పోలీస్‌ రాజ్యం–ప్రజాస్వామ్యం అపహాస్యం | tdp government very bad | Sakshi
Sakshi News home page

పోలీస్‌ రాజ్యం–ప్రజాస్వామ్యం అపహాస్యం

Published Thu, Dec 29 2016 11:21 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

tdp government very bad

  • సీపీఎం నేతలను అడ్డుకోవడం దారుణం
  • వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
  • కాకినాడ: 
    ప్రజాస్వామ్యం విలువలకు తిలోదకాలు ఇస్తూ అధికార తెలుగుదేశం పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా పని చేస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. జిల్లాలో ప్రస్తుతం పోలీసు రాజ్యం నడుస్తోందని, ఇక్కడి వాతావరణం చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేనే సందేహం కలుగుతుందన్నారు. గురువారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కాకినాడ ఎస్‌ఈజడ్‌కు సంబంధించి శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్న నేపధ్యంలో ఒక్కరోజు ముందుగా గురువారం మధ్యాహ్నం నుంచే సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులు మోహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. నాయకులు బయటకు వస్తే అరెస్టులు చేస్తామని పోలీసులు బెదిరించడం, ప్రజాభిప్రాయ సేకరణ నేపధ్యంలో రైతు ప్రతినిధులను కూడా అదుçపులోకి తీసుకున్నట్టుగా వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తాము అధికారంలోకి వస్తే భూములు తిరిగి పంచేస్తామని, ఏరువాక కూడా సాగిన విషయాన్ని కన్నబాబు గుర్తు చేస్తూ ఆ విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారేమ్మ తప్ప రైతులు మర్చిపోలేదన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలే తప్ప, ప్రజలు, ప్రజా సంఘాలను బెదిరించి కాదని హితవు పలికారు. దివీస్‌ వ్యవహారంలో కూడా ఇలాగే వ్యవహరించారని ఆయన అన్నారు. అప్రజాస్వామిక పద్ధతిలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించడం మానుకోవాలని కన్నబాబు హితవు పలికారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement