very bad
-
ప్రజలకు చేస్తున్నది ప్రభుత్వ సొమ్ముతోనే
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు మతి లేనివి -ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం (కొత్తపేట): ప్రజాధనాన్ని ప్రభుత్వం ద్వారా ప్రజలకు వినియోగిస్తూ అది తన సొంత నిధులతో చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం చూస్తే ఆయనకు వయసు పైబడటమో మతి భ్రమించిందో అర్థం కావడం లేదని రాష్ట్రంలోని వైద్యులు ఆయనకు ఉచితంగా చికిత్సను అందజేయాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం రాత్రి రావులపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే అదేదో తన హెరిటేజ్ సంస్థ ఆదాయం ద్వారానో లేక తన సొంత రెండెకరాల భూమి ఆదాయం ద్వారానో చేస్తున్నట్టుగా చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తన ఓట్లు వేయకపోతే పింఛన్‌ను ఇవ్వను రేషన్ ఇవ్వను అంటూ ప్రజలను కించపర్చేలా మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన స్థాయి దిగజారుతున్నారన్నారు. తనకు ఓటు వేయని గ్రామాలకు దండం పెడతానే తప్ప ఎలాంటి పనులు చేయనని, తాను వేసిన రోడ్లపై నడుస్తున్నారని ఆయన చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. ఆయన పుట్టకముందు నుంచే రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ ఉందని ప్రభుత్వమే రోడ్లు వేస్తుందని ఆయనకు మతి భ్రమించి ఇలా మాట్లాడుతున్నారన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీకి ఓట్లు వేయకపోతే ఏమీ చేయనని బహిరంగంగా చంద్రబాబు బెదిరింపులు ప్రలోభాలకు పాల్పడుతున్నారన్నారు. ఆయనపై ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వర్థంతికి, జయంతికి తేడా తెలియని, జాతీయ జెండాకు వందనం చెప్పడం రాని లోకేష్ విశాఖ భూముల కుంభకోణంపై సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన అసమర్థతను గుర్తించే చంద్రబాబు ప్రజల నుంచి నెగ్గలేడని భావించి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారన్నారు. దమ్ముంటే నంద్యాల ఉప ఎన్నికలో లోకేష్ పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ఎంపీపీ కోట చెల్లయ్య, జడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యవర్మ, ఎంపీటీసీ కొండేపూడి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, కముజు సత్యనారాయణ, అప్పన రామకృష్ణ, జక్కంపూడి లక్ష్మినారాయణ, సఖినేటి కృష్ణంరాజు, తదితరులు ఉన్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు సిగ్గుచేటు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు తెలంగాణలో టీఆర్ఎస్లోకి ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు కారాలు మిరియాలు నూరిన సీఎం చంద్రబాబు ఏకంగా గవర్నర్ ప్రజాస్వామ్య విలువలకు కాలరాచారని విమర్శించారు. రాష్ట్రంలో పదవులను ఆశ చూపి టీడీపీలోకి చేర్చుకున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు మంత్రి పదవులు ఇవ్వడంపై చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై వైఎస్సార్సీపీ నాయకులు తూర్పార పట్టారు. ఇతరులు తప్పు చేశారంటూ విమర్శించిన చంద్రబాబు ఇదే తప్పు చేశారని మండిపడ్డారు. టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యానందం కూడా చంద్రబాబు వైఖరిని నిరసించారు. తాటిపాక (రాజోలు) : తమ పార్టీ జెండాపై నెగ్గి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఆదివారం తాటిపాక వచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ తీరుతో చంద్రబాబు నైజం బయట పడిందని విమర్శించారు. తెలంగాణలో శ్రీని వాస్‌యాదవ్ టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించి మంత్రి పదవి పొం దినప్పుడు చంద్రబాబు విమర్శలు, గవర్నర్‌పై చేసిన ఆరోపణలు ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆయన రెండు నాలుకలు, రెండు కళ్లు సిద్ధాంతాన్ని ప్రజలు మరోసారి చూశారన్నారు. శాసనసభలో సమస్యలపై ప్రతి పక్ష నేత, జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిని మాట్లాడనీయకుండా మైక్‌లు కట్ చేస్తున్నారన్నారు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడిపూడి చిట్టబ్బాయి, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రాజోలు, మండపేట కో ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, వేగుళ్ల పట్టాభిరామయ్య, అమలా పురం ఎంపీ నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జీ పాల్గొన్నారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో 175 రోజులను అంబాజీపేట మండలం మాచవరంలో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేకు కట్ చేసి పంచారు. రాజీనామా చేయించి గెలవాలి రాజానగరం : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకుని సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా విమర్శించారు. మండలంలోని శ్రీ కృష్ణపట్నంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికల్లో గెలవాలన్నారు. వారిలో ఏ ఒక్కరు గెలిచి