ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి
Published Wed, Feb 1 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
రాజవొమ్మంగి/రంపచోడవరం :
టీడీపీ ప్రభుత్వం, నాయకులు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని, వారి కక్ష సాధింపు పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు వస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసార కన్నబాబు అన్నారు. రాజవొమ్మంగిలో మంగళవారం మాతాశిశు మరణాలు చెందిన కుటుంబాలకు మంగళవారం ఆయన పార్టీ తరఫున ఆర్థిక చేయూతను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన పార్టీ అధినేత జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిని ఎయిర్‌పోర్టు ర¯ŒSవేపై అడ్డుకోవడం ప్రభుత్వ పనితీరుకు పరాకాష్టన్నారు. 2019 ఎన్నికలలో ప్రజలు టీడీపీ వారిపై తిరగబడతారన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ నాయకులపై రౌడీషీట్ ఓపె¯ŒS చేస్తున్నారని విమర్శించారు. ఏజెన్సీలోని దుస్థితిని వివరిస్తూ ప్రతిపక్ష నేత జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి గతేడాది రంపచోడవరం వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఏజెన్సీలో మాతాశిశు మరణాలకు చంద్రబాబు తలదించుకుని నిలబడాలన్నారు. టీడీపీ నాయకులు ఆస్తులు పోగు చేసుకునే విధంగా పాలన సాగుతుందన్నారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ మూడేళ్లు పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ మాతాశిశు మరణాలపై ఐటీడీఏ పీవో, కలెక్టర్ వచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ మరణాలకు కారణాలు కూఆ తెలుసుకోలేదన్నారు. కాళ్లవాపు వ్యాధి బాధిత కుటుంబాలను పార్టీపరంగా ఆదుకుంటామని ప్రకటించారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, పార్టీ మండల కన్వీనర్లు సింగిరెడ్డి రామకృష్ణ, జల్లేపల్లి రామన్నదొర, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement