గోదావరి బోటు ప్రమాద బాధితులను మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు. రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అందుబాటులో వైద్య సేవలు లేకుంటే తక్షణమే మెరుగైన వైద్యం కోసం విశాఖ, రాజమండ్రికి తరలించారని ఆదేశాలు ఇచ్చారు. బాధితు కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.