నా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని సవాల్ చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను తప్పుపట్టిన ఆయన వైఖరి చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతుందన్నారు, రాజీనామా చేయిం చకుండా, అనర్హత వేటు వేయకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనన్నారు. ఇటువంటి దుశ్చర్యలను అడ్డుకోవలసిన స్పీకర్, గవర్నర్లు కూడా వారికి దాసోహం కావడం సిగ్గుచేటన్నారు. హేయమైన పరిపాలనను ప్రజలు గమనిస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. విలువలకు పాతరేసిన చంద్రబాబు కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి విమర్శ కొత్తపేట/రాజోలు : పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను పాతరేశారని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. కొత్తపేటలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు స్వగృహంలో, తాటిపాకలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ మంత్రివర్గంలోకి టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను తీసుకున్నప్పుడు కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఇప్పుడు ఆయన చేసిందేమిటని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలిపించుకుని మంత్రి పదవులు ఇవ్వాలని సవాల్ చేశారు. చంద్రబాబు చర్యలను ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఖండించాలని కోరారు. పార్టీ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బండారు రాజా, రాష్ట్ర పార్టీ ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, జిల్లా కార్యదర్శులు రెడ్డి చంటి,నెల్లి లక్ష్మీపతిరావు, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కముజు సత్యనారాయణమూర్తి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, ఎంపీటీసీ కొండేటి రామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విప్పర్తి వేణుగోపాల్, రాష్ట్ర రైతు విభాగ అధికార ప్రతినిధి జక్కంపూడి తాతాజీ, బి.సూరిబాబు, చింతలపాటి వెంకట్రామరాజు పాల్గొన్నారు. -
పరపతి కోసం పాకులాడుతున్నారు
ఈవెంట్లకే నిధులు.. ప్రజా సంక్షేమానికి చిల్లు... దోచుకోవడం...దాచుకోవడం.. ఇదే పని సీఎం తీరుపై వైఎస్సార్ సీపీ నాయకులు కన్నబాబు, విశ్వరూప్ ధ్వజం ఉప్పలగుప్తం (అమలాపురం) : ఎప్పుడైనా ఎక్కడైనా పరపతికోసం పాకులాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబేనని చెప్పక తప్పదు. అమెరికా నుంచి ఆఫ్రికా ఖండంలో ఏ దేశమేగినా తన గురించి తన పాలన గురించి చెప్పునే ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో శనివారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్‌లో పాల్గొన్న కన్నబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చేసింది లేకపోయినా గొప్పను చాటుకునేందుకు ఈవెంట్లు ఏర్పా టు చేసి కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు ప్రజా సంక్షేమానికి పైసలు లేవంటున్నారు. రాష్ట్రంలో ఏఒక్క వర్గానికీ మేలు చేసిన దాఖలాలు లేనేలేవు. రుణమాఫీ అంటూ రైతులను మభ్యపెట్టి వారి సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, రైతుకు అండగా నిలిచే సహకార వ్యవస్థలను రుణమాఫీ పుణ్యమా అని పూర్తిగా అధోగతి పాలు చేశారన్నారు. రైతుకుమేలంటూ జరిగిం దంటే ఒక్క దివంగత వైఎస్సార్ హయాంలోనేనన్నారు. జిల్లాలో లక్ష హెక్టార్లలో మినుము సాగు చెయ్యాలని ఆంక్షలు పెట్టిన ముఖ్యమంత్రి జిల్లాలో సాగునీరు ఎంతవరకూ అందుతుంది. అపరాల విత్తనాలు ఏమేరకు అందుతున్నాయో చూశారా అని ప్రశ్నించారు. మొలక శాతం లేని విత్తనాలు అందిస్తూ ఎకరాకు 8 కేజీల విత్తనం సరిపోగా మొలక మొత్తం వస్తుంది ఎకరాకు 16 కేజీలు వేయాలని చెప్పే ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోని చంద్రబాబు ప్రశ్నించిన ప్రతిపక్షనేత జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిపై అనుభవం లేనివాడంటూనే, ప్రశ్నించిన ప్రతీ వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతి రేకతే తగినవిధంగా బుద్ధి చెపుతుందన్నారు. పార్టీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు అనుచరగణమంతా దోచుకోవడం..దాచుకోవడం అన్న ట్టు ఎక్కడిక్కడ భూ కబ్జాలు, ప్రాజెక్టుల పేరుతో పెర్సంటేజీలు తీసుకోవడం తప్ప ప్రజా పాలనలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలను నమ్మించే రోజులు పోయాయి.. చంద్రబాబును సాగనంపడమే తరువాయి అన్నారు. సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, నాయకులు దంగేటి రాంబాబు, మిండగుదిటి మోహన్, కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి
రాజవొమ్మంగి/రంపచోడవరం : టీడీపీ ప్రభుత్వం, నాయకులు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని, వారి కక్ష సాధింపు పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు వస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసార కన్నబాబు అన్నారు. రాజవొమ్మంగిలో మంగళవారం మాతాశిశు మరణాలు చెందిన కుటుంబాలకు మంగళవారం ఆయన పార్టీ తరఫున ఆర్థిక చేయూతను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన పార్టీ అధినేత జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిని ఎయిర్‌పోర్టు ర¯ŒSవేపై అడ్డుకోవడం ప్రభుత్వ పనితీరుకు పరాకాష్టన్నారు. 2019 ఎన్నికలలో ప్రజలు టీడీపీ వారిపై తిరగబడతారన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ నాయకులపై రౌడీషీట్ ఓపె¯ŒS చేస్తున్నారని విమర్శించారు. ఏజెన్సీలోని దుస్థితిని వివరిస్తూ ప్రతిపక్ష నేత జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి గతేడాది రంపచోడవరం వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏజెన్సీలో మాతాశిశు మరణాలకు చంద్రబాబు తలదించుకుని నిలబడాలన్నారు. టీడీపీ నాయకులు ఆస్తులు పోగు చేసుకునే విధంగా పాలన సాగుతుందన్నారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ మూడేళ్లు పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ మాతాశిశు మరణాలపై ఐటీడీఏ పీవో, కలెక్టర్ వచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ మరణాలకు కారణాలు కూఆ తెలుసుకోలేదన్నారు. కాళ్లవాపు వ్యాధి బాధిత కుటుంబాలను పార్టీపరంగా ఆదుకుంటామని ప్రకటించారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, పార్టీ మండల కన్వీనర్లు సింగిరెడ్డి రామకృష్ణ, జల్లేపల్లి రామన్నదొర, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
‘బాబు’పాలనలో దగాపడ్డ నిరుద్యోగులు
ఉద్యోగమూ లేదు–నిరుద్యోగ భృతీ లేదు ఉద్యోగపోరులో మండిపడ్డ కన్నబాబు, అనంతబాబు కలెక్టరేట్ వద్ద హోరెత్తిన నినాదాలు కాకినాడ : బాబు వస్తే జాబు వస్తుందన్న ప్రచారాన్ని నమ్మి అధికారాన్ని కట్టబెడితే ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారాన్ని చేపట్టాక ఉద్యోగాలు రాక, నిరుద్యోగ భృతి ఇవ్వక ఎంతో మంది విద్యావంతులైన యువత తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంతబాబు అధ్యక్షతన కలెక్టరేట్ వద్ద సోమవారం జరిగిన ‘ఉద్యోగపోరు’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కన్నబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మహిళలు, రైతులు, నిరుద్యోగులు సహా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ కేసులకు తూటాలకయూత్ నాయకులు, కార్యకర్తలు భయపడి వెన్ను చూపరని, జగ¯ŒS సైనికులుగా రొమ్ము విరిచి పోరాడతామన్నారు. మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యులు పినపే విశ్వరూప్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ మోసపూరిత విధానాలపై యువత సంఘటితమైన పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలను నిలువునా ముంచేసి తాను మాత్రం ఉద్యోగం చేసుకుంటున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు మాట్లాడుతూ టీడీపీ సర్కార్‌కు గుణపాఠం చెప్పేలా నిరుద్యోగులంతా ఉద్యమించాలన్నారు. రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు షేక్ సలామ్‌బాబు మాట్లాడుతూ బాబు విధానాలు మారకపోతే తెలుగుదేశానికి భవిష్యత్తులో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసే సత్తా యువతకు ఉందన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారాన్ని చేపట్టాక పేదల ఆశలు అడియాశలయ్యాయన్నారు. కాకినాడ, మండపేట, ముమ్మిడివరం కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్, వేగుళ్ళ లాలాకృష్ణ, పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా కాసుల కోసం అమ్ముకుంటున్నారని టీడీపీ ప్రజాప్రతినిధులపై ధ్వజమెత్తారు. ప్రత్తిపాడు, రాజమండ్రిరూరల్, జగ్గంపేట, పి.గన్నవరం కో–ఆర్డినేటర్లు పర్వత ప్రసాద్, గిరిజాల బాబు, ముత్యాల సతీష్, కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ యువత కన్నెర్రజేస్తే చంద్రబాబు సర్కార్ శంకరగిరి మాన్యాలు పట్టడం తధ్యమంటూ ఉద్యోగ పోరులో భాగంగా పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ప్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ ‘బాబు’కు అధికారం ఇవ్వడం ద్వారా కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారిందన్నారు. వైఎస్సార్సీపీ కాకినాడ సిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక భర్తీచేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహ¯ŒS మాట్లాడుతూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు ఉద్యోగపోరు అద్దంపడుతోందని, ఇక ప్రభుత్వం ఆటలు సాగవని హెచ్చరించారు. విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల యూత్ అధ్యక్షులు లాలం రాంబాబు, నరసింహరాజు మాట్లాడుతూ యువశకిని నిర్వీర్యం చేస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. యువజన విభాగం రాష్ట్ర నాయకులు మత్సా లోకేష్, హరీష్, గనిశెట్టి రమణ్‌లాల్ మాట్లాడుతూ జాబు రావాలంటే బాబు గద్దెదిగితేనే సాధ్యమన్న పరిస్థితి నెలకొందన్నారు. కాకినాడ, అమలాపురం, పిఠాపురం యువజన విభాగాల అధ్యక్షులు ఎ¯ŒSజీకే