cabinet extension
-
మరో నలుగురు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశముంది. అత్యున్నత విశ్వస నీయవర్గాల సమాచారం ప్రకారం ఈ విస్తరణలో నలుగురు సీనియర్ నేతలకు చోటు లభించనుందని తెలిసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఆగస్టు 6వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపుగా ఖరారైందని విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి సహా 12 మంది మంత్రులున్నారు. పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరిస్తే ఆరుగురిని తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి నలుగురికే అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. మునిసిపాలిటీ ఎన్నికల తరువాత మరో ఇద్దరికీ అవకాశం ఉంటుందని సమాచారం. ఉమ్మడి కరీనంగర్ జిల్లా నుంచి ఇప్పటికే ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ మంత్రివర్గంలో ఉన్నారు. త్వరలో జరగబోయే విస్తరణలో సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్‌కు అవకాశం వస్తే అక్కడి నుంచి మంత్రివర్గంలో ముగ్గురికి స్థానం లభిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ప్రస్తుతం కేసీఆర్ ఒక్కరే ఉన్నారు. తదుపరి విస్తరణలో సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్‌రావుకు స్థానం లభిస్తుంది. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో కేబినెట్లో ఉన్న కేటీఆర్, హరీశ్ రావులను ఈ సారి మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం రాజకీయవర్గాల్లో సంచలనమైంది. మంత్రివర్గంలో స్థానం లభించని కేటీఆర్ టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడయ్యారు. హరీశ్‌రావు మాత్రం ఎనిమిది నెలలుగా సిద్దిపేటతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకలాపాలకు పరిమితమయ్యారు. తుమ్మలకు మరో చాన్స్ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేసిన మాజీ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ జిల్లాలో ఖమ్మం మినహా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో తనకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ భావించారు. పార్టీ అంతర్గత కలహాల కారణంగా తుమ్మల ఓడిపోయారని భావిస్తున్న కేసీఆర్ చివరకు ఆయన్నే మంత్రివర్గంలోని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గడచిన ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు టిక్కెట్ కేటాయించినప్పుడే తుమ్మలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని సీఎం హమీ ఇచ్చినట్లు సమాచారం. మునిసిపల్ ఎన్నికల తర్వాత ఇద్దరికి మునిసిపిల్ ఎన్నికల తరువాత మరో ఇద్దరికీ కేబినెట్లో స్థానం లభించే అవకాశముంది. రాష్ట్ర రైతు సాధికార కమిషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి అవకాశం దొరకవచ్చని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్‌లో మంత్రివర్గంలో తీసుకుంటానని లక్ష్మారెడ్డికి సీఎం హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ముగ్గురికి ప్రాతినిధ్యం లభించినట్లు అవుతుంది. ఇప్పటికే వి.శ్రీనివాస్ గౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. తెలంగాణ తొలి మహిళా మంత్రి సబిత మంత్రివర్గ విస్తరణలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి స్థానం లభిస్తే.. ఆమె తెలంగాణ తొలి మహిళా మంత్రి కానున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మంత్రివర్గంలో ఇప్పటిదాకా మహిళలకు ప్రాతినిధ్యం లభించలేదు. మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదంటూ శాసనసభలో కాంగ్రెస్ విమర్శించగా.. ఈ సారి ఇద్దరు మహిళలకు మంత్రిపదవులు దక్కుతాయని సీఎం పేర్కొన్న సంగతి తెలిసిందే. 2018 శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన సబిత తదనంతరం టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడింట రెండొంతుల మంది టీఆర్ఎస్లో చేరడంతో సబిత అధికారికంగానే టీఆర్ఎస్ శాసనసభ్యులయ్యారు. -
ముహూర్తం ఫిబ్రవరి 10
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గాన్ని ఫిబ్రవరి రెండో వారంలో విస్తరించనున్నారు. అత్యున్నత అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీ వసంత పంచమి పర్వదినాన మంత్రివర్గ విస్తరణ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండటం, మంచి ముహూర్తాలు లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణను ఫిబ్రవరిలో పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే తొలి విడతలో ఎనిమిది మందికే చోటు ఉంటుందని, లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగే విస్తరణలో మరో ఎనిమిది మందికి అవకాశం కల్పించి పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారు, ఎవరెవరికి