సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి పౌరస్మృతి బిల్లు రూపకల్పన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కాగా, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఈ బిల్లును ప్రవేశపెట్టనుంద. ఈనేపథ్యంలో ప్రతిపక్షాలు ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నాయి. ఇక, తాజాగా ఉమ్మడి పౌరస్మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ కేంద్రంపై సంచలన కామెంట్స్ చేశారు.
అయితే, యూనిఫామ్ సివిల్ కోడ్‌పై సోమవారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖాలీద్ సయీఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది. ఈ సమావేశంలో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్భరుద్దీన్, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, బోర్డు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టమౌతున్నది.
దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా గత తొమ్మిదేండ్లుగా దేశ ప్రజల అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది బీజేపీ ప్రభుత్వం. దేశంలో పనులేమీ లేనట్టు.. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది. అందుకే బీజేపీ తీసుకోవాలనుకుంటున్న యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
యూసీసీతో అందరికీ ఇబ్బందులే: ఒవైసీ
మరోవైపు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. బీజేపీ సర్కార్ తెస్తామన్న యూసీసీని వ్యతిరేకించాలని కేసీఆర్‌ను కోరాం. సీఏఏను వ్యతిరేకిస్తూ టీఎస్ అసెంబ్లీలో మొదటగా తీర్మానం చేసింది. యూసీసీ తీసుకురావడం ద్వారా దేశంలోని భిన్నత్వాన్ని దెబ్బతీయాలని మోదీ కుట్ర చేస్తున్నారు. యూసీసీ కేవలం ముస్లింలకే కాదు.. హిందువులతో పాటుగా క్రిస్టియన్లు, వివిధ ఆదివాసీ వర్గాలకు ఇబ్బంది. దేశంలో భిన్నత్వం ఉండటం మోదీకి ఇష్టం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: కేటీఆర్ కొడుకు హిమాన్షు పెద్ద మనస్సు.. ప్రశంసల వర్షం
Comments
Please login to add a commentAdd a comment