కిశోర్, నల్లా శివాజీ, శ్రీనివాస్ మాట్లాడుతూ కల్లబొల్లి కబుర్లతో యువతను నిర్వీర్యం చేస్తున్న టీడీపీ సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. మండపేట కో–ఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, జడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శులు లింగం రవి, సంగిశెట్టి అశోక్, బొబ్బిలి గోవిందు, రాష్ట్ర ప్రచారసెల్ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్రసేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా మైనార్టీ, డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు అబ్దుల్‌బషీరుద్దీన్, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధులు ఆదిత్యకుమార్, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర యూత్ కార్యదర్శులు ఎ¯ŒSడిఆర్, కత్తిపూడి శ్రీను, గుర్రం గౌతమ్, పోలు కిరణ్మోహ¯ŒSరెడ్డి, జక్కంపూడి వాసు, సత్యనారాయణ చౌదరి, పెయ్యల చిట్టిబాబు, పాలెపు ధర్మారావు, అల్లి రాజబాబు, కార్తీక్, వాసిరెడ్డి జమీల్, కార్పొరేటర్లు,యూత్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో నాయకులు, కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. ‘ఉద్యోగ పోరు’కు అనూహ్యస్పందన స్ఫూర్తినిచ్చిన నేతల ప్రసంగం చంద్రబాబు సర్కార్ నిరుద్యోగులను నిలువునా దగాచేసిన వైనాన్ని ‘ఉద్యోగ పోరు’ ఎలుగెత్తి చాటింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో తలపెట్టిన పోరు విజయవంతమైంది. నమ్మి మోసంచేసిన చంద్రబాబు సర్కార్‌పై పోరాటం చేసే వారిని కేసులతో వేధింపులకు గురిచేస్తున్నా రొమ్ము విరిచి ఎదురొడ్డి పోరాడతామన్న పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి, ఉద్యోగులకు భరోసా ఇస్తూనే కేసులకు వెరవద్దన్న అనంతబాబుల ఉద్వేగపూరిత ప్రసంగాలు యువతకు మనో ధైర్యాన్నిచ్చాయి. మోసపోయిన నిరుద్యోగులు, యువతకు అండగా నిలిచేందుకు జిల్లా నుంచి శ్రీకారం చుట్టిన తొలి కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. పార్టీలకు అతీతంగా అటు కోనసీమ, ఇటు మెట్ట ప్రాంతమే కాకుండా రంపచోడవరం ఏజెన్సీ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన యువ స్పందనతో కాకినాడ కలెక్టరేట్ కిటకిటలాడింది. కొత్త ఉద్యోగాలు మాటేమో కాని ఉన్న ఉద్యోగాలకే కోత పెడుతున్నారంటూ కొందరు నిరుద్యోగులు తమ ఆవేదనను ఉద్యోగపోరులో నేతలతో పంచుకున్నారు. కనీసం ఔట్సోర్సింగ్ ఉద్యోగాలైనా తెచ్చుకుందామని వెళుతుంటే రూ.15వేలు నుంచి పాతిక వేలు కమీష¯ŒSలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నేతల దృష్టికి వచ్చాయి. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని తూర్పు సెంటిమెంట్‌తో ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం, అందుకు యువత నుంచి స్పందన రావడంతో పార్టీ క్యాడర్లో ఉత్తేజాన్ని నింపింది. -
నిరుద్యోగులను దగా చేసిన సర్కార్
9న జరిగే ‘నిరుద్యోగ పోరు’కు తరలిరావాలి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విజ్ఞప్తి కాకినాడ : నిరుద్యోగ యువతను తెలుగుదేశం సర్కార్ పూర్తిగా దగా చేసిందని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యాన, ఈ నెల 9న కలెక్టరేట్ వద్ద జరిగే నిరుద్యోగ పోరులో విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ పోరును విజయవంతం చేసే అంశంపై స్థానిక డి–కన్వెన్ష¯ŒS హాలులో పార్టీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, విద్యార్థి, యువజన విభాగాలకు చెందిన నాయకులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగాలిస్తామని, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన మాట నమ్మిన యువత తెలుగుదేశం పార్టీని గెలిపించిందన్నారు. ఎన్నికలయ్యాక ఆ ఊసే లేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత గడచిన 32 నెలల కాలానికి ఒక్కో నిరుద్యోగికి రూ.64 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంతబాబు ఆధ్వర్యాన ఈ నెల 9న కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పాల్గొంటారన్నారు. నగరంలోని విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వం కళ్లు తెరిపించేలా ఉద్యమించాలని చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మత్సా గంగాధర్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు కత్తిపూడి శ్రీను, నాగదేవర కార్తీక్, మత్సా లోకేష్‌వర్మ, యువజన, విద్యార్థి విభాగాల నగర అధ్యక్షులు కిషోర్, రోకళ్ళ సత్యనాయణ, మాజీ కార్పొరేటర్ మేడిశెట్టి రమణ తదితరులు పాల్గొన్నారు. -
యువభేరిపై ఇదేం కిరికిరి
చంద్రబాబు సభలకు స్కూల్ బస్సుల్లో జనాన్ని తరలిస్తే ఒప్పు జగన్ సభలకు స్వచ్ఛందంగా విద్యార్థులు తరలి వెళితే తప్పు స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వడంపై విస్మయం సర్కార్ వైఖరిపై సర్వత్రా వ్యక్తమవుతున్న విమర్శలు చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం నిర్వహించినా విద్యార్థులను అడ్డగోలుగా వాడుకొనే తెలుగుదేశం ప్రభుత్వం..ప్రతిపక్ష నేత జగన్ నిర్వహిస్తున్న యువభేరి సభలను అడ్డుకోవడానికి వేస్తున్న ఎత్తులు చూసి విస్తుపోతున్నారు. ఆయన నిర్వహించే రాజకీయ సభలకు ఆర్టీసీ, స్కూల్ బస్సుల్లో జనాన్ని తరలించడమే కాక ఆయా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులిచ్చి మరీ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న అధికారులు.. విజయనగరంలో యువభేరికి స్వచ్ఛందంగా విద్యార్థులు వెళితే స్కూలు యాజమాన్యాలకు నోటీసులిచ్చి వేధించడాన్ని తప్పు బడుతున్నారు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం మోగిస్తున్న యువభేరికి వస్తున్న స్పందన చంద్రబాబు సర్కార్‌కు ఎంతమాత్రం రుచించడంలేదు. జిల్లాల వారీగా నిర్వహిస్తున్న యువభేరికి స్వచ్ఛందంగా యువత, విద్యార్థి లోకం పెద్దఎత్తున పోటెత్తుతుండడంతో సర్కార్‌కు కంటగింపుగా మారింది. ప్రత్యేక హోదాపై మొదటి నుంచీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న చంద్రబాబు.. హోదా కోసం రాష్ట్రమంతా పర్యటిస్తూ అలుపెరగని పోరు సాగిస్తున్న జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ఆదరణను చూసి విద్యార్థులు యువభేరికి రాకుండా ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు. హోదా సాధన కోసం యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు జగన్మోహన్రెడ్డి జిల్లాల్లో నిర్వహించే యువభేరి గంట లేదా గంటన్నరకు మించి జరపడం లేదు. విద్యార్థులు తరగతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు కూడా అందుకు అనుగుణంగానే యువభేరిలో పాల్గొని తిరిగి తరగతులకు వెళ్లిపోతున్నారు. కాకినాడ అంబేడ్కర్ భవ¯ŒSలో యువభేరి జరిగినప్పుడైనా, రెండురోజుల క్రితం విజయనగరంలో నిర్వహించినప్పుడైనా విద్యార్థులు అదే చేశారు. తమ భవిష్యత్ కోసం నిర్వహించే యువభేరికి విద్యార్థులు స్వచ్ఛందంగా తరలిరావడం, అందుకోసం కాలేజీ యాజమాన్యాలను ఒప్పించి వారి బస్సుల్లోనే వస్తున్న క్రమంలో చంద్రబాబు సర్కార్ వాటిని నిరోధించేందుకు నిర్ణయించింది. విజయనగరంలో యువభేరికి విద్యార్థులు వేసుకొచ్చిన బస్సుల యాజమాన్యాలకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదీ వరస.. ∙ గత సెప్టెంబర్ 19న రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్‌పోర్టు విస్తరణ శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు వచ్చారు. ఆ కార్యక్రమానికి సీఎంతో పాటు పౌరవిమానయాన, పట్టణాభివృద్ధిశాఖా మంత్రులు అశోక్‌గజపతిరాజు, వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి రాజమహేంద్రవరం నగరంతో పాటు రూరల్, రాజానగరం నియోజకవర్గాల నుంచి నారాయణ, శ్రీచైతన్య తదితర కాలేజీల బస్సులలో పెద్దఎత్తున జనాన్ని తరలించారు. ∙ అక్టోబర్ 22న కాకినాడలో దోమలపై దండయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబు కాకినాడ టూటౌ¯ŒS పోలీసుస్టేçÙ¯ŒS నుంచి బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఆనందభారతి గ్రౌండ్స్ వరకు పాదయాత్ర నిర్వహించారు. బాబు పాదయాత్ర ప్రారభమైన సమయానికి కంటే అరగంట ముందు నారాయణ, శ్రీచైతన్య, భాష్యం తదితర కాలేజీ బస్సులలో జనాన్ని తరలించారు. పనిలో పనిగా విద్యార్థులను సైతం చంద్రబాబు ర్యాలీకి, బహిరంగసభకు తరలించారు. మరో అడుగు ముందుకేసిన జిల్లా అధికారులు ఆరోజు ఉదయం పూట విద్యాసంస్థలకు సెలవులు కూడా ఇచ్చేశారు. అదేమంటే సీఎం రాకతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కారణాన్ని విద్యాశాఖ చూపించింది. ∙ నవంబర్ 19న రాజమహేంద్రవరం శాటిలైట్‌సిటీలో టీడీపీ జనచైతన్యయాత్ర, చెరుకూరి కల్యాణమండపంలో పార్టీ కార్యకర్తల సమావేశం, ఆర్్ట్సకాలేజీ మైదానంలో డ్వాక్రా మహిళలతో ముఖాముఖి, కోర్టు ఉత్తర్వులతో ఎస్సీ కార్పొరేష¯ŒS చైర్మ¯ŒS పదవి కోల్పోయిన కారెం శివాజీ ఆధ్వర్యంలో చంద్రబాబుకు అభినందన సభ నిర్వహించారు. దాదాపు ఈ కార్యక్రమాలన్నింటికీ నారాయణ, వికాస్, శ్రీచైతన్య తదితర కాలేజీ బస్సుల్లో జనాన్ని తరలించడం గమనార్హం. ∙ ఈ నెల 16న చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ ట్రస్టు, వికాస, నన్నయ్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన జాబ్‌మేళా కార్యక్రమానికి కూడా జనాన్ని కాలేజీ బస్సుల్లో తరలించుకు వచ్చారు. ఈ రకంగా చంద్రబాబు నిర్వహించే రాజకీయ సభల విజయవంతానికి పాఠశాలలు, కాలేజీలకు సెలవులు కూడా ఇచ్చేసి వారి బస్సుల్లో జనాన్ని తరలిస్తే తప్పుకాదు కానీ భావితరాల బంగారు భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా కోసం జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి నిర్వహించే యువభేరికి విద్యార్థులు తమ, తమ కాలేజీ బస్సులలో స్వచ్చందంగా వస్తే మాత్రం నోటీసులతో యాజమాన్యాలను వేధించడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ముక్కున వేలేసుకుంటున్న జనం ఈ క్రమంలో జగన్మోహన్రెడ్డి ర్వహించే యువభేరికి ఒక న్యాయం, తాను నిర్వహించే రాజకీయ సభలకు, సమావేశాలకు మరో న్యాయం అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు సభల విజయవంతానికి జనం కోసం కుప్పలుతెప్పలుగా పాఠశాల, కాలేజీ బస్సులను తరలించడం తప్పు కాదా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. గడచిన నాలుగు నెలల్లో చంద్రబాబు జిల్లాకు మూడు పర్యాయాలు వచ్చారు. ప్రతి సందర్భంలోను కాలేజీలు, పాఠశాలల బస్సులలో జనాన్ని తరలించకుండా కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం గమనార్హం. జిల్లాలో ముఖ్యమంత్రి జరిపిన పర్యటనలు పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. -