స్థానం లభిస్తుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. విస్తరణలో మంత్రి పదవులు పొందే ఆ ఎనిమిది మంది ఎవరన్నదానిపై అధికార పార్టీలో ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఈసారి విస్తరణలో కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవచ్చని, అందరూ పాతవారే ఉంటారని కొందరంటుంటే కనీసం ఇద్దరు కొత్త వారు ఉండే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాని వారికి ఇతరత్రా కీలక పదవులు కూడా అప్పుడే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఎవరెవరు మంత్రివర్గంలో ఉండాలి, అవకాశం లేని వారిని ఏ పదవుల్లో నియమించాలన్న విషయంలో సీఎం ఇప్పటికే పలుమార్లు కరసత్తు చేసినట్లు సమాచారం. కేబినెట్ హోదా ఉండే పదవుల్లో డిప్యూటీ స్పీకర్‌తోపాటు శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్, మండలిలో చీఫ్ విప్, శాసనసభలో, మండలిలో ఇద్దరు లేదా ముగ్గురేసి చొప్పున విప్ల పదవులు ఉండనున్నాయి. ఇవి కాకుండా పార్లమెంటరీ కార్యదర్శుల పేరుతో మరికొందరికి కూడా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆ ఎనిమిది మంది ఎవరు? తొలి దశ మంత్రివర్గ విస్తరణలో పాత మంత్రులకే అవకాశం లభించవచ్చు. టీఆర్ఎస్లో, ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నేతలకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి అభీష్టం మేరకు మంత్రి మండలి ఉంటుందని, ఈ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని ఓ సీనియర్ నేత అన్నారు. ‘ముఖ్యమంత్రి ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలన్నీ పరిశీలిస్తే పాత వారికి దాదాపుగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందనే అనుకుంటున్నా. శాసనసభ ఎన్నికల్లో అనేక మంది సిట్టింగ్‌లు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తెలిసినా ఆయన నలుగురు మినహా పాత వారందరికీ టికెట్లు ఇచ్చారు. మహమూద్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలకు కీలక పదవులిచ్చారు. ఇవన్నీ గమనిస్తే ముఖ్యమంత్రి అందరికీ ఏదో విధంగా న్యాయం చేస్తారనిపిస్తోంది’అని ఆ సీనియర్ నేత విశ్లేషించారు. మంత్రివర్గంలో ఎవరు ఉంటారన్న విషయంలో ముఖ్యమంత్రి తన మనోగతాన్ని ఇప్పటిదాకా ఎవరితోనూ పంచుకోలేదని పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు. అయితే సమయం చిక్కినప్పుడల్లా ఆయన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల జాబితా ముందు పెట్టుకొని ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారని ఓ మాజీ మంత్రి అన్నారు. తొలి దశ విస్తరణ రేసులో ఉన్నది వీరే... తొలి మంత్రివర్గ విస్తరణలో స్థానం పొందే వారిలో ఈటల రాజేందర్ (కరీంనగర్), కడియం శ్రీహరి (జనగామ), జి. జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట), సి. లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్), కేటీ రామారావు (సిరిసిల్ల), టి. హరీశ్‌రావు (సిద్దిపేట), తలసాని శ్రీనివాస్ యాదవ్ (గ్రేటర్ హైదరాబాద్), జోగు రామన్న (ఆదిలాబాద్) ఉండొచ్చని ఒక అంచనా. తొలి దశలోనే ఎస్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావిస్తే డీఎస్ రెడ్యానాయక్ (మహబూబాబాద్ జిల్లా)కు అవకాశం రావచ్చని అంటున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్‌గా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ పేరు వినిపిస్తోంది. స్పీకర్ పదవిని ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడంతో ఈసారి పద్మాదేవేందర్‌రెడ్డికి ఆ అవకాశం లేకపోవచ్చు. ఆమెకు మలి దశ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి లేదా మరో కేబినెట్ హోదా పదవి లభించొచ్చు. అయితే మలి విడత మంత్రివర్గ విస్తరణలో పదవులు ఆశించే వారి సంఖ్య రెండు డజన్ల దాకా ఉంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువ మంది శాసనసభకు ఎన్నిక కావడంతో పోటీ కూడా తీవ్రంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల తరువాత విస్తరించనున్న మంత్రివర్గంలో ముగ్గురు రెడ్లకు అవకాశం లభించవచ్చు. ఈ కోటాలో మంత్రి పదవి కోసం నాయిని నర్సింహారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. వారిలో ఒకరిద్దరికి చీఫ్ విప్, విప్ పదవులు కట్టబెట్టే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్... కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాతే రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల మంత్రివర్గ విస్తరణ తరువాత మార్చి రెండో వారంలో తాత్కాలిక బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తికాగానే మలి విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టి జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు సిద్ధం కావాలని ఆయన యోచిస్తున్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు సిగ్గుచేటు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు తెలంగాణలో టీఆర్ఎస్లోకి ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు కారాలు మిరియాలు నూరిన సీఎం చంద్రబాబు ఏకంగా గవర్నర్ ప్రజాస్వామ్య విలువలకు కాలరాచారని విమర్శించారు. రాష్ట్రంలో పదవులను ఆశ చూపి టీడీపీలోకి చేర్చుకున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు మంత్రి పదవులు ఇవ్వడంపై చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై వైఎస్సార్సీపీ నాయకులు తూర్పార పట్టారు. ఇతరులు తప్పు చేశారంటూ విమర్శించిన చంద్రబాబు ఇదే తప్పు చేశారని మండిపడ్డారు. టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యానందం కూడా చంద్రబాబు వైఖరిని నిరసించారు. తాటిపాక (రాజోలు) : తమ పార్టీ జెండాపై నెగ్గి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఆదివారం తాటిపాక వచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ తీరుతో చంద్రబాబు నైజం బయట పడిందని విమర్శించారు. తెలంగాణలో శ్రీని వాస్‌యాదవ్ టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించి మంత్రి పదవి పొం దినప్పుడు చంద్రబాబు విమర్శలు, గవర్నర్‌పై చేసిన ఆరోపణలు ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆయన రెండు నాలుకలు, రెండు కళ్లు సిద్ధాంతాన్ని ప్రజలు మరోసారి చూశారన్నారు. శాసనసభలో సమస్యలపై ప్రతి పక్ష నేత, జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిని మాట్లాడనీయకుండా మైక్‌లు కట్ చేస్తున్నారన్నారు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడిపూడి చిట్టబ్బాయి, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రాజోలు, మండపేట కో ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, వేగుళ్ల పట్టాభిరామయ్య, అమలా పురం ఎంపీ నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జీ పాల్గొన్నారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో 175 రోజులను అంబాజీపేట మండలం మాచవరంలో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేకు కట్ చేసి పంచారు. రాజీనామా చేయించి గెలవాలి రాజానగరం : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకుని సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా విమర్శించారు. మండలంలోని శ్రీ కృష్ణపట్నంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికల్లో గెలవాలన్నారు. వారిలో ఏ ఒక్కరు గెలిచి నా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని సవాల్ చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను తప్పుపట్టిన ఆయన వైఖరి చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతుందన్నారు, రాజీనామా చేయిం చకుండా, అనర్హత వేటు వేయకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనన్నారు. ఇటువంటి దుశ్చర్యలను అడ్డుకోవలసిన స్పీకర్, గవర్నర్లు కూడా వారికి దాసోహం కావడం సిగ్గుచేటన్నారు. హేయమైన పరిపాలనను ప్రజలు గమనిస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. విలువలకు పాతరేసిన చంద్రబాబు కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి విమర్శ కొత్తపేట/రాజోలు : పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను పాతరేశారని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. కొత్తపేటలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు స్వగృహంలో, తాటిపాకలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ మంత్రివర్గంలోకి టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను తీసుకున్నప్పుడు కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఇప్పుడు ఆయన చేసిందేమిటని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలిపించుకుని మంత్రి పదవులు ఇవ్వాలని సవాల్ చేశారు. చంద్రబాబు చర్యలను ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఖండించాలని కోరారు. పార్టీ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బండారు రాజా, రాష్ట్ర పార్టీ ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, జిల్లా కార్యదర్శులు రెడ్డి చంటి,నెల్లి లక్ష్మీపతిరావు, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కముజు సత్యనారాయణమూర్తి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, ఎంపీటీసీ కొండేటి రామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విప్పర్తి వేణుగోపాల్, రాష్ట్ర రైతు విభాగ అధికార ప్రతినిధి జక్కంపూడి తాతాజీ, బి.సూరిబాబు, చింతలపాటి వెంకట్రామరాజు పాల్గొన్నారు.