ఘనంగా కన్నబాబు జన్మదిన వేడుకలు
Published Fri, Dec 16 2016 9:55 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
కాకినాడ రూరల్ :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు 46 జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కోలాహలంగా జరిగాయి. శుక్రవారం రమణయ్యపేటలోని ఆయన నివాసం అభిమానులతో నిండిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే కన్నబాబు ఇంటి వద్ద కార్యకర్తలు సందడి మొదలైంది. కన్నబాబు ఇంటికి వెళ్లే ప్రధాన రహదారి వెంబడి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రూపుల వారీ, గ్రామాల వారీగా కన్నబాబుకు శుభాకాంక్షలు చెప్పేందుకు అభిమానులు పోటీపడ్డారు. పార్టీ అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం పార్టీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణలతో పాటు వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తల కోలాహాలం మధ్య కేక్‌ను కట్ చేసి విశ్వరూప్, బాలకృష్ణ కన్నబాబుకు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు కుడిపూడి చిట్టబ్బాయి, కాకినాడ, మండపేట, కాకినాడ పార్టీ కోఆర్డినేటర్లు వేగుళ్ల లీలాకృష్ణ, ముత్తా శశిధర్, పి.గన్నవరం కోఆర్డినేటర్ కె చిట్టిబాబు, కాకినాడ సిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ (ఫ్రూటీకుమార్), అమలాపురం నాయకులు రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యార్థి విభాగం అ«««దl్మక్షుడు జక్కంపూడి కిరణ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర పాల్గొని కన్నబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వామినగర్ టీచర్స్ కాలనీకి చెందిన వంద మంది విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కన్నబాబును అభిందించారు.
అనాధ చిన్నారుల సమక్షంలో
కాకినాడ : అనాథపిల్లల సమక్షంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పుట్టిన రోజు వేడుకను ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ భానుగుడి సెంటర్ సమీపంలోని అనాధబాలల ఆనందనిలయంలో అక్కడి చిన్నారుల సమక్షంలో కన్నబాబు కేక్ కట్ చేశారు. అక్కడి పిల్లలకు దుస్తులు, దుప్పట్లు, పుస్తకాలు, ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ చిన్నారుల సమక్షంలో పుట్టిన రోజు చేసుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ కోమలి సత్యనారాయణ (బాబ్జి), బొమ్మిడి శ్రీనివాస్, బి.జగ¯ŒS పాల్గొన్నారు. అలాగే వెంకట్‌నగర్‌లోని వీధి బాలల పునరావాస కేంద్రం పరివర్తనలో కూడా కన్నబాబుకేక్ కట్ చేశారు.
Advertisement
Advertisement