గిరిసీమలో రహ‘దారిద్య్రం’
ఆపద ముంచుకొచ్చిన వేళా ‘పథం’ కరువు తరాలుగా పీడిస్తున్న సమస్య సర్కార్ల నిర్లక్ష్యం గిరిబిడ్డల దారి గోడు నేటికీ అరణ్యరోదనే రంపచోడవరం : ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవేలనూ; వాటిపై దూసుకుపోయే వాహనాలనూ ప్రగతికి చిహ్నాలుగా చూపుతూ.. అవన్నీ తాము సాధించిన ఘనతలని ప్రచారం చేసుకునే ప్రభుత్వాలు– ఇప్పటికీ దారీతెన్నూ లేని గిరిసీమల దుస్థితిని పట్టించుకోవు. కొండకోనల నడుమనుండే ఓ గూడెం నుంచి.. పురిటినొప్పులు పడుతున్న ఓ నిండుగర్భిణిని చేరువలోని ఆస్పత్రికి తరలించాలంటే ఓ యజ్ఞం చేసినంతగా కష్టపడాల్సిన పరిస్థితే నేటికీ తూర్పు ఏజెన్సీలో అనేక గ్రామాల్లో నెలకొంది. అత్యవసరాల్లోనే కాదు.. ఏ చిన్ని అవసరానికైనా బాహ్యప్రపంచానికి పయనం కావలసిన వెనుకబాటుతనంతో ఉన్న మన్యగ్రామాలను తరాల తరబడి పీడిస్తున్న రహ‘దారిద్య్రం’ ఎందరు పాలకులు మారినా విరగడ కాలేదు. గిరిజనులు కోరేది.. పాలకులు గొప్పలు చెప్పుకొంటున్న మహా రహదారులను కాదు.. ప్రయాణం ప్రయాసపూరితం, ప్రమాదభరితం కాని కనీసస్థాయి బాటలనే! తూర్పు ఏజెన్సీలోని ఎన్నో రోడ్లు అత్యవసర సమయంలో కనీసం వాహనాలు కూడా ప్రయాణించలేనంత అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. ఐటీడీఏ ఉపాధిహామీ ప్రత్యేక ప్రాజెక్టు పేరుతో వీటీడీఏల ద్వారా నిర్మించిన రోడ్లను బినామీ కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి వేశారు. ఫలితంగా ప్రయాణ ం ‘కాకులు దూరని కీకారణ్యంలో గాలి పటాలను ఎగరేసినంత’ కష్టతరంగా మారింది. అటవీశాఖ అభ్యంతరాల కారణంగా నిలిచిపోయిన రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంతోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏజెన్సీ రోడ్లు.. ఐటీడీఏ పరిధిలో : మెటల్ రోడ్లు : 237 కిలోమీటర్లు బీటీ రోడ్లు : 135 కిలోమీటర్లు రోడ్లు, భవనాల శాఖ: రంపచోడవరం డివిజన్: 440 కిలోమీటర్లు చింతూరు డివిజన్: 270 కిలోమీటర్లు 30 గ్రామాల వారికి ముప్పుతిప్పలే.. గంగవరం నుంచి కొత్తపల్లి వరకు 18 కిలోమీటర్లు మేర ఆర్ అండ్ బి రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది. రెండు సార్లు మరమ్మతులు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. ఈ రోడ్లో మూడు చోట్ల కల్వర్టులు నిర్మించాలి. కానీ ఏళ్ళ తరబడి నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఈ రోడ్లో నిత్యం 30 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తారు. అడుగడుగునా గోతులే.. రంపచోడవరం సమీపంలోని పందిరిమామిడి –చవిటిదిబ్బల రోడ్డు దుస్థితికి చేరుకుంది. ఈ రోడ్డుకు రెండుసార్లు మరమ్మతులు చేసికా ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయి. ఈ రోడ్లో రంపచోడవరం, వై.రామవరం, మారేడుమిల్లి మండలాలకు చెందిన సుమారు 80 గ్రామాల గిరిజనులు రాకపోకలు సాగిస్తారు. వీరు ఐటీడీఏకి రావాలంటే దగ్గర మార్గం ఇదే. 40 కిలోమీటర్లున్న ఈ రోడ్డు అడుగడుగునా గోతులమయం కావడంతో ఆర్టీసీ బస్సు రాకపోకలను రంప రోడ్డుకి మార్చారు. నడవాలన్నా కష్టమే.. కూనవరం –రేపాక మధ్య ఆరు కిలోమీటర్ల రోడ్డు కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా తయారైంది. మన్యంలో లోతట్టు ప్రాంతంలోని ఈ రోడ్డు అత్యవసర సమయంలో మోటార్‌బైక్‌లు కూడా వెళ్లలేని దుస్థితిలో ఉంది. అధికారులకు మాత్రం ఈ రోడ్డు దుస్థితి పట్టడం లేదు. ఈ రోడ్డులో కల్వర్టు కొట్టుకుపోయి రెండు సంవత్సరాలు దాటుతున్నా నిర్మాణం ఊసే లేదు. చినుకు పడితే దారే ఏరు మోతుగూడెం– డొంకరాయి మధ్య ఆర్ అండ్ బి రోడ్డు గోతులమయంగా మారింది. ఈ రోడ్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే కడుపులో పేగులు కదిలిపోవల్సిందే. పొల్లూరు జంక్షన్ నుంచి ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు వర్షం వస్తే మడుగులా మారుతుంది. ఆపద ముంచుకొచ్చినా వాహనం రాదు.. రాజవొమ్మంగి నుంచి అప్పలరాజుపేట మీదుగా అమ్మిరేకుల వెళ్ళే 12 కిలోమీటర్ల రోడ్డు అధ్వానస్థితికి చేరింది. వర్షం వస్తే ఈ రోడ్లో నడిచి వెళ్లడం కూడా కష్టమే. గిరిజనులు అనారోగ్యం పాలైతే కనీసం అంబులెన్స్ కూడా వెళ్లే పరిస్థితి లేదు. మారేడుమిల్లి వయా ఆకుమామిడి కోట: మారేడుమిల్లి నుంచి ఆకుమామిడి కోట మీదుగా గుర్తేడు వెళ్లే 50 కిలోమీటర్ల రోడ్డు గోతులమయమైంది. మారేడుమిల్లి మండలం కుందాడ– మల్లిశాల వరకు 12 కిలోమీటర్ల రోడ్డు రాళ్లు లేచిపోయి ప్రమాదకరంగా మారింది. సున్నంపాడు– రామన్నవలస మధ్య 10 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా ఉంది. -
కొలువుల కలపై పిడుగుపాటు
జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకోసం 15 వేల మంది నిరీక్షణ రాష్ట్ర మంత్రి గంటా ప్రకటనతో వారిలో నిరాశానిస్పృహలు రామచంద్రపురం: ‘జాబు కావాలంటే బాబు రావాలి’.. చంద్రబాబు నాయుడి సారథ్యంలోని టీడీపీ గత ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన నినాదమిది. కానీ గద్దెనెక్కిన తరువాత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగుల్లో నిరాశానిస్పృహలకు కారణమవుతున్నాయి. ఉద్యోగాల్లో ఖాళీలకు నియామకాలు చేపట్టకుండా మెుండిచెయ్యి చూపుతున్నారు. తాజాగా ఉపాధ్యాయుల పోస్టులు ఇక భర్తీ లేనట్లేనని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ప్రకటన ప్రభుత్వం తీరును, చంద్రబాబునాయుడి హామీలలోని మోసాన్ని బహిర్గతం చేస్తోంది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను మంత్రి గంటా ప్రకటన హతాశులను చేసింది. జిల్లాలో సుమారుగా 15 వేల మంది ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు వారంతా కంగుతిని ‘బాబు వస్తే జాబు వస్తుం’దని చెప్పిన టీడీపీపై మండిపడుతున్నారు. అటు పోస్టులను భర్తీ చేయకుండా, ఇటు ఉన్న పోస్టులకు ఎసరు పెట్టే నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతున్నారు. ఏటా 6,500 మంది ఉపాధ్యాయ ఉత్తీర్ణులు జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మెుత్తం 4,300 వరకు ఉన్నాయి. గత డీఎస్సీ నియామకాలు చేపట్టిన అనంతరం జిల్లాలో 240 స్కూల్ అసిస్టెంటు పోస్టులు, 25 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. ఇవికాకుండా ఏటా సుమారు 350 మంది వరకు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తుంటారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచటంతో పదవీ విరమణ చేసేవారు తక్కువగా ఉంటున్నారు. 2017 నాటికి జిల్లాలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనుండటంతో ఎక్కువగా ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీలు ఏర్పడనున్నాయి. జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ కళాశాలలు 59 వరకు ఉన్నాయి. వీటిలో ఏటా సుమారు 5 వేలమంది ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు. ఇక జిల్లాలో ఏటా 1,500 మంది వరకు బీఈడీ అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 15 వేలమంది ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారున్నారని అంచనా. ఆది నుంచీ కొలువులకు ఎసరే.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు పెడుతూనే ఉంది. గత ఏడాది నుంచి పాఠశాలల రేషనలైజేషన్ పేరుతో జిల్లాలో సుమారుగా 370 పాఠశాలలను విలీనం చేసి ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులను మిగిలిన పాఠశాలలకు సర్దుబాటు చేసి ఉపాధ్యాయ పోస్టులను కుదించేశారు. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వమే పాఠశాలల విలీనం పేరుతో ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు పెట్టింది. దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. అయినా ఆశతో ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్న వారికి మంత్రి ప్రకటన అశనిపాతంలా మారింది. ఇచ్చిన హామీని నెరవేర్చాలి.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతీ ఏటా డీఎస్సీని నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు. కానీ అధికారంలోనికి వచ్చిన తరువాత ఉపాద్యాయ పోస్టుల్లో కోత పెడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాము. –ఎస్.రేణుకాదేవి, ఎంఎస్సీ, బీఈడీ, రామచంద్రపురం నిరాశే మిగిలింది.. గతంలో నిర్వహించిన డీఎస్సీని రాసాను, కానీ ఉద్యోగం రాలేదు. ఈ ఏడాది తిరిగి డీఎస్సీ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాను, కానీ రాష్ట్ర మంత్రి చేసిన ప్రకటనతో నిరాశే మిగిలింది. – కుడిపూడి నాగేశ్వరరావు, బీఎస్సీ, బీఈడీ, రామచంద్రపురం ఏకగవాక్ష విధానాన్ని తేవాలి.. ప్రభుత్వ నిర్ణయాలతో పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏక గవాక్ష విధానాన్ని అమలు చేస్తూ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి. దీంతో ఏటా శిక్షణ పొందుతున్న వారికి ఉద్యోగాలతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. –టీవీవీఎస్ తిలక్‌బాబు, పీఆర్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు -
ఇదీ హైవే
