
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తెలుగు తమ్ముళ్ల ధన దాహానికి అభంశుభం తెలియని చిన్నారులు బలయ్యారు. తెలుగు తమ్ముళ్ల అక్రమ ఇసుక రవాణా నలుగురు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లాలోని గాలివీడు మండలంలోని తలముడిపిలో జరిగింది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు తలముడిపి చెరువులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. విచ్చలవిడిగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు.
శుక్రవారం ఇసుక తవ్వకాలు జరపటానికి వచ్చిన కూలీలతో పాటు కొందరు చిన్నారులు వారి వెంట చెరువు వద్దకు చేరుకున్నారు. వారు ఇసుకలో ఆడుకుంటుండగా మట్టిపెళ్లలు పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. అంత వరకు ఆడిపాడిన చిన్నారులు విగతజీవులుగా మారటంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment