సమస్యలను గాలికొదిలేశారు
అయినవిల్లి: స్థానిక సమస్యలను గాలికొదిలేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. సిరిపల్లిలో ఈ నెల 28న నిర్వహించనున్న పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశ స్థలాన్ని కన్నబాబు, పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, కో ఆర్డినేటర్ కొండేటి
ప్రభుత్వం తీరుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు
అయినవిల్లి: స్థానిక సమస్యలను గాలికొదిలేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. సిరిపల్లిలో ఈ నెల 28న నిర్వహించనున్న పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశ స్థలాన్ని కన్నబాబు, పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, ముమ్మిడివరం కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహనరావు, గుత్తుల సాయి, కర్రి పాపారాయుడులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అధికార పార్టీ మొదటి నుంచి మాయమాటలతో ప్రజలను మోసగిçస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి నెలా ఒక్కో నియోజక వర్గంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగా అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆశీస్సులతో సిరిపల్లిలో 28న మొట్ట మెదటి సారిగా పార్టీ జిల్లా స్థాయి సమావేశానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ సమావేశానికి పార్టీ నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారన్నారు. ఆయన వెంట నాయకులు మట్టపర్తి శ్రీనివాస్, పి.హరనాథ్‌బాబు, అడ్డగళ్ళ సాయిరాం, గుత్తుల నాగబాబు, నంబూరి శ్రీ రామచంద్రరాజు, ముత్తాబత్తుల మణిరత్నం, దొమ్మెటి వెంకట శివరామన్, గన్నవరపు శ్రీనివాసరావు తదితరులున్నారు.