ఇటీవల బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుడు సంభవించడంతో 10 మంది గాయపడ్డారు. పేలుడు సమయంలో గాయపడ్డ బాధితులకు సంఘీభావం తెలిపేందుకు ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం హైదరాబాద్‌లోని రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు.
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలంతో కేఫ్‌కు ఉన్న అనుబంధాన్ని గురించి గుర్తు చేస్తూ.. బెంగళూరులో జరిగిన సంఘటనను అసదుద్దీన్ ఖండించారు.
అసదుద్దీన్ ఎక్స్ (ట్విటర్) వేదికగా రామేశ్వరం కేఫ్‌లో ఫుడ్ బాగుందని. ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలం పేరు కేఫ్ అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమని, రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ అనేది ఓ పిరికిపంద చర్య అని వెల్లడించారు. కేఫ్‌లో భోజనం చేస్తూ అసదుద్దీన్ అక్కడున్న కొంతమంది సందర్శకులతో కూడా మాట్లాడారు.
ఇకపోతే.. బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన సంఘటన మీద కర్ణాటక పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. పేలుడుకు సంబంధించిన ఖచ్చితమైన నిజానిజాలను తెలుసుకోవాలని అక్కడి ప్రభుత్వం అధికారులను ఇప్పటికే ఆదేశించింది. అంతే కాకుండా ఇకపైన కూడా జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్‌ను పెంచాలని అధికారులను ఆదేశించారు.
రామేశ్వరం కేఫ్ ఫౌండర్ అండ్ సీఈఓ రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని, అటువంటి చర్యలకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనలో గాయపడిన ప్రజలకు, సిబ్బందికి తన సంఘీభావం తెలియజేస్తూ.. వారికి అండగా మేమున్నామనే ధైర్యం చెప్పారు.
#WATCH | Telangana: AIMIM chief Asaduddin Owaisi visited The Rameshwaram cafe in Hyderabad, in solidarity with #RameshwaramCafeBlast. pic.twitter.com/KLxODSQMIB
— ANI (@ANI) March 2, 2024
Comments
Please login to add a commentAdd a comment