మనీ లాండరింగ్‌లో బాబు దిట్ట: మంత్రి అవంతి | Minister Avanthi Srinivas Slams On Chandrababu Naidu And Lokesh In Visakhapatnam | Sakshi
Sakshi News home page

‘ఆయన డైరీ పూర్తిగా పరిశీలిస్తే అక్రమాలు బయటపడతాయి’

Published Fri, Feb 14 2020 10:41 AM | Last Updated on Fri, Feb 14 2020 10:51 AM

Minister Avanthi Srinivas Slams On Chandrababu Naidu And Lokesh In Visakhapatnam - Sakshi

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, విశాఖపట్నం: టీడీపీలో అవినీతి తారాస్థాయిలో ఉందని తాను ఎన్నికలకు ముందే చెప్పానని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవాం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా పని చేస్తున్నప్పుడు ప్రజాధనానికి కాపలాదారుడిగా ఉండాలి కానీ.. దోపిడీ దారుడిగా కాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును విమర్శించారు. టీడీపీ హయాంలో పోలవరం, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులలో భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. తమ అవినీతిని ఎవరూ పట్టుకోలేరని బాబు భావించారన్నారు. మనీ లాండరింగ్‌లో చంద్రబాబు దిట్టని బాబు, లోకేష్‌లను కూడా పూర్తిగా విచారించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఒక పీఏ దగ్గరే రెండువేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగితే.. ఇక చంద్రబాబు, లోకేష్‌ల దగ్గర ఎన్ని లక్షల కోట్లు దొరుకుతాయోనన్నారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు కాబట్టే స్పందించటం లేదని, ఎవరు దోపిడీదారులో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. లోతైన విచారణ జరిగితే చంద్రబాబు అక్రమాలు పూర్తిగా బయటపడతాయని మంత్రి వ్యాఖ్యానించారు.

ఇక యలమంచిలి ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు మాట్లాడుతూ.. డొల్లకంపెనీల పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్‌ కో లక్షలాది కోట్ల రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ దగ్గర చాలా విషయాలున్నాయన్నారు. ఆయన డైరీని పూర్తిగా పరిశీలిస్తే భారీ అక్రమాలు బయటపడతాయని తెలిపారు. విదేశాలకు పారిపోకుండా చంద్రబాబు, లోకేష్‌ల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలని, వేంటనే వారిని విచారించాలన్నారు. గత అయిదేళ్ల పాలనలో అంతా అవినీతిమయమేనని.. ఇక బాబు రాజకీయ జీవితం ముగిసిందని పేర్కొన్నారు. చంద్రబాబు వద్ద దేశంలో ఒక బడ్డేట్‌కు సరిపడా అక్రమాస్థు ఉన్నాయని, రెండు ఎకరాల నుంచి లక్షల కోట్ల వరకు అక్రమాస్థుల సంపాదించారన్నారు. ఐటీ దాడుల వ్యవహారంలో లోతైన విచారణ జరుగుతుందనే తాము భావిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement