దోపిడీ విధానాలపై ఆందోళన తప్పదు
టీడీపీ నేతలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దోపిడీ పాలన సాగిస్తున్నారని, ఇటువంటి విధానాలను విడనాడకపోతే ఆందోళన చేపడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు హెచ్చరించారు. పి.గన్నవరంలో ఇందిరమ్మ ఇళ ్లస్ధలాలు, అంబాజీపేట మంచినీటి ప్రాజక్టులో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. మండలంలోని ముం గండ
-
ఇళ్ల స్థలాలు, మంచినీటి ప్రాజెక్టుల్లో
-
టీడీపీ అక్రమాలపై విచారణ జరపాలి
-
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
పి.గన్నవరం :
టీడీపీ నేతలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దోపిడీ పాలన సాగిస్తున్నారని, ఇటువంటి విధానాలను విడనాడకపోతే ఆందోళన చేపడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు హెచ్చరించారు. పి.గన్నవరంలో ఇందిరమ్మ ఇళ ్లస్ధలాలు, అంబాజీపేట మంచినీటి ప్రాజక్టులో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. మండలంలోని ముం గండ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అర్హత ఉన్న పేదలకు ఇళ్ల స్ధలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. అప్పట్లో పి.గన్నవరంలో కొనుగోలు చేసిన ఇళ ్లస్థలాలను ఇంకా పేదలకు పంపిణీ చేయలేదన్నారు. ఇప్పుడు ఆ స్థలాల పంపిణీ పేరుతో పేదలనుంచి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని, దీనిపై విచారణ జరిపి, అర్హులకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు.
మంచినీటి ప్రాజెక్టుల్లో కోట్ల అక్రమాలు...
అంబాజీపేట మండలం మాచవరంలో రూ.7.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న మంచినీటి ప్రాజక్టులో రూ.కోటి మేర అక్రమాలు జరగడం దారుణమన్నారు. రాఫిడ్ శాండ్ ఫిల్టర్ వేయకుండా ప్రాజక్టు డిజైన్ మార్చి మైక్రో వాటర్ ఫిల్టర్‌ను ఏర్పాటు చేసి, నిధులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని పైపులైన్లను వేసి అవినీతికి పాల్బడుతున్నారన్నారని, దీనిపై తమ పార్టీ నేతలు మండల సమావేశంలో నిలదీసి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. విజిలెన్స్, ఆర్‌డబ్లు్యఎస్ అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని, అక్రమాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కన్నబాబు డిమాండ్ చేశారు.