- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
రెండున్నరేళ్లలో ప్రజలు విసిగి పోయారు
Published Tue, Nov 15 2016 9:44 PM | Last Updated on Fri, Aug 10 2018 5:54 PM
లూటుకుర్రు (మామిడికుదురు) :
రెండున్నరేళ్ల టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లూటుకుర్రు సర్పంచ్ కశిరెడ్డి ఆంజనేయులు స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ చేస్తున్న గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పోటీగా టీడీపీ నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలు వెల వెల బోతున్నాయన్నారు. బీమా సదుపాయం, ప్రభుత్వ పథకాలు అందజేస్తామంటూ పింఛనుదారుల నుంచి సభ్యత్వాల రుసుం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కోనసీమ రైతులు 60 వేల ఎకరాల్లో పంట విరామం ప్రకటిస్తే వారి సమస్యలు పట్టించుకోలేదన్నారు. నాఫెడ్ కొనుగోలు కేంద్రాలను మార్చి నెలాఖరు వరకు కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ పాలన రాజ్యమేలుతోందన్నారు. ప్రజా ఉద్యమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన దోరణిని మార్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కన్నబాబు డిమాండ్ చేశారు. అమలాపురం పార్లమెంటు పరిశీలకుడు వలవల బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి మిండగుదుటి మోహన్, కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement