- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు సిగ్గుచేటు
Published Sun, Apr 2 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM
తెలంగాణలో టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు కారాలు మిరియాలు నూరిన సీఎం చంద్రబాబు ఏకంగా గవర్నర్ ప్రజాస్వామ్య విలువలకు కాలరాచారని విమర్శించారు. రాష్ట్రంలో పదవులను ఆశ చూపి టీడీపీలోకి చేర్చుకున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు మంత్రి పదవులు ఇవ్వడంపై చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై వైఎస్సార్‌సీపీ నాయకులు తూర్పార పట్టారు. ఇతరులు తప్పు చేశారంటూ విమర్శించిన చంద్రబాబు ఇదే తప్పు చేశారని మండిపడ్డారు. టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యానందం కూడా చంద్రబాబు వైఖరిని నిరసించారు.
తాటిపాక (రాజోలు) :
తమ పార్టీ జెండాపై నెగ్గి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఆదివారం తాటిపాక వచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ తీరుతో చంద్రబాబు నైజం బయట పడిందని విమర్శించారు. తెలంగాణలో శ్రీని వాస్‌యాదవ్ టీడీపీ నుంచి టీఆర్‌ఎస్ లోకి ఫిరాయించి మంత్రి పదవి పొం దినప్పుడు చంద్రబాబు విమర్శలు, గవర్నర్‌పై చేసిన ఆరోపణలు ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆయన రెండు నాలుకలు, రెండు కళ్లు సిద్ధాంతాన్ని ప్రజలు మరోసారి చూశారన్నారు. శాసనసభలో సమస్యలపై ప్రతి పక్ష నేత, జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిని మాట్లాడనీయకుండా మైక్‌లు కట్ చేస్తున్నారన్నారు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడిపూడి చిట్టబ్బాయి, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రాజోలు, మండపేట కో ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, వేగుళ్ల పట్టాభిరామయ్య, అమలా పురం ఎంపీ నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జీ పాల్గొన్నారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో 175 రోజులను అంబాజీపేట మండలం మాచవరంలో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేకు కట్ చేసి పంచారు.
రాజీనామా చేయించి గెలవాలి
రాజానగరం : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకుని సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా విమర్శించారు. మండలంలోని శ్రీ కృష్ణపట్నంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికల్లో గెలవాలన్నారు. వారిలో ఏ ఒక్కరు గెలిచి నా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని సవాల్ చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను తప్పుపట్టిన ఆయన వైఖరి చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతుందన్నారు, రాజీనామా చేయిం చకుండా, అనర్హత వేటు వేయకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనన్నారు. ఇటువంటి దుశ్చర్యలను అడ్డుకోవలసిన స్పీకర్, గవర్నర్లు కూడా వారికి దాసోహం కావడం సిగ్గుచేటన్నారు. హేయమైన పరిపాలనను ప్రజలు గమనిస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
విలువలకు పాతరేసిన చంద్రబాబు
కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి విమర్శ
కొత్తపేట/రాజోలు : పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను పాతరేశారని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. కొత్తపేటలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు స్వగృహంలో, తాటిపాకలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ మంత్రివర్గంలోకి టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను తీసుకున్నప్పుడు కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఇప్పుడు ఆయన చేసిందేమిటని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలిపించుకుని మంత్రి పదవులు ఇవ్వాలని సవాల్ చేశారు. చంద్రబాబు చర్యలను ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఖండించాలని కోరారు. పార్టీ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బండారు రాజా, రాష్ట్ర పార్టీ ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, జిల్లా కార్యదర్శులు రెడ్డి చంటి,నెల్లి లక్ష్మీపతిరావు, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కముజు సత్యనారాయణమూర్తి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, ఎంపీటీసీ కొండేటి రామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విప్పర్తి వేణుగోపాల్, రాష్ట్ర రైతు విభాగ అధికార ప్రతినిధి జక్కంపూడి తాతాజీ, బి.సూరిబాబు, చింతలపాటి వెంకట్రామరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement