పరపతి కోసం పాకులాడుతున్నారు | ysrcp press meet | Sakshi
Sakshi News home page

పరపతి కోసం పాకులాడుతున్నారు

Published Sun, Mar 19 2017 12:17 AM | Last Updated on Tue, May 29 2018 3:42 PM

ysrcp press meet

  • ఈవెంట్లకే నిధులు.. ప్రజా సంక్షేమానికి చిల్లు...
  • దోచుకోవడం...దాచుకోవడం.. ఇదే పని
  • సీఎం తీరుపై వైఎస్సార్‌ సీపీ నాయకులు కన్నబాబు, విశ్వరూప్‌ ధ్వజం
  • ఉప్పలగుప్తం (అమలాపురం) : 
    ఎప్పుడైనా ఎక్కడైనా పరపతికోసం పాకులాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబేనని చెప్పక తప్పదు. అమెరికా నుంచి ఆఫ్రికా ఖండంలో ఏ దేశమేగినా తన గురించి తన పాలన గురించి చెప్పునే ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో శనివారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్‌లో పాల్గొన్న కన్నబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చేసింది లేకపోయినా గొప్పను చాటుకునేందుకు ఈవెంట్లు ఏర్పా టు చేసి కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు ప్రజా సంక్షేమానికి పైసలు లేవంటున్నారు. రాష్ట్రంలో ఏఒక్క వర్గానికీ మేలు చేసిన దాఖలాలు లేనేలేవు. రుణమాఫీ అంటూ రైతులను మభ్యపెట్టి వారి సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, రైతుకు అండగా నిలిచే సహకార వ్యవస్థలను రుణమాఫీ పుణ్యమా అని పూర్తిగా అధోగతి పాలు చేశారన్నారు. రైతుకుమేలంటూ జరిగిం దంటే ఒక్క దివంగత వైఎస్సార్‌ హయాంలోనేనన్నారు. జిల్లాలో లక్ష హెక్టార్లలో మినుము సాగు చెయ్యాలని ఆంక్షలు పెట్టిన ముఖ్యమంత్రి జిల్లాలో సాగునీరు ఎంతవరకూ అందుతుంది. అపరాల విత్తనాలు ఏమేరకు అందుతున్నాయో చూశారా అని ప్రశ్నించారు. మొలక శాతం లేని విత్తనాలు అందిస్తూ ఎకరాకు 8 కేజీల విత్తనం సరిపోగా మొలక మొత్తం వస్తుంది ఎకరాకు 16 కేజీలు వేయాలని చెప్పే ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోని చంద్రబాబు ప్రశ్నించిన ప్రతిపక్షనేత జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిపై అనుభవం లేనివాడంటూనే,  ప్రశ్నించిన ప్రతీ వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతి రేకతే తగినవిధంగా బుద్ధి చెపుతుందన్నారు. పార్టీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు అనుచరగణమంతా దోచుకోవడం..దాచుకోవడం అన్న ట్టు ఎక్కడిక్కడ భూ కబ్జాలు, ప్రాజెక్టుల పేరుతో పెర్సంటేజీలు తీసుకోవడం తప్ప ప్రజా పాలనలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలను నమ్మించే రోజులు పోయాయి.. చంద్రబాబును సాగనంపడమే తరువాయి అన్నారు. సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, నాయకులు దంగేటి రాంబాబు, మిండగుదిటి మోహన్, కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు.
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement