడ్నాపర్లను జసిత్ తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు. అయితే కిడ్నాపర్ల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి డిమాండ్లు రాలేదు. దీంతో కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక జసిత్ ఆచూకీ కోసం వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. -
మావోయిస్టు శబరి దళ సభ్యుడి లొంగుబాటు
కాకినాడ : మావోయిస్టు శబరి దళం ఏరియా కమిటీ సభ్యుడు మడివి దేవయ్య (24) అలియాస్ వినోద్ అలియూస్ దేవా లొంగిపోయినట్టు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఎటపాక మండలం విస్సాపురం గ్రామానికి చెందిన దేవయ్య గొత్తికోయ సామాజికవర్గానికి చెందిన గిరిజనుడు. మావోయిస్టుల కార్యకలాపాలకు ఆకర్షితుడై 2008లో శబరి దళంలో చేరాడు. 2009లో మంగీదళం(ఆదిలాబాద్) సభ్యుడిగా పనిచేశాడు. 2010లో చర్ల దళానికి బదిలీ అయి కొద్దికాలం అనంతరం తిరిగి 2012లో శబరి దళంలోకి వచ్చి ఏరియా కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు. చింతూరు, ఎటపాక పోలీస్స్టేషన్లలో అతడిపై ఏడు కేసులు నమోదయ్యూయి. ఐదు హత్యల ఘటనల్లో పాత్ర ఉండడమే కాక మొబైల్ టవర్ కాల్చివేయడం, చెట్లు నరికి రోడ్డుపై పడవేయడం, సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి వంటి ఘటనల్లో పాల్గొన్నాడు. లొంగిపోయిన దేవయ్యకు ప్రభుత్వపరంగా ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.