
సాక్షి, రంపచోడవరం: గోదావరి బోటు ప్రమాద బాధితులను మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు. రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అందుబాటులో వైద్య సేవలు లేకుంటే తక్షణమే మెరుగైన వైద్యం కోసం విశాఖ, రాజమండ్రికి తరలించారని ఆదేశాలు ఇచ్చారు. బాధితు కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు తమ వారు గోదావరిలో ప్రమాదానికి గురైయ్యారన్న విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరువుతున్నారు. మరోవైపు గల్లంతైన వారి కోసం ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
పశ్చిమ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
బోటు ప్రమాద ఘటనపై సమాచారం కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తమ వారి వివరాలు కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-233-1077కు ఫోన్ కాల్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
చదవండి:
సురక్షితంగా బయటపడ్డ పర్యాటకుల వివరాలు
మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి
బోటులో ఎక్కువమంది తెలంగాణవారే!
పాపికొండలు విహార యాత్రలో విషాదం!
Comments
Please login to add a commentAdd a comment