చిరుద్యోగుల నుంచి కాయకష్టంచేసుకునే కూలీవరకు వెనకేసుకున్న సొమ్ములతో ఇళ్ల స్థలాలు కొనుక్కుంటే 216 జాతీయరహదారి పేరిట పేదలభూములు లాక్కోవడం అన్యాయమని, బాధితులకు న్యాయం జరిగేలా వారితరపున వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లాఅధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. గత శనివారం కరప మండలం నడకుదురు పంచాయతీ కార్యాయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో 216 భూసేకరణ అదనపు సంయుక్త కలెక్టర్ రా
-
బాధితులకిచ్చే నష్టపరిహారం పెంచాలి
-
వైఎస్సార్‌సీపీ జిల్లాఅధ్యక్షుడు కన్నబాబు?
కరప :
చిరుద్యోగుల నుంచి కాయకష్టంచేసుకునే కూలీవరకు వెనకేసుకున్న సొమ్ములతో ఇళ్ల స్థలాలు కొనుక్కుంటే 216 జాతీయరహదారి పేరిట పేదలభూములు లాక్కోవడం అన్యాయమని, బాధితులకు న్యాయం జరిగేలా వారితరపున వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లాఅధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. గత శనివారం కరప మండలం నడకుదురు పంచాయతీ కార్యాయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో 216 భూసేకరణ అదనపు సంయుక్త కలెక్టర్ రాధాకృష్ణకు బాధితులకు జరిగే నష్టాన్ని వివరించానని సోమవారం ఆయన ఫో¯ŒSలో విలేకర్లకు వివరించారు. కాకినాడ నగరం స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందపోతోంది, దాని దృష్ట్యాలో ఎప్పుడో రూపొందించిన 216 జాతీయరహదారి అలై¯ŒSమెంట్‌ను మార్చాల్సిన ఆవశ్యకత ఉందని, బాధితులకిచ్చే నష్టపరిహారం మార్కెట్‌విలువకు చాలా వ్యత్యాసం ఉన్నందున, ప్రభుత్వమిచ్చే పరహారం కూడా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కత్తిపూడి నుంచి తిమ్మాపురం, సర్పవరం, మాధవపట్నం, గంగనాపల్లి, మేడలైన్, తూరంగి గ్రామాలమీదుగా యానాంరోడ్డును అనుసంధానం చేసే 216 జాతీయరహదారి అలై¯ŒSమెంట్ తప్పులతడకగా ఉందన్నారు. రూ.2 వేల కోట్లతో కాకినాడ మహానగరంగా విస్తరించపోతోందని, అలాంటప్పుడు ఇళ్ల మధ్య నుంచి 216 జాతీయరహదారి నిర్మించడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. సిటీకీ దూరంగా ఉండేలా ఎవరికీ నష్టకలగకుండా జాతీయరహదారిని నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే కలెక్టర్ అరుణ్ కుమార్‌ను కలిసి బాధితులకు న్యాయం చేయాలని కోరతామన్నారు. బాధితులకు నష్టపరిహారంగా ఎకరానికి రూ 18 లక్షలు ఇస్తున్నామంటున్నారని, తూరంగిలో ప్రస్తుతం మార్కెట్‌విలువ రూ.2 కోట్లు ఉన్నందున చాలా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 216 బాధితులకు వైఎస్సార్‌సీసీ అండగా ఉండి, న్యాయం జరిగేలా పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. కన్నబాబు వెంట ఎంపీటీసీ జవ్వాది సతీష్, ఉప్పలంక మాజీ సర్పంచ్ బొమ్మిడి శ్రీనివాస్, గురజనాపల్లి మాజీసర్పంచ్ పెంటపాటి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.