గోతులతో అధ్వానంగా జాతీయ రహదారి 216 కనీస మరమ్మతులు లేవు పెద్దపెద్ద గోతులు.. ప్రమాద భరితంగా ఉన్న మార్జిన్లు.. రాళ్లు తేలి అధ్వానంగా కనిపిస్తున్న ఈ రహదారి ఏదో మారుమూల గ్రామంలోదో కాదు. ఇది జాతీయ రహదారి 216. మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా గుర్తించిన పోర్టుల కనెక్టవిటీ కీలక రహదారుల్లో ఇది ఒకటి. అంతటి ప్రాధాన్యమున్న ఈ రహదారి కొన్నేళ్లుగాకనీస మరమ్మతులకు సైతం నోచుకోలేదు. దాంతో అమలాపురం – కాకినాడ– కత్తిపూడి ప్రయాణం నరకప్రాయంగా మారింది. అమలాపురం : జిల్లాలోని కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లాలోని పామర్రు వరకు 216 జాతీయ రహదారి 240 కి.మీ. మేర ఉంది. ఈ రహదారిని త్వరలో నాలుగు లైన్లుగా విస్తరించే తొలి దశ పనులు మొదలు కానున్నాయి. ఆ పనులు జరుగుతాయని చెప్పి ధ్వంసమైన ఈ రహదారికి కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. దాంతో ముమ్మిడివరం మండలం అనాతవరం, గాడిలంక, అన్నంపల్లి, పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పిఠాపురం బైపాస్ రోడ్డు, కత్తిపూడి సమీపంలో గోతులమయంగా మారింది. రెండు,మూడు అడుగుల వైశాల్యంలో ఏర్పడిన గోతులతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో ద్విచక్రవాహనాలు గోతుల్లో పడడంతో ప్రమాదాల పాలవుతున్నారు. కత్తిపూడి నుంచి కాకినాడ వరకు రహదారి అధ్వానంగా మారింది. అసలే ఇరుకుగా ఉండే ఈ రోడ్డు ధ్వంసం కావడంతో ప్రయాణం సాఫీగా సాగడం లేదు. కాకినాడ నుంచి కత్తిపూడి చేరడానికి సాధారణంగా గంట సమయం ఎక్కువ. కానీ ఇప్పుడు రెండు గంటలకు పైగా పడుతోంది. గత ఏడాది అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఈ రహదారికి ఆధునికీకరణ పనులు చేపట్టారు. అనాతవరం నుంచి మురమళ్ల వరకు పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. కీలక రహదారిపై ఇంత అశ్రద్ధా? త్వరలో రహదారిని విస్తరిస్తారనే సాకుతో ఇప్పుడు కనీసం మరమ్మతులు సైతం చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోడసకుర్రు వంతెన ఆరంభమైన తరువాత పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా రాజోలు పరిసర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి ఈ రహదారి మీదుగా రవాణా పెరిగింది. గతంలో భీమవరం, నర్సాపురం నుంచి సిద్ధాంతం, రావులపాలెం, రాజమహేంద్రవం, కత్తిపూడి మీదుగా ఎన్‌హెచ్–16 మీద లారీలు, ఇతర వాహనాల రాకపోకలు ఎక్కువగా సాగేవి. ఒడిశా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌కు ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేపలలోడు లారీలు రాకపోకలు సాగిస్తాయి. ఇప్పుడు ఈ కొత్తమార్గంలో దూరం తగ్గడంతో వాహనాల రాకపోకలు దీనిపై ఎక్కువగా ఉన్నాయి. అయితే గోతులమయమైన ఈ దారిలో ప్రయాణకాలం ఎక్కువ అవుతుండడంతో తిరిగి పాతరహదారినే వినియోగిస్తున్నారు. ఈ జాతీయ రహదారిపైS అమలాపురం నుంచి విశాఖ, కాకినాడ వెళ్లే ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. గమ్యం చేరడం ఆలస్యం కావడంతోపాటు కుదుపులకు ఒళ్లు హూనమైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌హెచ్ అధికారులు ఈ జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
ఇవేం గుడ్లు..?
చూస్తే గుడ్డే అంటారు...కానీ మరో గుడ్డు పక్కన పెడితే మాత్రం వెరీ బ్యాడ్ అని తీరుతారు. ఎందుకంటారా..? తుంగతుర్తి నియోజకవర్గంలో అంగన్వాడీలకు పంపిణీ అవుతున్న గుడ్లను చూస్తే..ఇవి కోడి గుడ్లా లేక పిట్ట గుడ్లా అనే సందేహం వస్తుంది. - తిరుమలగిరి పేద పిల్లలు, బాలింతలు, పిల్లల తల్లులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లను పంపిణీ చేస్తున్నారు. బాలింతలు, గర్భిణీలకు రోజుకు ఒక్కటి చొప్పున నెలకు 30 గుడ్లు, ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు వారానికి నాలుగు, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు వారానికి ఆరు గుడ్లు పంపిణీ చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లను సప్లయ్ చేయడానికి ప్రభుత్వం నిర్వహించే టెండర్లను గెలుచుకొని కాంట్రాక్టర్లు 15 రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. అయితే వీరు సరఫరా చేసే గుడ్లలో కొన్ని మాత్రం చిన్న సైజులో ఉంటున్నాయి. ఈ చిన్న సైజు గుడ్లలో ఏపాటి విటమిన్లు లభిస్తాయని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా మార్కెట్లో విక్రయించే గుడ్లతో పోలిస్తే ఇవి చిన్న సైజులో ఉంటున్నాయి. నెలకు 5లక్షల గుడ్లు పంపిణీ.. తుంగతుర్తి నియోజకవర్గంలో 348 అంగన్వాడీ కేంద్రాల్లో 2807 మంది గర్భిణులు, 2386 మంది బాలింతలు, 1721 మంది ఆరు నెలల లోపు పిల్లలు, 9206 మంది మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు, 5645 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు నెలకు 5 లక్షలకు పైగా గుడ్లను సరఫరా చేస్తున్నారు. అం గన్వాడీ కేంద్రాల్లో చిన్న గుడ్లు కూడా వస్తుండటంతో లబ్ధిదారులు సిబ్బంది తో ఇవేం గుడ్లు అని ప్రశ్నిస్తున్నారు. గుడ్లలోనే విటమిన్లు అదనం.. మిగిలిన ఆహార పదార్థాల పోల్చితే కోడి గుడ్డులోనే అదనంగా కేలరీలు లభిస్తాయి. ఓ మోస్తరు సైజు ఉండే గుడ్డులో 60 క్యాలరీలు, 8 నుంచి 10 గ్రాముల విటమిన్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చిన్న సైజు గుడ్లలో 30 కేరీలు, 4గ్రాముల విటమిన్లు కూడా ఉండే అవకాశం లేవని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ విషయంపై ఐసీడీఎస్ అధికారులను వివరణ కోరగా 50 గ్రాములలోపు ఉన్న కోడి గుడ్లను కాంట్రాక్టర్ల నుంచి తీసుకోవద్దని సిబ్బందికి చెప్పామని పేర్కొన్నారు.