- చంద్రబాబు సభలకు స్కూల్ బస్సుల్లో జనాన్ని తరలిస్తే ఒప్పు
- జగన్ సభలకు స్వచ్ఛందంగా విద్యార్థులు తరలి వెళితే తప్పు
- స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వడంపై విస్మయం
- సర్కార్ వైఖరిపై సర్వత్రా వ్యక్తమవుతున్న విమర్శలు
యువభేరిపై ఇదేం కిరికిరి
Published Sun, Dec 25 2016 11:45 PM | Last Updated on Mon, Aug 20 2018 9:21 PM
చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం నిర్వహించినా విద్యార్థులను అడ్డగోలుగా వాడుకొనే తెలుగుదేశం ప్రభుత్వం..ప్రతిపక్ష నేత జగన్ నిర్వహిస్తున్న యువభేరి సభలను అడ్డుకోవడానికి వేస్తున్న ఎత్తులు చూసి విస్తుపోతున్నారు. ఆయన నిర్వహించే రాజకీయ సభలకు ఆర్టీసీ, స్కూల్ బస్సుల్లో జనాన్ని తరలించడమే కాక ఆయా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులిచ్చి మరీ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న అధికారులు.. విజయనగరంలో యువభేరికి స్వచ్ఛందంగా విద్యార్థులు వెళితే స్కూలు యాజమాన్యాలకు నోటీసులిచ్చి వేధించడాన్ని తప్పు బడుతున్నారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం మోగిస్తున్న యువభేరికి వస్తున్న స్పందన చంద్రబాబు సర్కార్‌కు ఎంతమాత్రం రుచించడంలేదు. జిల్లాల వారీగా నిర్వహిస్తున్న యువభేరికి స్వచ్ఛందంగా యువత, విద్యార్థి లోకం పెద్దఎత్తున పోటెత్తుతుండడంతో సర్కార్‌కు కంటగింపుగా మారింది. ప్రత్యేక హోదాపై మొదటి నుంచీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న చంద్రబాబు.. హోదా కోసం రాష్ట్రమంతా పర్యటిస్తూ అలుపెరగని పోరు సాగిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ఆదరణను చూసి విద్యార్థులు యువభేరికి రాకుండా ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు. హోదా సాధన కోసం యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల్లో నిర్వహించే యువభేరి గంట లేదా గంటన్నరకు మించి జరపడం లేదు. విద్యార్థులు తరగతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు కూడా అందుకు అనుగుణంగానే యువభేరిలో పాల్గొని తిరిగి తరగతులకు వెళ్లిపోతున్నారు. కాకినాడ అంబేడ్కర్ భవ¯ŒSలో యువభేరి జరిగినప్పుడైనా, రెండురోజుల క్రితం విజయనగరంలో నిర్వహించినప్పుడైనా విద్యార్థులు అదే చేశారు. తమ భవిష్యత్ కోసం నిర్వహించే యువభేరికి విద్యార్థులు స్వచ్ఛందంగా తరలిరావడం, అందుకోసం కాలేజీ యాజమాన్యాలను ఒప్పించి వారి బస్సుల్లోనే వస్తున్న క్రమంలో చంద్రబాబు సర్కార్ వాటిని నిరోధించేందుకు నిర్ణయించింది. విజయనగరంలో యువభేరికి విద్యార్థులు వేసుకొచ్చిన బస్సుల యాజమాన్యాలకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇదీ వరస..
∙ గత సెప్టెంబర్ 19న రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్‌పోర్టు విస్తరణ శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు వచ్చారు. ఆ కార్యక్రమానికి సీఎంతో పాటు పౌరవిమానయాన, పట్టణాభివృద్ధిశాఖా మంత్రులు అశోక్‌గజపతిరాజు, వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి రాజమహేంద్రవరం నగరంతో పాటు రూరల్, రాజానగరం నియోజకవర్గాల నుంచి నారాయణ, శ్రీచైతన్య తదితర కాలేజీల బస్సులలో పెద్దఎత్తున జనాన్ని తరలించారు.
∙ అక్టోబర్ 22న కాకినాడలో దోమలపై దండయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబు కాకినాడ టూటౌ¯ŒS పోలీసుస్టేçÙ¯ŒS నుంచి బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఆనందభారతి గ్రౌండ్స్ వరకు పాదయాత్ర నిర్వహించారు. బాబు పాదయాత్ర ప్రారభమైన సమయానికి కంటే అరగంట ముందు నారాయణ, శ్రీచైతన్య, భాష్యం తదితర కాలేజీ బస్సులలో జనాన్ని తరలించారు. పనిలో పనిగా విద్యార్థులను సైతం చంద్రబాబు ర్యాలీకి, బహిరంగసభకు తరలించారు. మరో అడుగు ముందుకేసిన జిల్లా అధికారులు ఆరోజు ఉదయం పూట విద్యాసంస్థలకు సెలవులు కూడా ఇచ్చేశారు. అదేమంటే సీఎం రాకతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కారణాన్ని విద్యాశాఖ చూపించింది.
∙ నవంబర్ 19న రాజమహేంద్రవరం శాటిలైట్‌సిటీలో టీడీపీ జనచైతన్యయాత్ర, చెరుకూరి కల్యాణమండపంలో పార్టీ కార్యకర్తల సమావేశం, ఆర్‌్ట్సకాలేజీ మైదానంలో డ్వాక్రా మహిళలతో ముఖాముఖి, కోర్టు ఉత్తర్వులతో ఎస్సీ కార్పొరేష¯ŒS చైర్మ¯ŒS పదవి కోల్పోయిన కారెం శివాజీ ఆధ్వర్యంలో చంద్రబాబుకు అభినందన సభ నిర్వహించారు. దాదాపు ఈ కార్యక్రమాలన్నింటికీ నారాయణ, వికాస్, శ్రీచైతన్య తదితర కాలేజీ బస్సుల్లో జనాన్ని తరలించడం గమనార్హం.
∙ ఈ నెల 16న చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ ట్రస్టు, వికాస, నన్నయ్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన జాబ్‌మేళా కార్యక్రమానికి కూడా జనాన్ని కాలేజీ బస్సుల్లో తరలించుకు వచ్చారు. ఈ రకంగా చంద్రబాబు నిర్వహించే రాజకీయ సభల విజయవంతానికి పాఠశాలలు, కాలేజీలకు సెలవులు కూడా ఇచ్చేసి వారి బస్సుల్లో జనాన్ని తరలిస్తే తప్పుకాదు కానీ భావితరాల బంగారు భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా కోసం జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి నిర్వహించే యువభేరికి విద్యార్థులు తమ, తమ కాలేజీ బస్సులలో స్వచ్చందంగా వస్తే మాత్రం నోటీసులతో యాజమాన్యాలను వేధించడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.
ముక్కున వేలేసుకుంటున్న జనం
ఈ క్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి ర్వహించే యువభేరికి ఒక న్యాయం, తాను నిర్వహించే రాజకీయ సభలకు, సమావేశాలకు మరో న్యాయం అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు సభల విజయవంతానికి జనం కోసం కుప్పలుతెప్పలుగా పాఠశాల, కాలేజీ బస్సులను తరలించడం తప్పు కాదా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. గడచిన నాలుగు నెలల్లో చంద్రబాబు జిల్లాకు మూడు పర్యాయాలు వచ్చారు. ప్రతి సందర్భంలోను కాలేజీలు, పాఠశాలల బస్సులలో జనాన్ని తరలించకుండా కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం గమనార్హం. జిల్లాలో ముఖ్యమంత్రి జరిపిన పర్యటనలు పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.
Advertisement
Advertisement